క‌మ‌లంతో కారు ప్ర‌యాణం?.. వచ్చే ఎన్నికల నాటికి పొత్తుపొడుపు!?

Publish Date:Mar 25, 2026

Advertisement

బీఆర్ఎస్ తో బీజేపీ  పొత్తు పెట్టుకుంటే  త‌ప్పేంటి? ఒక మీడియా  చిట్ చాట్ లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న మాటిది.  ఒక కాలు బాగా లేన‌పుడు మ‌రొక‌రి సాయం తీసుకోవ‌డం ఎంత స‌హ‌జ‌మో ఇదీ అంతే అంటూ తెలంగాణ రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపారాయన. అయితే ఇది కేవ‌లం రాకేష్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయమా?   పార్టీ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. బీఆర్ఎస్, బీజేపీల దోస్తీ గురించి ఇప్పుడే కాదు.. చాలా రోజుల నుంచి ఎడతెగని చర్చ నడుస్తూనే ఉంది. న‌డుస్తూనే ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్ గత చాలా కాలంగా చెబుతూ వస్తున్నది.  

గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ. ఇక లోక్  స‌భ ఎన్నిక‌ల నాటికి పుంజుకుని 8 ఎంపీల‌ను కైవ‌సం  చేసుకుని ప‌ర్లేద‌నిపించుకుంది. దీనిపైనా కాంగ్రెస్ కామెంట్లు చేసేది. ఎంపీ  ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ బీజేపీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందం వ‌ల్లే ఇన్ని సీట్లు బీజేపీకి వ‌చ్చాయ‌ని విమర్శలు గుప్పించింది.

అంటే  బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఆన్ బీజేపీ  అన్న‌ది గ‌త కొంత‌కాలంగా.. రాష్ట్రంలో ఒక ప్ర‌త్యేక అధ్యాయం న‌డుస్తూనే ఉందన్నమాట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ పైపై మాట‌ల‌కే ప‌రిమిత‌మైన ఈ ధోర‌ణి.. రేప‌టి రోజున నిజ‌మైనా ఆశ్చ‌ర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో  బీజేపీ, బీఆర్ఎస్  బ‌లం గ‌ట్టిగా 45 సీట్లు కూడా దాట‌లేదు. తెలంగాణ‌లో అధికారం చేప‌ట్ట‌డానికి మినిమం 60 ఉండాలి. దీంతో ఈ రెండు పార్టీలు ఇప్ప‌టికీ అలాగే ప్ర‌తిప‌క్షంలో ఉంటూ వ‌స్తున్నాయి.

ఒక వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. రెండు పార్టీలూ కూట‌మి  క‌డితే.. అది స‌త్ఫ‌లితాల‌ను ఎందుకివ్వ‌ద‌నే ఈక్వేష‌న్లు ఇప్పుడు గట్టిగా చర్చలోకి వస్తున్నాయి. మాములుగా అయితే ఇక్క‌డ బీజేపీ.. టీడీపీ, జ‌న‌సేన‌తో జ‌ట్టు క‌ట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్క‌డ టీడీపీ.. రేవంత్ రెడ్డితో ఉన్న  స్నేహం కొద్దీ కాంగ్రెస్ ని ఒక ఫ్రెండ్లీ టీం గానే భావిస్తోంది. దీంతో గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన మాత్ర‌మే పొత్తు పెట్టుకున్నాయి. 

బీజేపీ, బీఆర్ఎస్ క‌లిసిపోతే.. జ‌న‌సేన  ప‌రిస్థితి ఏంటి? అన్న‌ది కూడా ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశ‌మే. తెలంగాణ ఏర్ప‌డ్డాక  2014, 18, 23 ఎన్నిక‌ల్లో.. దాదాపు ఒంట‌రిగా పోటీ చేసిన బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? ఆ పార్టీకి అస‌లు పొత్తు అల‌వాటు ఉందా? అంటే ఉద్య‌మ పార్టీగా ఉన్న‌పుడైతే ఎంద‌రితోనో కారు పార్టీ పొత్తులు పెట్టుకున్న ప‌రిస్థితులున్నాయి. 

2004లో యూపీఏతో, 2009లో టీడీపీ, సీపీఐ, సీపీఎంతో మ‌హా కూట‌మి క‌ట్టింది. ఇక 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఎస్పీతో  పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ఏనుగు పార్టీకి కేటాయించింది. పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ ద‌శ‌ల్లో వామ‌ప‌క్షాల‌తో అవగాహ‌న ఉండ‌టం వంటివి జ‌రుగుతూనే వ‌చ్చాయి. ఆయా కాల‌మాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. పొత్తులు పెట్టుకోవ‌డం, విడిపోవ‌డం చేస్తూనే వ‌చ్చింది నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్. కాబ‌ట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు అనే అంశ‌మేమీ కొత్త‌ది కాదు. బీజేపీ కూడా ఇక్క‌డ ఎలాగైనా స‌రే అధికారంలో పాల్పంచుకోవాలంటే బీఆర్ఎస్ తో పొత్తు విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌క పోవ‌చ్చు కూడా. 

దానికి తోడు ఢిల్లీ లిక్క‌ర్ కేసులో.. క‌విత ఎలాంటి త‌ప్పు చేయ‌లేదంటూ వ‌చ్చిన తీర్పు సైతం ఇందులో భాగ‌మేనా అన్న అనుమానాలున్నాయి. వీట‌న్నిటినీ బ‌ట్టి చూస్తుంటే 2029 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, బీజేపీ క‌ల‌సి  న‌డిచేలా  క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మున్సిపాల్టీల్లో చాలా చోట్ల క‌లిసిన‌ట్టు క‌నిపిస్తోన్న ఈ రెండు పార్టీలు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి పొత్తు పెట్టుకుని పోటీకి దిగేలా తెలుస్తోంది. 

న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో బీఆర్ఎస్ కి ఎలాగూ గ‌ట్టి  ప‌ట్టే ఉంది. ఇక ఉత్త‌ర తెలంగాణ‌, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మ‌రింత ప‌ట్టు సాధించ‌గ‌లిగితే.. ఈ పొత్తు కూడా వ‌ర్క‌వుట్ అయ్యేలా కొడుతోంది. కాబ‌ట్టి ఈ  పొత్తు ముందు ముందు రోజుల్లో పొడిచేలాగానే క‌నిపిస్తోందంటారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు.

By
en-us Political News

  
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.