పార్టీ రెబల్స్ కు జనసేనాని హెచ్చరిక: నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆదేశం.!

Publish Date:Oct 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక   ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు,  ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులు, ఆశావహులకు  స్పష్టమైన సందేశం ఇచ్చారు. కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, పార్టీ అధికారికంగా కేటాయించిన బీఫామ్‌ల ఆధారంగా పోటీ చేసే అభ్యర్థుల విజయం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని  పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీఫామ్ లేకుండా పోటీలో నిలవాలని భావిస్తున్న రెబల్స్  తక్షణమే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని   హెచ్చరించారు.

వివిధ రాజకీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎంతో క్లిష్టమైన సవాల్‌తో కూడుకున్నదైప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ, కూటమి పార్టీల  సమన్వయంతో ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించినట్లు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య  సీట్ల సర్దుబాటు పూర్తయ్యిందనీ, అభ్యర్థుల తుది జాబితాను ఖరారు అయ్యిందనీ చెప్పిన పవన్ కల్యాణ్..  కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని విస్పస్ట హెచ్చరిక జారీ చేశారు.  నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే లోపు రెబల్స్ సమస్యను పూర్తిగా పరిష్కరించుకుని, కూటమి బలాన్ని మరింత ఏకతాటిపైకి తీసుకురావాలని జనసేన అధినేత విస్పష్టంగా చెప్పారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రదర్శించిన ఐక్యత వల్లే అఖండ విజయం సాధ్యమైందని, అదే స్ఫూర్తిని ఇప్పుడు స్థానిక  పోరులోనూ కొనసాగించాలన్నారు. పార్టీ కోసం కష్ట కాలంలో నిలబడి త్యాగాలు చేసిన నాయకులకు,  కార్యకర్తలకు భవిష్యత్తులో సముచితమైన ప్రాధాన్యత కల్పిస్తామని, ఎవరికీ అన్యాయం జరగదని  భరోసా ఇచ్చారు.

పార్టీ శ్రేణులు వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి, కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్న కీలక సమయంలోనే తుపాను ముప్పు ముంచుకొచ్చిందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సమర్థవంతంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ చర్యలు తీసుకున్నారని కొనియాడారు. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ యంత్రాంగం,  నాయకత్వం సమన్వయంతో పనిచేసిన తీరు ప్రజలకు భరోసా కల్పించిందన్నారు 

[Pawan Kalyan Caution Rebel Candidates, Ap Local Body Elections, Janasena Rebels, Allience Unity, Alliance Seat Sharing, Telugu One]

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.