అర్నబ్ తీవ్ర తుపాను కాదు: అతి తీవ్ర తుపాను: వాతావరణ శాఖ హెచ్చరిక: ఆంధ్రా తీరం అల్లకల్లోలం.!
Publish Date:Oct 27, 2026
Advertisement
అర్నాబ్ తీవ్ర తుపాను కాదనీ, అతి తీవ్ర తుపాననీ వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే కోస్తాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ, అనకాపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉన్న అర్నబ్ తుపాను.. రానున్న గంటలలొ మరింత తీవ్రమై రేపటికి బాపట్ల, విశాఖ మధ్య యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 140 కిలోమీటర్లు, అంత కంటే ఎక్కువ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావం కారణంగా కోస్తాంధ్ర యానాం ప్రాంతాల్లో మూడు రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాగా తుపాను ప్రభావం కోస్తాంధ్రపైనే కాకుండా రాయలసీమపైనా ప్రభావం చేపే అవకాశం ఉంది. అలాగే తెలంగాణపై కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉంటుంది. తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్నాబ్ తుపాను నుంచి సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడాలన్న లక్ష్యంతో అప్రమత్తంగా ఉంటూ,. అవసరమైన చర్యలు చేపట్టింది. రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. [Arnab Cyclone Update Andhra Pradesh, Super Severe Cyclone: Bapatla, Visakhapatnam, Yanam, Heavy Rains, Super Tides, Telugu One]
http://www.teluguone.com/news/content/arnab-cyclone-update-andhra-pradesh-43-235543.html





