సీమకు రైల్వే కనెక్టివిటీ.. 2వేల 505 కోట్లతో కొత్త రైల్వేలైన్.!

Publish Date:Sep 5, 2026

Advertisement

రాయలసీమలో రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే  లక్ష్యంతో   కీలక నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరమయ్యాయి.  కడప, శ్రీ సత్యసాయి,  అనంతపురం జిల్లాలను  అనుసంధానిస్తూ సరికొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు దిశగా చర్యలు మొదలయ్యాయి.  ఇందులో భాగంగా కడప జిల్లాలోని ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ    110 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ వేయనున్నారు. 2 వేల 505 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.  ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డీపీఆర్ రెడీ అయ్యింది. ఈ డీపీఆర్   కేంద్ర రైల్వే బోర్డు పరిశీలన దశలో ఉంది. 

సీమలో దశాబ్దాలుగా రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు ఈ రైల్వే ప్రాజెక్టు వరంగా మారనుంది.    ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ ముద్దనూరు నుంచి ప్రారంభమై పులివెందుల, ముదిగుబ్బ మీదుగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం వరకు సాగుతుంది. దీని ద్వారా రాయలసీమ ప్రాంతం నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు నేరుగా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే రాయలసీమ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణ సమయం,  దూరం గణనీయంగా తగ్గనున్నాయి.

నిత్యం ఉద్యోగాలు, చదువులు మరియు వివిధ వ్యాపారాల నిమిత్తం బెంగళూరుకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు,  విద్యార్థులకు ఈ రైల్వే లైన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణీకుల రాకపోకలకే కాకుండా,   ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధి. పారిశ్రామిక రంగ పురోగతికి  ఈ రైల్వే లైన్ వెన్నెముకగా నిలుస్తుంది. కడప, ఉమ్మడి అనంతపురం పరిసర ప్రాంతాలలో విస్తారంగా సాగవుతున్న అరటి, బత్తాయి, మామిడి, చీనీ వంటి ఉద్యానవన పంటల రవాణాకు ఈ రైల్వే లైన్ దోహదం చేస్తుంది. దీనివల్ల రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు, ముఖ్యంగా మెట్రో మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గ్రానైట్, సిమెంట్, మైనింగ్,  ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి.    పుట్టపర్తి వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లే యాత్రికులకు, పర్యాటకులకు కూడా ఈ రైలు మార్గం ద్వారా ప్రయాణం   సులభతరం అవుతుంది.  


[New Railway Line Rayalaseema, Muddanur Mudigubba Railway, Pulivendula Railway Line, Kadapa Bangalore Train, AP New Railway Projects, Puttaparthi Train Route, Rayalaseema Railway Development]

By
en-us Political News

  
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.