కనిపిస్తున్న అర్నాబ్ ఎఫెక్ట్: ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. పెనుగాలులు.!

Publish Date:Oct 27, 2026

Advertisement

 పెను తుపాను అర్ణబ్  ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు కమ్ముకుని పగలే చిమ్మచీకట కమ్మేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్27) రాత్రి ఉత్తరాంధ్ర జిల్లాలలో పాటు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్ని గంటలుగా సముద్రంలో తీవ్ర రూపం దాల్చిన ఈ తుపాను క్రమంగా తీరం వైపు దూసుకువస్తుండటంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, ఉదయం నుంచే మేఘావృతమైంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.   శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. తీర ప్రాంతాల్లో గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.  సముద్రంలో అలలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు వేగవంతం చేశారు. 

వాతావరణంలో వచ్చిన ఈ అకస్మాత్ మార్పుల కారణంగా సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పాఠశాలలు, విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా, అత్యవసర సేవల సిబ్బందిని మినహా మిగిలిన శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేశారు. రోడ్లపైకి చెట్లు కూలిపోయే ప్రమాదం ఉండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

గతంలో వచ్చిన  తుపానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్  బలగాలను ఇప్పటికే  మోహరించారు. సహాయక సామగ్రిని, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఏ క్షణంలోనైనా అధికారులను సంప్రదించేందుకు ప్రత్యేక టెలిఫోన్ నంబర్లు, వాట్సాప్ హెల్ప్‌లైన్‌లను అందుబాటులోకి తెచ్చారు. 

కాగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈ రాత్రి నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

[Cyclone Arnab Effect Started, Heavy Rains  North Andhra, Supertides, Sea, Strong Winds, Telugu One]

By
en-us Political News

  
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఉప్పాడ  తీరంలో సముద్రం ప్రళయ భీకరంగా మారింది. రాకాసి అలల తాకిడికి  బీచ్ రోడ్డు కోతకు గురైంది. బండరాళ్లు సైతంకొట్టుకుపోయాయి. పల్లిపేట, రంగంపేట గ్రామాలను సముద్ర నీరు ముంచెత్తింది.  తుపాను తీరం దాటినా దాని ప్రభావం మరో 12 గంటల పాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.