ఏపీలో జిల్లా పరిషత్ ల పునర్విభజన.. జీవో జారీ.!

Publish Date:Sep 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  స్థానిక  ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జడ్పీల పునర్విభజన ప్రక్రియకు ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కొత్తగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో గతంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కొనసాగిన 13 జడ్పీల  స్థానంలో   28 జెడ్పీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా రూపుదిద్దుకున్న మార్కాపురం, పోలవరం తదితర ప్రాంతాలకు సైతం ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలనా సౌలభ్యం, ప్రజలకు ప్రభుత్వ ఫలాలు మరింత చేరువయ్యేలా ఈ  మార్పులు జరిగాయి. 

 కొత్త జిల్లా పరిషత్‌ల సమర్థవంతమైన నిర్వహణపై  అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అదనంగా 15 జెడ్పీ సీఈవో పోస్టులతో పాటు మరో 15 డిప్యూటీ సీఈవో పోస్టుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ పరిపాలనా మార్పుల కోసం 30 కీలక ఉన్నత స్థాయి అధికారుల పోస్టులను కొత్తగా కేటాయించేలా ప్రణాళికలు రూపొందించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. పాలక వర్గాల గడువు పూర్తి కాగానే ఈ నూతన 28 జెడ్పీల వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి  వస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని దాదాపు 660 మండలాలను నూతనంగా ఏర్పడిన జెడ్పీల పరిధిలోకి మ్యాపింగ్ చేయాలని సంబంధిత అధికారులకు  ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక ఉద్యోగుల సర్దుబాటు విషయంలోనూ ప్రభుత్వం  జాగ్రత్తలు తీసుకుంటోంది. అదనపు సిబ్బంది నియామకాలకు బదులుగా, ప్రస్తుత పనిభారం ఆధారంగా అందుబాటులో ఉన్న సిబ్బంచినే కొత్త జెడ్పీలకు కేటాయించి సర్దుబాటు చేయాలని భావిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేలోగా ఈ జడ్పీల పునర్విభజన,  మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Andhra Pradesh Zilla Parishads, AP District Reorganisation, Local Body Elections AP, ZP CEO Posts, AP News, Telugu One
 

By
en-us Political News

  
మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు.
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.