లిక్విడ్ లిప్‌స్టిక్  ఇలా అప్లై చేస్తే అదుర్స్!   పెదవుల అందాన్ని పెంచడానికి లిప్స్టిక్ వాడతారు. ఒకప్పుడు లిప్స్టిక్ కోన్ రూపంలో లభించేది. కానీ అన్నీ డవలప్ అయినట్టు ఫ్యాషన్ కూడా డవలప్ అయిపోయింది. లిప్స్టిక్ కాస్తా లిక్విడ్ రూపంలోకి మారింది. పైపెచ్చు లిక్విడ్ లిప్స్టిక్ కూడా వేసుకోవాల్సిన రీతిలో వేసుకుంటే చాలా కాలం పాటు పోకుండా పెదవులను మెరిపిస్తుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు ఈ కింది టిప్స్ పాటిస్తే చాలు.. మేకప్ అంటే అంతగా ఇష్టం లేని మహిళలు కూడా లిప్స్టిక్, కాటుక పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పట్లో వచ్చిన లిక్విడ్ లిప్స్టిక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు పెదవులకు మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా మృదువుగా ఉంటాయి. పైగా లిప్స్టిక్ పెదవులు అంతా బాగా పరచుకుంటుంది. కానీ లిక్వి్డ్ లిప్స్టిక్ కు మాయిశ్చరైజర్ అవసరం లేదు. పెదవులు మరీ గరుకుగా ఉంటే తప్ప మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా చాలా లైట్ గా మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది. పెదవులు పర్ఫెక్ట్ షేప్ కనిపించాలంటే మాత్రం లిప్ లైనర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఏ రంగు లిప్స్టిక్ వాడతారో ఆ రంగు  లిప్ లైనర్ ను ఎంచుకోవాలి. ఇద కూడా చాలా సన్నగా ఉండాలి. అలా ఉంటే పెదవుల షేప్ బాగా సెట్ అవుతుంది. మరీ ముఖ్యంగా పెదవుల మూలలను సరిచేయడం మరవకూడదు. సాధారణ లిప్స్టిక్ కు,  లిక్విడ్ లిప్స్టిక్ కు తేడా ఉంటుంది.  లిక్విడ్ లిప్స్టిక్ క్రీమ్ లాగా ఉంటుంది. దీన్ని సాధారణ లిప్స్టిక్ మాదిరి రెండు మూడు లేయర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. అలా వేస్తే పెదవులు చాలా థిక్ గా వికారంగా కనపిస్తాయి. అందుక లిక్విడ్ లిప్స్టిక్ ను కేవలం ఒక లేయర్ మాత్రమే అప్లై చేయాలి.  అది వేసాక కూడా కొద్దిసేపు దాన్ని అలాగే వదిలెయ్యాలి అలా చేస్తే లిప్స్టిక్  ఆరిపోతుంది. ఒకవేళ లిక్విడ్ లిప్స్టిక్ ఎక్కువగా అప్లై చేసి ఉంటే టిష్యూ పేపర్ సహాయంతో దాన్ని సెట్ చేసుకోవాలి. ఇందుకోసం టిష్యూ పేపర్ ను పెదవుల మధ్య పెట్టుకుని పెదవులను గట్టిగా ప్రెస్ చేయ్యాలి. ఇలా చేస్తే పెదవుల మీద అదనపు లిక్విడ్ ఈజీ గా తొలగిపోతుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేయడం గురించి తెలుసుకుని ఉంటారు కానీ కరెక్ట్ రంగు ఎంపిక చేసుకునేవారు చాలా అరుదు. అందుకే లిక్విడ్ లిప్స్టిక్ సరైన రంగు ఎంచుకోవడం ముఖ్యం. ఇలా పెదవుల అందం అదుర్స్.                                                *నిశ్శబ్ద

చిన్నవయసులోనే ఆంటీలా కనబడుతున్నారా...  ఇలా చేస్తే టీనేజ్ గర్ల్ అయిపోతారు! వయసును బట్టి పిలుపు అనేవారు. కానీ ఇప్పుడలా కాదు. వయసుతో సంబంధం లేకుండా మనుషుల్ని చూసి ఆటోమెటిక్ గా కొన్ని పిలుపులు వచ్చేస్తాయి చాలామందికి. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఇలాంటి మాటల్లో ఆంటీ కూడా ఒకటి. నిండా ముప్పై ఏళ్ళు కూడా నిండకనే ఆంటీ అనే మాట అంటూంటే అమ్మాయిలు చాలా బాధపడుతుంటారు. అయితే దీనివెనుక సరైన కారణమే ఉండి ఉంటుందనే విషయం మహిళలు అర్థం చేసుకోవాలి. ఇతరులు వయసుకు మించిన వరుసలతో పిలుస్తున్నారంటే దానికి కారణం శారీరకంగా ఉన్న వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నారనే అర్థం. అలా కాకుండా వయసు పెరిగినా ఈ ఆంటీ అనే ట్యాగ్ మీద పడకూడదు అంటే శారీరకంగా చాలా ఫిట్ గా ఉండాలి. ఇందుకోసం యాంటీ ఏజింగ్ వ్యాయామాలు చాలా సహాయపడతాయి.  కేవలం నాలుగే నాలుగు  పనులు దినచర్యలో భాగం చేసుకుంటే చాలు సంతూర్ మమ్మీలు  నిజంగానే తయారవుతారు. యోగా చేయాలి.. యోగా అనేది వ్యాయామం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే యోగా అనేది ఒక జీవనశైలి. రోజులో ఏ పని చేసినా ఒక నియమానుసారంగా చేయడం వల్ల మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. ఇక యోగాలో భాగం అయిన ఆసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, శరీరాన్ని వంపు తిప్పడం, వివిధ భంగిమలు శరీరాన్ని చాలా ఫిట్ గా ఉంచుతాయి. యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన యోగా వల్ల అటు శారీరక ధృడత్వం, ఇటు మానసిక ఆరోగ్యం రెండూ చేకూరతాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం కొంతసేపు యోగా చేయాలి. బరువులు ఎత్తడం.. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ లు ఫాలో కావడం వల్ల శరీరం ధృడంగా మారుతుంది. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాలు మాత్రమే కాదు జీపక్రియ కూడా మెరుగ్గా మారుతుంది. బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. నేటికాలంలో సగం పైగా ఫిట్నెస్ పాడవుతున్నది బరువు నియంత్రణలో లేకపోవడం  వల్లనే. కాబట్టి బరువులు ఎత్తడం రోజూ ప్రాక్టీస్ చేస్తే శరీరం మంచి ఆకృతిలోకి మారుతుంది. ఇది యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. నడక.. ఎలాంటి పరికరాలు అక్కర్లేకుండా ఎవరి సహాయం అవసరం లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా చేయగలిగే వ్యాయామం ఏదైనా ఉందంటే అది నడక అనే చెప్పవచ్చు. నడకలో కూడా బ్రిస్క్ వాక్ చేస్తే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజుకు కనీసం వేల నుండి 10వేల అడుగులు నడుస్తుంటే శరీరం ఫిట్ గా మారుతుంది. నడకను దీర్ఘకాలం ఫాలో అయ్యేవారు యవ్వనంగా కనిపిస్తారు. ఈత.. ఈత చాలా మంచి వ్యాయామం. ఇది పూర్తీ శరీరానికి ఫిట్నెస్ ను అందిస్తుంది. సాధారణ వ్యక్తులకే కాదు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు  ఈత ఫాలో అయితే కీళ్ల మీద ఒత్తిడి తగ్గి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పైపెచ్చు ఈత వల్ల గుండె ఆరోగ్యం కూడా బలంగా   మారుతుంది. నీటిలో శ్వాస దీర్ఘంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది.  శరీరం ఫిట్ గా మారడం వల్ల ఈతను దీర్ఘకాలం ఫాలో అయితే యవ్వనంగా ఉంటారు.                                                   *నిశ్శబ్ద. 

కాటుక వాడే అమ్మాయిలు ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు!   అదేంటో గానీ అబ్బాయిల ముఖంలోనూ, అమ్మాయిల ముఖంలోనూ అవయవాలన్నీ ఒకే విధంగా ఉన్నా అమ్మాలకు క్రెడిట్ ఎక్కువ. కళ్లు, ముక్కు, పెదవులు, నుదురు, బుగ్గలు ఇలా ప్రతిదీ అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల కళ్లను చూసి ఫిదా అయ్యేవారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి, నుదుటన బొట్టుతో అమ్మాయిలు కనిపిస్తే బాపు బొమ్మ అనే ట్యాగ్ ఇచ్చేవారు. అయితే కాలంతో పాటు ఫ్యాషన్ మారింది. ఫ్యాషన్ కు తగ్గట్టు పాత సౌందర్య ఉత్పత్తులు కొత్తగా పరిచయం అవుతున్నాయి. వాటిలో కాజల్ కూడా ఒకటి. కాటుకను ఫ్యాషన్ గా కాజల్ అని పిస్తుంటారు. వాటర్ ప్రూప్ అని చాలా రకాలుగా కాటుక అందుబాటులోకి వచ్చాక అమ్మాయిలు వివిధ రకాలుగా కాటుక అప్లై చేసి కళ్లను మెరిపిస్తారు. అయితే ఇప్పట్లో కాటుక వాడుతున్న అమ్మాయిలు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్న తరువాత బహుశా ఖచ్చితంగా షాకవుతారు. కాటుక వెనుక నిజం.. ఇప్పట్లో కాటుకను కాజల్ అని, పెన్సిల్ తోనూ, కోన్ తోనూ, స్కెచ్ తోనూ పెట్టడం అలవాటైంది. ఎక్కువసేపు ఇది నిలిచి ఉండాలనే కారణంతో బ్యూటీ ఉత్పత్తులు కాజల్ తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. ఒకప్పటిలా ఆవు నెయ్యి, బాదం, ఔషద మూలికలతో తయారైన కాటుక కాకపోవడం   వల్ల నేటి కాలం కాజల్ కళ్లకు నష్టం కలిగిస్తాయి. కాటుక పెడితే కళ్లు అందంగా కనిపిస్తాయేమో కానీ వాటిలో ఉన్న జింక్, ఐరన్, లెడ్ ఆక్సైడ్ వంటి పదార్ధాలు కళ్లకు ప్రమాదం కలిగిస్తాయి. ఇవి కళ్లకు అప్లై చేసిన తరువాత రాత్రికి అంతా క్లీన్ చేయాలి. లేకపోతే రసాయనాలు చర్మంలో ఇంకిపోయి డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అవుతుంది. అందుకే రాత్రి సమయంలో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించాలి. అందుకోసం కింది పద్దతులు ఫాలో అవ్వాలి. కళ్ల చుట్టూ ఉన్న కాటుకను తొలగించడానికి వేజిలైన్ లేదా ప్రెట్రోలియం జెల్లీ వాడాలి. గోరుతో కొద్దిగా పెట్రోలియం జెల్లీ తీసుకుని దాన్ని కళ్లకు అప్లై చేసి మెల్లిగా మసాజ్ చేస్తూ కాటుక తొలగించుకోవాలి. తరవాత కాటన్ ప్యాడ్ తో తుడిచేసుకోవాలి. చాలామంది మేకప్ రిమూవ్ చేయడానికి క్లెన్సింగ్ మిల్క్ వాడతారు. ఇది కాటుక తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్ మీద క్లెన్సింగ్ మిల్క్ తీసుకుని దానితో కంటి చుట్టూ మెల్లిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కాటుక తొలగిపోతుంది. రోజ్ వాటర్ చాలామంది బ్యూటీ కేర్ లో ఉపయోగిస్తారు. కాటన్ ప్యాడ్ ను రోజ్ వాటర్ తో తడిపి దీంతో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించవచ్చు. ఇవన్నీ చాలా తక్కువ ధరలో కాటుక తొలగించుకోవడానికి సురక్షితమైన పద్దతులు.                                             *నిశ్శబ్ద

ఆకట్టుకునే లుక్ కోసం వి నెక్ చీర ధర ఎంత అనే రోజులు కావివి. బ్లౌజు ఎలా కుట్టిస్తున్నామన్నదే అసలు విషయం. అందుకే డిజైనర్ బొటిక్ లకు డిమాండ్ మామూలుగా లేదు. అలాని అందరూ హెవీ వర్క్ డిజైన్లకే మొగ్గుచూపుతున్నారని కాదు. ఎందుకంటే ఈ జనరేషన్ అమ్మాయిలను ఒక్కప్పటి వింటేజ్ ట్రెండింగ్...వి నెక్ డిజైన్స్ మెప్పిస్తున్నాయి. ఆ వి నెక్ డిజైన్లను మనమూ ఓసారి చూద్దామా.  

బొట్టుకూ ఓ లెక్కుంది.. ఇలా పెట్టుకుంటే  కిక్కు ఉంటుంది! ఆడవారి అందానికి బోలెడు అలంకారాలు. నుదుటన పెట్టుకునే బొట్టు నుండి కాళ్లకు వేసుకునే పట్టీల వరకు బోలెడు వైవిద్యాలు. కట్టు బొట్టు మహిళలకు అందం ఇవ్వాలన్నా, వారి అందంగా ఇనుమడింపచేయాలన్నా శరీరానికి తగిన దుస్తులు, రంగులు, బొట్టు వంటివన్నీ  చక్కగా ఎంపిక చేసుకోవాలి.  ముఖ్యంగా అమ్మాయిలు పెట్టుకునే బోట్టు వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ముఖం  ఆకారాన్ని బట్టి బొట్టు ఆకారం ఉండాలని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. ఎలాంటి ముఖం ఉన్నవారు ఎలాంటి బొట్టు పెట్టుకోవాలంటే.. వృత్తాకారం.. వృత్తాకారాన్నే రౌండ్ షేప్ అని అంటారు. రౌండ్ షేప్ ఉన్నవారు ముఖానికి ఎంపిక చేసుకునే బొట్టు రౌండ్ గా ఉండకూడదు.  ఇలాంటి వారికి చక్కగా పొడవుగా ఉన్న బొట్టు బిళ్లలు భలే ఉంటాయి.  ఇలాంటి బొట్టు పెట్టుకుంటే ముఖం లుక్ చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తుంది. హృదయాకార ముఖం.. హృదయాకార ముఖాన్నే హార్ట్ షేప్  ఫేస్ అని కూడా అంటారు.  ఈ షేప్ ముఖం ఉన్నవారికి  నుదురు, గడ్డం ప్లాట్ గా ఉంటుంది.  ఇలాంటి ముఖ ఆకారం ఉన్నవారు  రౌండ్ షేప్ ఉన్న పెద్ద  బొట్టు పెట్టుకోకూడదు. దీని  వల్ల నదురు మరీ పెద్దగా కనిపిస్తుంది.  కాబట్టి  రౌండ్ షేప్ లోనే చిన్నగా ఉన్న బొట్టు పెట్టుకోవాలి. డైమండ్ షేప్.. డైమండ్ షేప్ ముఖం  చిన్నగా ఉంటుంది. ఈ ఆకారం ఉన్నవారి ముఖం, గడ్డం షేప్ చక్కగా ఉంటుంది. వీరు ఎక్కువ డిజైన్ ఉన్న  ఉండే బొట్టు కాకుండా సింపుల్ గా ఉన్న బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఓవల్ షేప్.. ఓవల్ షేప్ ముఖాకృతి ఉన్నవారికి నుదురు, గడ్డం  పొడుగ్గా ఉంటాయి. ఇలాంటి వారికి రౌండ్ గా ఉన్న బొట్టు అయితే చాలా బాగుంటుంది.  గుండ్రని ఆకారంలో  ఉండే ఎలాంటి బొట్టు అయినా చూడ చక్కగా ఉంటుంది. చతురస్రం షేప్.. కొంతమంది ముఖాకృతి చతురాస్రాకారంలో ఉంటుంది.  ఇలాంటి ముఖం ఉన్నవారు  అన్ని డిజైన్ల జోలికి వెళ్లకూడదు. ముఖం హైలెట్ గా కనిపించాలంటే రౌండ్ బొట్టు లేక చంద్రుడి ఆకారంలో   ఉన్న బొట్టు పెట్టుకోవచ్చు.  ఈ బొట్టు వల్ల ముఖం చూడటానికి చాలా అందంగా, ఆకర్షణగా ఉంటుంది. స్టిక్కర్ హ్యాక్స్.. కేవలం బొట్టు ఆకారం విషయమే కాదు వాటి గురించి తెలుసుకోవలసిన చాలా విషయాలున్నాయి.  మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకోవడం ఫ్యాషన్ అని తెలిసిందే అయితే ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. డ్రస్ కలర్ మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకోవచ్చు. దీనివల్ల రూపం ఆకర్షణగా ఉంటుంది.   ఎప్పుడూ ఒకే విధమైన స్టిక్కర్లు కాకుండా కొత్త కొత్తగా ట్రై చెయ్యాలి. అలా చేస్తే ట్రెండ్ ను ఫాలో అవ్వడం సులువు.  స్టిక్కర్లు కొనుగోలు చేసేటప్పుడు పిచ్చి పిచ్చివి కొనకుండా బ్రాండ్ తీసుకోవాలి. దీనివల్ల స్టిక్కర్లు ఎక్కువ సేపు నుదిటిమీద ఉంటాయి. స్టిక్కర్లు చాలామందికి మధ్యలోనే రాలిపడిపోతుంటాయి. ఇలా జరగకూడదు అంటే టాల్కమ్ పౌడర్ రాయాలి. దీన్ని రాయడం వల్ల స్టిక్ర్ రాలిపోదు. టాల్కమ్ పౌడరే కాదు.. కాంపాక్ట్ పౌడర్ కూడా రాసుకోవచ్చు. ఇలా చేసిన తరువాత స్టిక్కర్ ఎక్కువసేపు ఉంటుంది.                                        *నిశ్శబ్ద.

కొత్తగా కొన్న షూ సరిపోవడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అయితే.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల షాపింగ్ విస్తారమైనది. అమ్మాయిలకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. చాలామంది అమ్మాయిలు తమకు సెట్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి డ్రస్సు అయినా, చెప్పులు అయినా, షూస్ అయినా, గాజులు అయినా కంటికి నచ్చితే చాలు కొనేస్తారు. కానీ తీరా కొనేసి  ఇంటికి తెచ్చుకున్నాక అవిసరిపోవడం లేదని బాధపడతారు. ఇప్పటి అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువగా షూ ధరించడానికే ఇష్టపడుతుంటారు. కాబట్టి షూ నచ్చిందని కొనేసి ఆ తరువాత సరిపోవడం లేదని ఇబ్బంది పడుతున్నా, కొత్తగా కొన్నవాటిని వేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నా ఈ కింది టిప్స్ ఫాలో అయితే చాలు.. సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త షూస్ కొన్న తరువాత వాటిని వేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని వేసుకోవాలన్నా, కొత్త షూ తో నడవాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బూట్లు వేసుకునేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య అవి వేసుకున్నప్పుడు కాలి చిటికెన వేలుమీద చాలా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. దీని కారణంగా షూ వేసుకున్నంతసేపు ఇబ్బంది పడుతూనే ఉంటారు.  కొన్నిసార్లు ఇలా ఒత్తిడి కలగడం వల్ల వేలి కందిపోయి చర్మం తొలగిపోతుంది కూడా. ఇది చాలా నరకంగా ఉంటుంది. కానీ ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిటికెన వేలిపై బ్యాండ్రాయిడ్ ను అప్లై చేయవచ్చు. చాలామంది షూస్ కొనేటప్పుడు కరెక్ట్ గా కాలుకు సరిపడేలా తీసుకుంటారు. అయితే కొన్ని రోజులుకాగానే అవి బాగా లూజుగా అయిపోతాయి. ఈ విషయం గమనించిన వారు షూస్ ను కొనుగోలు చేసేటప్పుడు కాస్త టైట్ గా ఉన్నవే కొనుగోలు చేస్తారు.  దీని వల్ల షూస్ మెల్లిగా అలవాటు పడ్డాక సెట్ అవుతాయని అనుకుంటారు. కానీ షూస్ కొన్న కొత్తలో వాటి కారణంగా నరకం కనబడుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి కొత్త షూ కొనుగోలు చేశాక న్యూస్ పేపర్ లేదా వేస్ట్ పేపర్స్ ను రోల్ చేసి షూస్ లో కొన్నిరోజుల పాటు ఉంచాలి. వీటి వల్ల షూస్ మెల్లిగా పాదానికి సెట్ అవుతాయి. షూస్ వేసుకున్నప్పుడు మడమ భాగం ఎత్తుగా ఉన్నట్టైతే అది ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ఇబ్బంది అధిగమించడానికి  కాటన్ ప్యాడ్ లేదా శానిటరీ ప్యాడ్ ను షూ లోపల పాదాలకింద పెట్టుకోవచ్చు. దీనివల్ల మడమలకు సౌకర్యంగా ఉండటమే కాదు, చెమట, షూ నుండి వచ్చే దుర్వాసన మొదలైన వాటికి కూడా చెక్ పెట్టచ్చు. షూ వేసుకున్నప్పుడు కొన్నిసార్లు పాదాలు జారినట్టు అవుతుంటుంది. ఇలా పాదాలు జారినట్టు ఉన్నా లేదా షూ వదులుగా ఉన్నా వాటిని వేసుకునే ముందు షూ లోపల హెయిర్ స్ప్రే ను స్ప్రే చేయాలి.  ఇలా చేస్తే ఇబ్బంది తొలగిపోతుంది.                        *నిశ్శబ్ద.

మేకప్ వేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..   మేకప్ ఒకప్పుడు సెలబ్రిటీలు, సినీ తారలు మాత్రమే వేసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. సగటు ప్రజలకు కూడా మేకప్ వేసుకోవడం వచ్చు. దానికి తగినట్టుగానే వివిధ బ్యూటీ బ్రాండ్స్  తక్కువ ధరలో మేకప్ ఉత్పత్తులను అందిస్తున్నాయి.  ఈ కారణంగా అమ్మాయిలు చిన్న, పెద్ద శుభకార్యాలనే బేధం లేకుండా ఎంచక్కా మేకప్ వేసుకుని అందంగా తయారై వెళుతుంటారు. అయితే కొందరికి మేకప్ సామాగ్రిని పర్పెక్ట్ ఎలా వాడాలో తెలియదు. మేకప్ సామాగ్రి కొనుగోలు చేసినంత ఈజీగా దాన్ని ముఖానికి అప్లై చేయడం జరగదు. దాని గురించి వివరంగా తెలుసుకోవడం ముఖ్యం.  మరీ ముఖ్యంగా మేకప్ సామాగ్రిలో దేని తరువాత ఏది ఉపయోగించాలనే విషయం కూడా తెలియడం ముఖ్యం.  మేకప్ వేసుకునేటప్పుడు జరిగే ఈ చిన్న పొరపాట్లు మొత్తం ముఖాన్నే డల్  గా మార్చేస్తాయి. మేకప్ వేసుకునేటప్పుడు పొరపాటున చేయకూడని చిన్న మిస్టేక్స్ తెలుసుకుంటే.. ముఖానికి ఫౌండేషన్ రాసుకుంటే ముఖంలో మెరుపు వస్తుంది. అదే ఫౌండేషన్ విషయంలో తప్పులు చేస్తే మెరుపుకు బదులు ముఖమంతా  డల్ గా మారుతుంది.  మేకప్ వేసుకునేటప్పుడు చాలామంది ప్రైమర్ వేసుకోవడం అంత అవసరం లేదని అనుకుంటారు.  కానీ మేకప్ లో ప్రైమర్ ను చేర్చుకోవడం చాలా అవసరం.  మేకప్ కోసం మృదువుగా ఉండే బేస్ అవసరం అవుతుంది. దీనికోసం ప్రైమర్ అప్లై చేయడం తప్పనిసరి. ప్రైమర్ వేసుకోవడం వల్ల ముఖ చర్మం మీద తెరచుకున్న రంధ్రాలు కవర్ అవుతాయి.  ముఖ చర్మం మీద మొటిమల వల్ల ఏర్పడిన గుంటలు వంటివి  కూడా సెట్ అవుతాయి.  మేకప్ సమానంగా వేయడానికి ప్రైమర్ సహాయపడుతుంది. చాలా మంది ముఖం మీద ఉన్న మచ్చలను, వాటి తాలూకు గుర్తులను కవర్ చేయడానికి ఫౌండేషన్ అప్లై చేయడానికి ముందు కన్సీలర్ అప్లై చేస్తుంటారు.  అయితే ఫౌండేషన్ కు ముందు కన్సీలర్ అస్సలు వేయకూడదు. కన్సీలర్ అప్లై చేసి, ఆ తరువాత ఫౌండేషన్ వేస్తే  ఫౌండేషన్ కన్సీలర్ తో మిక్స్ అయిపోతుంది.  దీని వల్ల ముఖం మీది మచ్చలు, వాటి గుర్తులు మళ్ళీ కనిపిస్తాయి.  కాబట్టి ఫౌండేషన్ తరువాత కన్సీలర్ అప్లై చేయాలి. ప్రైమర్ వేసిన తరువాత ఫౌండేషన్, ఫౌండేషన్ తరువాత  కన్సీలర్ అప్లై చేయాలి. కన్సీలర్ అప్లై చేసిన తరువాత  అది సెట్ కావడానికి కొంత సమయం పడుతుంది.  దాన్ని చర్మం మీద ఎంత ఎక్కువ సేపు అలాగే వదిలేస్తే అది అంతబాగా సెట్ అవుతుంది. ముఖంలో ముక్కు,  దవడలు ఎలా ఉన్నా వాటిని సింపుల్ గా ఎంతో తీరుగా ఉండేలా మేకప్ తో సెట్ చేస్తారు. దీనికోసం ఫౌండేషన్ ను, కన్సీలర్ ను ఈ రెండు భాగాలలో బాగా కలిసేవరకు బ్లెండ్ చేయాలి. చాలామంది మేకప్ ను కేవలం ముఖాకృతి వరకే అప్లై చేస్తుంటారు. కానీ మేకప్ ఎప్పుడు కూడా మెడ వరకు వేసుకోవాలి.                                                        *నిశ్శబ్ద.

నార్మల్ మెహందీనే అదిరిపోయే రంగులో పండాలంటే ఇలా చేస్తే చాలు..   గోరింటాకు భారతీయ మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు. పండుగకు, శుభకార్యాలకు, ఆషాడం వచ్చినప్పుడు ఇలా గోరింటాకు పెట్టుకోవడం కామన్.  ఒకప్పుడు చెట్టునుండి ఆకు కోసి, దాన్ని రుబ్బి  చందమామలు అంటూ చేతిలో చిన్న చిన్న ముద్దలు, చుక్కలు పెట్టుకునేవారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంటూ అమ్మాయిల్ని ఆటపట్టించేవారు కూడా.  అయితే ఇప్పుడు మెహందీ కోన్ లు అందుబాటులోకి వచ్చాయి. కొందరు వీటిని వాడటానికి భయపడతారు. మరికొందరు గోరింటాకు పొడి తీసుకుని వారి క్రియేటివిటీ ఉపయోగించి సొంతంగా మెహందీ కోన్ లు తయారుచేస్తారు. మెహందీ కోన్ లు సొంతంగా తయారుచేసినా , బయట కొన్నవి  అయినా గోరింటాకు ముదురు రంగులో బాగా పండాలి అంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలి. టీ నీరు.. గోరింటాకు ఇంట్లోనే తయారుచేస్తున్నట్టైతే దాన్ని కలిపేముందు సాధారణ నీటిని కాకుండా టీ నీటిని కలిపితే చక్కని ఫలితం ఉంటుంది.  టీ నీటినే టీ డికాక్షన్ అనికూడా అంటారు.  టీ పొడి నీళ్ళలో వేసి బాగా ఉడికించి ఈ నీటితో గోరింట పొడికలిపితే గోరింటాకు ముదురు రంగులో పండుతుంది. నిమ్మరసం.. ఇంట్లోనే గోరింటాకు కోన్ తయారుచేసుకునేముందు గోరింట పొడిలో నిమ్మరసం కలపాలి. నిమ్మరసం గోరింట పొడితో చర్య జరిపి గోరింట ఎర్రగా పండేలా చేస్తుంది. విక్స్.. గోరింటాకు పండిన తరువాత దాన్ని తొలగించిన తరువాత చేతులు వెంటనే నీటితో కడిగేయకుండా విక్స్ రాయడం వల్ల మంచి రంగు వస్తుంది.   లవంగం.. లవంగాలతో చేతిరంగు ముదురుగా మార్చడం చాలా మందికి తెలిసిన ట్రిక్కే. చేతికి గోరింటాకు తొలగించాక  నీటితో కడిగేయకూడదు. రెండుమూడు లవంగాలను పెనం మీద వేసి వేడి చేయాలి. ఆ లవంగాలు పొగ విడుదల చేసినప్పుడు ఆ పొగను చేతులకు తగిలేలా చూడాలి. ఇలా చేస్తే చేతి రంగు బాగా ముదురుగా మారుతుంది. ఆవాల నూనె.. చేతికి గోరింటాకు తొలగించిన తరువాత ఒక కాటన్ బాల్ తీసుకుని దాన్ని ఆవనూనెలో ముంచి ఆ నూనెను చేతికి రాసుకోవాలి. ఇలా చేస్తే గోరింట రంగు దట్టంగా ముదురుగా మారుతుంది.                                                             *నిశ్శబ్ద.  

దీపావళికి లక్ష్మీదేవి రూపాల్లో ఉన్న చోకర్లతో మెరిసిపోండి..!   ఎన్ని నగలు ఉన్నా మగువల మనసు కొత్త వాటికోసం వెతుకుతూనే ఉంటుంది. అసలే పండగల సీజన్. అమ్మవారిని భక్తితో పూజించే మనకు ఆమె రూపాలతో కొలువుదీరిన నగలు మరింత మెప్పిస్తాయి. అందుకే లక్ష్మీదేవి రూపాలతో ఉన్న చోకర్లు ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఆ నగలు మెడలో ధరిస్తే భలే ముచ్చటగా ఉంటుంది. మనకు అందాన్ని తెస్తాయి. కావాలంటే ఈ దీపావళికి మీరూ ప్రయత్నించండి.  

రోజంతా తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు! ఉదయం లేచి స్నానం చేసి తయారయ్యాక సాయంత్రం లేదా రాత్రి వరకు కూడ అదే ప్రెష్ నెస్ తో ఉండటం దాదాపు అసాధ్యం. సాయంత్రం వరకు ఎందుకు ఇంటినుండి ఆఫీసుకో, కాలేజీకో వెళ్లేసరికే దుస్తులు చాలావరకు చెమటతో తడిసిపోతాయి. ఇక వేసవికాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.  చలికాలంలో అయితే దుస్తులు కాస్త ముతకవాసన కూడా వస్తుంటాయి. అయితే కాలంతో సంబంధం లేకుండా ఉదయం తయారైనప్పటి నుండి తిరిగి ఇల్లు చేరేవరకు శరీరం తాజాగా ఉండాలన్నా, ఇతరులకు మన నుండి ఫ్రెష్ స్మెల్ రావాలన్నా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. అప్పుడే విరబూసిన పువ్వులా తాజాగా ఉండొచ్చు. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం.. సాధారణంగానే శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని కాపాడటమే కాకుండా  అంతర్గత శరీరం సరిగా పనిచేయడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది. అయితే ఉదయం స్నానం చేసిన తరువాత మేలురకం మాశ్చరైజర్ ను రాసుకోవడం వల్ల చర్మం మరింత ఎక్కువసేపు తాజాగా ఉండటమే కాదు, ఎంత సమయం గడిచినా శరీరం  తాజా సువాసన  వెదజల్లుతూ ఉంటుంది. దుస్తుల ఎంపిక.. రోజంతా తాజాగా ఉండాలంటే దుస్తుల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. వదులుగా, గాలి ప్రసరణ బాగా ఉండే దుస్తులు ఎంచుకోవాలి. బిగుతుగా ఉన్న దుస్తులు వేసుకుంటే చాలా తొందరగా చెమట ఉత్పత్తి కావడం, దుస్తులు చెమటవాసనకు లోనవడం జరుగుతుంది. తేలికగా ఉండే కాటన్ దుస్తులు అన్నివిధాలా మంచి ఎంపిక. ఆహారం.. ఆహారానికి శరీరం తాజాగా ఉండటానికి లింకేటని చాలామందికి అనిపించవచ్చు. కానీ ఘాటు వాసన కలిగిన, తొందరగా వదిలించుకోలేని వాసనలు కొన్ని ఉన్నాయి. వాటిలో పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి చాలా ముఖ్యమైనవి. వీటిని ఆహారంలో తీసుకోకుండా ఉంటే నోటి దుర్వాసన ఇబ్బంది  ఉండదు. అదే విధంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఇకపోతే సిట్రస్ పండ్లైన బత్తాయి, నారింజ, నిమ్మ మొదలైనవి బాగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల అవి శరీరంలో శోషించబడి ఆ తరువాత చర్మం నుండి కూడా విడుదల అవుతాయి. ఈ కారణంగా ఇవి శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచడంలో సహాయపడతాయి. నోటి ఆరోగ్యం.. శరీరం ఎంత తాజాగా ఉన్నా నోటి దర్వాసన ఉంటే మాత్రం అందరూ ఆమడ దూరం పారిపోతారు. అందుకే నోటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రించే ముందు ఖచ్చితంగా పళ్లు తోముకోవాలి. నోటి దుర్వాసన సమస్య ఎదుర్కొంటుున్నట్టు అయితే మౌత్ ఫ్రెషనర్, బ్రీత్ మింట్స్, చూయింగ్ గమ్, ఇలాచి, లవంగం మొగ్గ వంటి ప్రత్యామ్నాయాలు ఉపయోగించడం ద్వారా నోటి దుర్వాసన అధిగమించవచ్చు. పెర్ఫ్యూమ్.. ఇప్పట్లో పెర్ప్యూమ్ లేకుండా బయటకు వెళ్లేవారు తక్కువేనని చెప్పవచ్చు. అయితే రోజంతా తాజాగా ఉండటానికి పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువకాలం పాటు ఉండేలా జాగ్రత్త పడితే దీనికి మించిన సులువైన, పెద్ద పరిష్కారం మరొకటి లేదనే చెప్పవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దుస్తులు ఉతకడానికి ఉపయోగించే సబ్బు, డిటర్జెంట్, లిక్విడ్స్, అలాగే శరీర శుభ్రతకు ఉపయోగించే సబ్బు, బాడీ వాష్, బాడీ లోషన్లు మొదలైనవి మీరు వాడే పెర్ప్యూమ్ కు సమానమైన సువాసన కలిగినవై ఉండాలి. అలా ఉంటే రోజంతా తాజాగా ఉండటం సాధ్యమవుతుంది. మ్యాజిక్ చేసే చిట్కా.. శరీరం రోజంతా తాజాగా అనిపించాలంటే ఉపయోగించే పెర్ప్యూమ్ విషయంలో ఒక మ్యాజిక్ చిట్కా ఫాలో అవ్వాలి. అదే పెర్ప్యామ్ స్ప్రే చేసే ప్రదేశం.  శరీరంలో వెచ్చని ప్రాంతాలు, పల్స్ పాయింట్ల దగ్గర పెర్ఫ్యూమ్ ను స్ప్రే చేయడం వల్ల అది దీర్ఘకాలం సువనాసనను నిలిపి ఉంచుతుంది. చెమట పట్టనీయదు. మణికట్టు, గొంతువెనుక భాగం, చెవుల వెనుక భాగం, మోకాళ్ళ వెనుక బాగం, చంకలు మొదలైన ప్రదేశాల్లో పెర్ప్యూమ్ స్ప్రే చేయడం వల్ల  చెమట బెడద తగ్గుతుంది. కాఫీ స్క్రబ్.. శరీరాన్ని కాపీ స్ర్కబ్ తో శుభ్రం చేయడం వల్ల శరీరం మంచి సువాసన వెదజల్లుతుంది.  కనీసం వారానికి ఒకసారి కాఫీ స్క్రబ్ ఉపయోగించాలి. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. సువాసనలు గ్రహించడంలో సహాయపడుతుంది. పాత షూస్ తో జాగ్రత్త.. చాలావరకు పాత షూస్ లేదా చెప్పులువాసన వస్తూంటాయి. ఈ వాసన తాజాగా ఉన్న శరీరాన్ని డామినేట్ చేస్తుంది. అందుకే చెప్పులు, షూస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.                                                          *నిశ్శబ్ద.

నవరాత్రుల రెండవరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది..   దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా పండుగ మొదలైపోయింది. తొమ్మిదిరోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలలో దర్శనమిస్తుంది. ఈ అవతారాలకు తగ్గట్టే వివిధ పుణ్యక్షేత్రాలలోనూ, ఆలయాలలోనూ అమ్మవారిని ఒక్కొక్కరోజు ఒక్కోవిధమైన రంగు దుస్తులతో, పువ్వులతో అలంకరిస్తారు. ఆయా రోజున ఆయా రంగు అమ్మవారికి ఎంతో ఇష్టమైనదిగా చెబుతుంటారు కూడా. అయితే మహిళలు కూడా అమ్మవారికి ఎంతో  ఇష్టమైన రంగులను ధరించడం, అమ్మను పూజించడం వల్ల అమ్మవారు సంతృప్తి చెందుతారు. నవరాత్రుల రెండవరోజు అమ్మవారి కృపకు ఏ రంగు దుస్తులు ధరించాలంటే.. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారు తెలుపు రంగు దుస్తులలో ఉంటుంది. అన్ని చోట్లా అమ్మవారికి రెండవరోజున తెలుపు రంగు దుస్తులే అలంకరిస్తారు. అమ్మవారిని పూజించే అమ్మాయిలు, మహిళలు ఈరోజున తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. పూజలో తెలుపు రంగు దుస్తులు ధరించడానికి వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. రెగులర్  దుస్తులలో కూడా తెలుపురంగు దుస్తులలో అనార్కలీ, లెహంగా, పరికిణీ వంటి దుస్తులు బాగుంటాయి. ఎంబ్రాయిండరీ.. స్టోన్ వర్క్, నెట్టెడ్ వర్క్ తో కూడిన తెలుపు రంగు చీరలు కూడా చాలా ఆకర్షణగా ఉంటాయి. చూడగానే లెహంగా ధరించారా అన్నట్టుగా ఉండే షరారా కూడా ఇప్పటి ఫ్యాషన్ లో ట్రెండింగ్ లో ఉంది.  ఇకపోతే తెలుపు రంగు స్వచ్చతకు, తెలివితేటలకు ప్రతీకగా చెబుతారు. ఈరోజున తెలుపు రంగు దుస్తులు ధరించి, తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే అమ్మాయిల కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి కరుణ అమ్మవారిపై ఉంటుంది.                                                  *నిశ్శబ్ద. 

ఆడవారి వార్డ్ రోబ్ అధిరిపోవాలంటే ఈ ఐదు చిట్కాలు చాలా ముఖ్యం..    బీరువా లేదా వార్డ్ రోబ్ నిండా మంచి మంచి దుస్తులు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఎంత మంచి దుస్తులు కొన్నా ఏదో వెలితి మహిళలను వెంటాడుతుంటుంది. వార్డ్ రోబ్ తీయగానే ఎందుకో అంతగా ఆకర్షించని దుస్తులు చాలావరకు వెక్కిరిస్తున్నట్టు ఉంటాయి. కొనేటప్పుడు ఉన్నంత హుషారు ఆ తరువాత చాలావరకు ఉండదు. కానీ తీసేద్దామని అనుకునేటప్పుడు మాత్రం ఆ దుస్తులకోసం పెట్టిన ఖర్చు గుర్తుకొస్తుంది. ఈ కారణంగా మహిళల వార్డ్ రోబ్ లలో ధరించని దుస్తులు ఎక్కువ ఉంటాయి. కేవలం ఐదే ఐదు చిట్కాలు పాటించడం వల్ల దుస్తుల విషయంలో చాలా జాగ్రత్త పడవచ్చు. కేవలం మంచి దుస్తులు మాత్రమే వార్డ్ రోబ్ లో ఉంచేలా చేయడమే కాదు, డబ్బు కూడా ఆదా చేయవచ్చు. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. బాగా సరిపోయే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఎప్పుడూ ముఖ్యం.  శరీర సౌష్టవానికి తగిన షేప్,  శరీరానికి నప్పే రంగుల కోసం ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతారు. కానీ తీరా కొన్నాక బాలేదని అనిపిస్తుంది.ఒకటి రెండు అలాంటివి ఉన్నా పర్లేదు కానీ ఎక్కవ మొత్తం వార్డ్ రోబ్ లో ఉంటే మాత్రం కష్టమే.. ఇలాంటివి అరికట్టడానికే ఈ సింపుల్ టిప్స్.. రెగులర్స్ పై సేవింగ్స్.. కొన్ని దుస్తులకు  అధిక ఖర్చు అవసరం లేదు. రోజువారి ధరించే టీ షర్డ్ లు, టాప్ లు, షార్ట్ లు, ప్యాంట్ లు తక్కువ దగ్గరకు దగ్గరలో ఉన్న దుకాణాలలో లభిస్తాయి. ఇలాంటి దుస్తులకు బ్రాండెడ్ అనే ట్యాగ్ కోసం వెంపర్లాడకండి. ఇవి రోజూ ధరిస్తుంటారు కాబట్టి తక్కువ ధరవే బెస్ట్.  పైపెచ్చు తక్కువ ధరకు లభించే వీటిని ఎక్కువ మొత్తం ఒకేసారి తీసుకుంటే దుకాణాదారులు  కాస్త డిస్కౌంట్ కూడా ఇస్తారు. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది, ఇంకోవైపు  సౌకర్యవంతంగా ఉన్నవి కొన్నట్టు ఉంటుంది.  వార్డ్ రోబ్  శుభ్రం చేయాలి..  ఇది దాదాపు అందరు మహిళలకు ఏదో ఒక సమయంలో ప్రయోజనం చేకూర్చే  చిట్కా.  ఎప్పుడూ ధరించని దుస్తులను బయటకు తీసేయాలి.  ధరించకూడదని పదే పదే అవాయిడ్ చేస్తున్న దుస్తులు, పాతగైపోయిన వస్త్రాలు తొలగించడం వల్ల వార్డ్ రోబ్ ఇష్టమైన వాటితో వెలిగిపోతుంజి. నచ్చని దుస్తులను   స్వచ్ఛంద సంస్థలకు  విరాళంగా ఇవ్వచ్చు. దీనివల్ల ఒకింత సంతృప్తి కూడా లభిస్తుంది. క్లాసిక్‌ దుస్తులు ఉండాలి.. ఎక్కువ కాలం  వార్డ్‌రోబ్‌లో తళుక్కున మెరవాలంటే అవి ఖచ్చితంగా క్లాసిక్ దుస్తులు అయి ఉండాలి. ఎందుకంటే క్లాసిక్ దుస్తులకంటే  విలువైనవి ఏవీ లేవు. వాటిలో కొద్దిగా నలుపు రంగు దుస్తులు ,  తెల్లటి చొక్కా, బ్లేజర్, ఒక జత  జీన్స్, నలుపు ప్యాంటు, స్మార్ట్ ఉన్ని కోటు, న్యూట్రల్ కార్డిగాన్,  ర్యాప్ డ్రెస్ మొదలైనవి ఉంచవచ్చు. ఇవి  సౌకర్యవంతంగా కొంచెం ఎక్కువ ఖర్చు చేయగల దుస్తులు. మరో మాటలో చెప్పాలంటే, కొంచెం ఖరీదైన శీతాకాలపు కోటు మీకు అందంగా సరిపోతుంటే దానిని కొనడం ఆపుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవి   చాలా సంవత్సరాలు ధరించే అవకాశం ఉంది. ట్రెండింగ్..  ప్రతి సీజన్ దానితో పాటు ట్రెండింగ్ దుస్తులను తీసుకువస్తుంది. ఇటీవలి సీజన్‌లలో శిల్పకళతో కూడిన భుజాలు,  గ్లాడియేటర్ హీల్స్ ఉన్న టాప్‌ల నుండి సీక్విన్స్,  స్టడ్‌ల వరకు ప్రతిదీ ఉంటోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే చందాన పాత తరం ఫ్యాషన్ మళ్లీ కొత్త సొబగులతో వచ్చి అలరిస్తుంది.  కాబట్టి  ట్రెండింగ్ దుస్తుల కోసం  ఖర్చు పెట్టడంలో  అతిగా ఉండకూడదు. కంఫర్ట్ ముఖ్యం.. ఏ దుస్తులు అయినా కంఫర్ట్ గా లేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దుస్తులలో అందమంతా కంఫర్ట్ గా ఉండటంలోనే సగానికి పైగా ఎస్సెట్ అవుతుంది. శరీర ఆకృతి, శరీరంలో భాగాలకు అనుగుణంగా తగిన దుస్తులు ఎంచుకోవడం వల్ల దుస్తులు, శరీరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తాయి. అందుకే శరీరాకృతికి తగిన దుస్తులు ఎంచుకుంటే అవి ఎప్పుడు ధరించాలన్నా ఇష్టంగా ఉంటుంది.                                                                      *నిశ్శబ్ద

మెడలో ముత్యాల గణపతి హారం..!! విఘ్నాలను తొలగించి...విజయాలను ఇచ్చే వినాయకుడి ప్రతిమను సెంటిమెంట్ గా భావించేవారంతా ఇప్పుడు ఆ రూపాన్ని ఆభరణాల్లో చేర్చుకుంటున్నారు. ముత్యాలు, పచ్చలు, పగడాలు, బంగారు పూసలు ఇలా ఒకటేమిటి ఏ ఆభరణాల్లోనూ ఇట్టే ఒదిగిపోతుంది. వీటిని ధరించిన వారి అందాన్ని కూడా రెట్టింపు చేస్తోంది. అలాంటి డిజైన్లు ఇప్పుడు కొన్ని చూద్దాం.    

ఈ స్టైలిష్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లు మీరూ ట్రై చేయండి చాలా మంది మహిళలు తమ గోళ్లను అందంగా మార్చుకోవడానికి సెలూన్‌కి వెళ్లి మెనిక్యూర్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. అయితే మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే  మీరు నెయిల్ ఆర్ట్‌తో మీ గోళ్లకు అందమైన డిజైన్‌ను కూడా ఇవ్వవచ్చు. నెయిల్ ఆర్ట్ క్లిష్టంగా కనిపించవచ్చు కానీ మీరు ఇంట్లోనే మీ గోళ్లకు సులభంగా అందమైన రూపాన్ని ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో మహిళలు సరళమైన, హుందాగా ఉండే రంగు డిజైన్లలో ఫ్యాన్సీ నెయిల్ ఆర్ట్‌ను చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ నెయిల్ ఆర్ట్ చేయడానికి పదే పదే నెయిల్ ఆర్ట్ స్టూడియోకి వెళ్లడం వల్ల మీ నెయిల్స్ బలహీనంగా మారుతాయని మీకు తెలుసా?.. ఎలాంటి ప్రొఫెషనల్ సహాయం లేకుండానే మీరు చేయగలిగిన నెయిల్ ఆర్ట్‌లోని కొన్ని సరళమైన,  హుందాగా ఉండే డిజైన్‌లను చూద్దాం. ఇంట్లో మీరే చేయోచ్చు. 1. జిగ్‌జాగ్ డిజైన్: ఈ నెయిల్ ఆర్ట్ తయారు చేయడం చాలా సులభం. 2. హాఫ్ మూన్ స్టైల్: ఈ నెయిల్ ఆర్ట్ చాలా సింపుల్ గాచ చేయోచ్చు. 3. స్టోన్ వర్క్ నెయిల్ ఆర్ట్ డిజైన్: ఈ రకమైన నెయిల్ ఆర్ట్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. 4. షిమ్మర్ డిజైన్ నెయిల్ ఆర్ట్:   సరళంగా, హుందాగా ఉంటుంది. 5. మోనోక్రోమ్ గ్రాఫిక్ నెయిల్ ఆర్ట్: ఇది సరికొత్త డిజైన్, చాలా మంది మహిళలకు ఈ నెయిల్ ఆర్ట్ గురించి తెలియదు. 6. స్ట్రిప్ డిజైన్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లో మీరు ఏ నిపుణుల సహాయం తీసుకోవలసిన అవసరం లేదు.   7. పోల్కా డాట్ నెయిల్ ఆర్ట్ అనేది బట్టలు లేదా పాదరక్షల ట్రెండ్‌లో మాత్రమే కాకుండా, నెయిల్ ఆర్ట్‌లో పోల్కా డాట్ లుక్‌ని కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.

మహిళలూ.. జీన్స్ కొనుగోలులో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఇది మీకోసమే.. జీన్స్ వేసుకోవడం అబ్బాయిల నుండి అబ్బాయిల వరకు అందరికీ ఇప్పుడు సాధారణం అయిపోయింది. అయితే అబ్బాయిలు జీన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు పెద్ద కష్టపడకుండానే సెలెక్ట్ చేసుకుంటారు. నచ్చిన రంగు, నచ్చిన ధర ఫిక్స్ అయితే చాలు. వారికి పెద్ద కంప్లైంట్స్ ఉండవు. కానీ మహిళల విషయానికి వస్తే, జీన్స్  కొనుగోలు చేయడం పెద్ద ఛాలెంజే.  ఎందుకంటే ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుంది. కొందరికి చిన్న నడుము, కొందరికి పెద్ద నడుము. స్త్రీలు  దాదాపు 30కి పైగా వెరైటీ నడుము కొలతలు కలిగి ఉంటారు.  ఇలాంటి సందర్భంలో మహిళలు ఎవరు ఎలాంటి జీన్స్ కొంటె బాగుంటుంది? ఎలాంటి జీన్స్ ధరిస్తే టాప్స్ నుండి  టీ-షర్టు వరకు ప్రతిదీ మెరుగ్గా కనిపిస్తుంది. తెలుసుకంటే.. స్ట్రైట్ కట్ జీన్స్.. స్కిన్నీ జీన్స్  వంకరగా ఉన్న శరీరాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తుంది. అందుకే కొందరు ఈ జీన్స్ ను  ఇష్టపడరు. అలాంటి  మహిళల కోసం  స్ట్రెయిట్ కట్ జీన్స్ ఖచ్చితంగా సరిపోతాయి. స్ట్రెయిట్ కట్ కారణంగా  దిగువ భాగంలో  వంకరలు  బాగా కవర్ అవుతాయి. ఇక  ఇది  షర్ట్ తో ఆఫీసులకు వెళ్లడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.   హై రైజ్ జీన్స్.. వెడల్పాటి హిప్ లైన్స్ ఉన్న మహిళలు  తక్కువ ఎత్తున్న జీన్స్ వేసుకుంటే ఎంత అసౌకర్యానికి గురవుతారో అర్థం చేసుకోవచ్చు. అయితే  ఇలాంటి హిప్ లైన్స్ జీన్స్  బదులుగా ఎత్తైన జీన్స్‌ను ఎంచుకుంటే  హిప్ లైన్స్ ఉన్న మహిళలకు సౌకర్యాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి మంచి ఆకృతిని ఇస్తుంది.   మమ్ జీన్స్.. మమ్  జీన్స్ అనేది జీన్స్ లో ఉన్న  మరొక సౌకర్యవంతమైన రకం. ఇది కొంతవరకు స్ట్రెయిట్ కట్ జీన్స్ కేటగిరీలోకి వస్తుంది. ఒక తేడా ఏమిటంటే  కాలు  వెడల్పు కొంచెం పెద్దదిగా ఉంటుంది.  ఇది సాధారణంగా ఎత్తుగా లేదా నడుము మధ్యలో ఉంచబడుతుంది. 30 ప్లస్ నడుము ఉన్న క్రాస్  ఫిగర్ మహిళలకు ఇది సరైన ఎంపిక అవుతుంది. బూట్ కట్ జీన్స్..  ఫిట్టింగ్ టాప్ కావాలంటే దిగువన ఓపెన్ హెమ్‌లైన్ ఉంటే, ఫ్లేర్డ్ లేదా బూట్ కట్ జీన్స్ మంచి ఆప్షన్. ఈ రకమైన జీన్స్‌లో కర్వ్‌లు అందంగా హైలైట్ గా ఉంటాయి. ఇవి కొంచెం సెక్సీ టచ్‌ని కూడా జోడిస్తాయి. దిగువ భాగం విశాలంగా ఉన్న కారణంగా  ఇది బూట్‌లు లేదా హీల్స్‌తో చాలా బాగా సెట్ అవుతుంది. ఇది షేప్ ను కవర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మిడ్ రైజ్ జీన్స్.. ఎత్తుగా కనిపించడం ఇష్టం లేకపోయినా  30-35 నడుము సైజ్ ఉన్న మహిళలకు మిడ్ రైజ్ జీన్స్  మంచి ఎంపిక. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో రంగుల సెలక్షన్ చాలా బాగుంటుంది.                                                    *నిశ్శబ్ద.   

ముడతలు పడిన జీన్స్ ను మామూలుగా చేయడానికి బెస్ట్ ఐడియాస్.. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అని సినిమా పాట అన్నేళ్ళ కిందట రాసిన కారణమో ఏమో కానీ నేటికాలం అమ్మాయిలు  జీన్స్ లేనిదే ఇంట్లో నుండి కదలరు. పట్టణాలు, నగరాలలో నివసించే ఎంతోమంది  రోజువారీ డ్రెస్సింగ్ లో జీన్స్ ఒక భాగం. అయితే కాలేజీలలో అయినా, ఆఫీసులలో అయినా జీన్స్ వేసుకుని గంటలు గంటలు కూర్చోవడమే జరిగేది. ఇలా చేయడం వల్ల ప్యాంటు నడుము, మోకాళ్లు, తొడల పై భాగంలో  ముడుతలు పడతాయి. వీటిని సరిచేయడం కష్టంగా అనిపిస్తుంది. కొందరికి సహనం పోతుంది. కానీ వీటిని కొన్ని పద్దతుల ద్వారా సులువుగా సరిచేయవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. డ్రై ఐస్.. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో డ్రై ఐస్ వేయాలి.  ఇంకొక బ్యాగ్ లో ముడుతలు పడిన ప్యాంట్ పెట్టాలి. ప్యాంట్ ఉన్న బ్యాగ్ ను డ్రై ఐస్ ఉన్న బ్యాగ్ లో పెట్టాలి. రెండుగంటల పాటు దీన్ని ఇలాగే వదిలేయాలి. ఆ తరువాత తీసి చూస్తే ప్యాంటు మీద ముడుతలు అన్ని మంత్రించినట్టు మాయమవుతాయి. అయితే ముడుతలు ఎక్కువ లేని దుస్తులకు ఈ టిప్ ఫాలో అయితే దుస్తులు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఐరన్.. ఐరన్ ఎంత చేసినా జీన్స్ ప్యాంటు మీద ముడతలు పోలేదా? అయితే ఈ చిట్కా ఉపయోగించాలి. జీన్స్ ప్యాంటు మీద ముడతలు ఉన్నచోట బాగా నీటిని చిలకరించాలి. ప్యాంటు కాస్త తడిగా ఉన్నప్పుడు బాగా రుద్దితే ముడుతలు చాలా వరకు  సెట్ అయిపోతాయి. అయితే ముడుతలు పోవాలని ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు ఐరన్ బాక్స్ తో రుద్దకండి. స్నానం.. జీన్స్ ప్యాంటుకు స్నానమా అని ఆశ్చర్యం వేస్తుందా?  పూర్తీగా తెలుసుకోండి. జీన్స్ ప్యాంటు వేసుకుని అలాగే దుస్తులతోనే నీరు నిల్వ ఉన్న బాత్ టబ్ లేదా నీటి తొట్టెలలో కూర్చోవాలి. అయితే సబ్బు, షాంపూ గట్రా ఉపయోగించకుండా కేవలం అలా నీటిలో కూర్చోవాలి అంతే.. వేడినీటిలో ఇలా కూర్చుని నీరు చల్లగా మారిపోగానే బయటకు వచ్చేయాలి. ఈ జీన్స్ ను జాగ్రత్తగా తీసి ఆరేయాలి. లేదంటే అలాగే ఒంటి మీద ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకుంటే ఒక్క ముడుత లేకుండా ప్యాంట్ ఐరన్ చేసినట్టు మారిపోతుంది. అయితే ఇది ఎలాంటి ఇతర మార్గాలు లేని సమయంలో దూరప్రాంతాలలో వసతులు సరిగా లేని చోట ఫాలో అయితే మంచిది. ఎందుకంటే తడిబట్టలతో అలా ఉండటం ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఫ్రీజర్.. ప్యాంటును ప్రిజ్ లో పెట్టడం గురించి విన్నారా? సమ్మర్ లో కొందరు సరదాగా వీడియోస్ కోసం బట్టలు ఫ్రీజర్ లో పెట్టడం చూసి ఉంటారు. కానీ ముడుతలు పడిన జీన్స్ ను ఒకరోజంతా ఫ్రీజర్ లో ఉంచితే అదిరిపోయేలా ఒక ముడుత కూడా లేకుండా సెట్టయిపోతుంది. అయితే కాటన్ జీన్స్ మాత్రం ఇలా చేయకూడదు.                                                                *నిశ్శబ్ద.  

రక్షాబంధన్‎కు ఈ అందమైన మెహందీ డిజైన్లు..మీరూ ట్రై చేయండి! మీరు రక్షా బంధన్ రోజున మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా?  ఈ కథనంలో మీకోసం అందించిన ఈ అందమైన మెహందీ డిజైన్‌లను ఓ సారి ట్రై చేయండి. భారతీయ పండుగలలో మెహందీ ఒక ముఖ్యమైన భాగం. అది ఏ పండగైనా, ఫంక్షన్ అయినా, పెళ్లి అయిన రెండు చేతులకు మెహందీ ఉండాల్సిందే.  త్వరలోనే రాఖీ త్వరలో రాబోతోంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ మెహందీ డిజైన్‌లను వేసుకోవాలనుకుంటే.. ఈ కథనంలో అందించిన అందమైన మెహందీ డిజైన్‌లపై ఓ లుక్కేయండి. వైన్ మెహందీ:   రక్షాబంధన్ రోజున వైన్ మెహందీ డిజైన్ చాలా ఇష్టం. ఎందుకంటే.. ఈ డిజైన్‌ను వేయడానికి మీకు ఎక్కువ సమయం, డబ్బు అవసరం లేదు. మీరు చేతి నుండి వేలు వరకు డిజైన్‌ను తయారు చేసి, ఆకులు, పువ్వులతో డిజైన్ ను అలంకరించాలి. చిన్న వేళ్లపై అద్భుతంగా కనిపిస్తాయి. బ్రాస్లెట్ డిజైన్: బ్రాస్లెట్ డిజైన్  చాలా ట్రెండ్‌లో ఉంది. మీరు కూడా ఈ మెహందీని మీరే అప్లై చేసుకోవచ్చు. మణికట్టు దగ్గర బ్రాస్లెట్ తయారు చేసి, వేళ్లపై చిన్నచిన్న డిజైన్లు వేసి చేతికి ప్రత్యేక లుక్ ఇస్తారు. మెష్ మెహందీ డిజైన్ : మెష్ మెహందీ డిజైన్ వేయడం చాలా సులభం. మీరు చేయవలసిందల్లా మీ చేతులకు నెట్‌ను తయారు చేసి, ఒక బాక్సులో కాకుండా మరొక బాక్సులో చుక్కను ఉంచడం. నెట్‌తో పాటు, మీరు మూలలో పువ్వులు లేదా చిన్న తీగలు కూడా చేయవచ్చు. ఫ్లవర్ మెహందీ డిజైన్ : త్వరగా మెహందీని వేసుకోవాలనుకుంటే..మీరు ఫ్లవర్ మెహందీని కూడా ప్రయత్నించవచ్చు. ఈ తరహా డిజైన్‌ల కోసం చేతికి మధ్యలో పువ్వును తయారు చేసి, చేతి వేళ్లను గోరింటతో కప్పుకుంటే సరిపోతుంది. బాక్స్ మెహందీ డిజైన్ : ఈ డిజైన్లన్నీ కాకుండా, మీరు సాధారణ బాక్స్ మెహందీని డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కోసం, మీరు చేయాల్సిందల్లా పెద్ద బాక్సు వేసి అందులో చిన్న బాక్సులను  తయారు చేయండి.

  ఫంక్షన్లకోసం వేలాదిరూపాయలు పెట్టి బట్టలు కొనలేకపోతున్నారా? ఇదిగో అద్దెకు తెచ్చుకోండిలా.. దుస్తులు మనిషి దర్పాన్ని ప్రదర్శిస్తాయి. ఏదైనా ఫంక్షన్, పెళ్ళి, బర్త్ డే, రిసెప్షన్ ఇలా వేడుకలు ఏవైనా సరే ఆహ్వానం అందితే అక్కడికి వెళ్లాల్సి వస్తే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వెలిగిపోవాలని అనుకుంటారు మహిళలు. ప్రతి ఫంక్షన్ లో కొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ప్రతి చోటుకు కొత్త దుస్తులు వేసుకుని వెళ్ళాలన్నా, కొత్త బట్టలు కొనాలన్నా కుదిరేపని కాదు. వేసుకున్నవే రిపీటెడ్ గా మార్చి మార్చి వేసుకోవాల్సి  వస్తుంది. అటు కొత్తవి కొనలేక, ఇటు  కొత్తగా కనిపించలేక ముఖం చిన్నబుచ్చుకునే చిన్నమ్మలు ఎందరో.. అయితే ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. ఫంక్షన్లు అయినా ఇతర వేడుకలు ఏవైనా వేలాది రూపాయలు ఖర్చుపెట్టి బట్టలు కొనాల్సిన పని లేదు. జస్ట్ అద్దెకు తెచ్చుకోవచ్చు. ఫంక్షన్ జరిగినంతసేపు ధరించవచ్చు. వాటిని మళ్లీ తిరిగి ఇచ్చేయచ్చు. నచ్చిన దుస్తులు, నచ్చిన రంగులు, సాదాసీదాగా కాదు సెలబ్రిటీ రేంజ్ దుస్తులు తెచ్చుకోవచ్చు. ఇవి కూడా ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు. ఇదేదో బాగుందే అనిపిస్తోందా? అయితే ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి మరి.. ట్రెండ్ ఫాలో కావాలన్నా, ఫ్యాషన్ గా కనిపించాలన్నా కొత్త దుస్తులు కొనాలి. అయితే కొత్త దుస్తులు కొనాలంటే మాట కాదు. ఇలాంటి వారి కోసం కొన్ని ఆన్లైన్ సైట్లు గ్రాండ్ గా ఉన్న దుస్తులను అద్దెకిస్తున్నాయ్. వీటిని ధరించి సెలబ్రిటీలా వెలిగిపోవచ్చు. ఫ్లై రోబ్ వెబ్సైట్.. ఫ్లై రోబ్ అనేది భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ రెంటల్ స్టోర్.  ఇందులో దుస్తులను ప్రముఖులు కూడా ఉపయోగించడం విశేషం. ఈ ముంబై ఆధారిత సేవ మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, ఇతర మెట్రో నగరాలకు కూడా దాని సేవలు   విస్తరించింది.   బట్టలు, నగలు  నుండి బ్యాగ్‌లు,  బూట్ల వరకు అద్దెకు లభిస్తాయి. అది ఆఫీసు పార్టీ అయినా, సూట్ అయినా, ఫార్మల్ వేర్ అయినా, డేట్ నైట్ కోసం వేసుకునే డ్రెస్ అయినా, సంగీత్ అయినా లేదా మెహందీ అయినా, డిజైనర్ దుస్తులు లేదా కోచర్, రన్‌వే, లేదా బోటిక్ కలెక్షన్‌లు  ఇలా మొత్తం ఫ్లై రోబ్‌లో ఉన్నాయి. ఇందులో అద్దెకు తీసుకోవాలని అనుకుంటే వారు  కొలతలు తీసుకోవడానికి ఒక ప్రొఫెషనల్‌ని పంపుతారు.  దుస్తులు  సరిపోయేలా మారుస్తారు.  వీటిని  కొన్ని రోజులు ఉంచుకోవచ్చు  సమయం పూర్తైన తర్వాత  పికప్ సర్వీస్  కూడా ఉంది. స్విస్ లిస్ట్ స్విష్‌లిస్ట్ ఒక అద్బుతమైన సర్వీస్. ఇందులో డ్రీమ్ అనుకోగలిగిన దుస్తులన్నీ ఉంటాయి. వీటిని ఇంటి వద్దకే డెలివరీ చేయడం, ఇంటి గుమ్మం నుండి మళ్లీ పికప్ చేసుకుంటారు. ఇందులో రాబోయే  వేడుకల కోసం ముందుగానే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని విష్ లిస్ట్ లో ఉంచుకోవచ్చు. ఆ తరువాత సమయం వచ్చినప్పుడు దాన్ని అద్దెకు తీసుకుని వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు.  అన్ని రకాల వేడుకలకు తగిన దుస్తులు ఇందులో ఉంటాయి. ర్యాప్డ్.. Wrapd సుమారు ఆరు సంవత్సరాల క్రితం బట్టలు అద్దెకు ఇచ్చే  ఆలోచనను ప్రారంభించారు.  కానీ ఆ సమయంలో ఈ  ఆలోచన  వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు అసంబద్ధంగా  ఆలోచనలేనిదిగా,  ఆచరణాత్మకమైనది  కాదని  అనిపించింది. చాలా మంది దానిని అప్పటికి అంగీకరించలేదు,దీంతో ఇది ఆఫ్ లైన్ స్టోర్ లా ఏర్పడింది.  తరువాత ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది.   దాని పేరును మార్చింది. ఢిల్లీలోని పెద్ద స్టోర్‌లకు వెళ్లడం నుండి జైపూర్,  హైదరాబాద్‌లకు బ్రాంచ్ చేయడం వరకు  పెద్ద ఆన్‌లైన్ కస్టమర్ బేస్‌ను నిర్మిస్తూ ర్యాప్డ్ చాలా విస్తరించింది. Wrapd ప్రధానంగా వివాహాలు, పెళ్లి కార్యక్రమాలకు , అందులో  పాల్గొనాలనుకునే వారికి దుస్తులను అద్దెకు ఇస్తుంది. మొదటగా ఎంచుకున్న డ్రెస్ నచ్చకపోతే 48గంటల్లోపు వేరేవాటిని మార్చుకోవచ్చు. లిబరెంట్ ప్లస్ సైజ్, ప్రెగ్నెన్సీ, పెటైట్  ఇలా ఏదైనా, లిబరెంట్ మహిళలను, వారికున్న బోలెడు అవసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రతి కేటగిరీలో  ఎంచుకున్న దుస్తులతో ఇది అన్నింటినీ అందిస్తుంది.  ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కోసం A-లైన్ డ్రెస్, లేదా సంగీత్ కోసం గౌను లేదా పెళ్లికి లెహంగా కావాలంటే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న కలెక్షన్‌తో డిజైనర్ వేర్‌లను అద్దెకు ఇవ్వడంలో Liberent దూసుకుపోతోంది.  భారతదేశంలోని అన్ని ప్రధాన మెట్రోలలో  ఇది ఏర్పాటుచేయబడింది. స్టేజ్ 3 .. స్టేజ్ 3 అనేది ఏ వెబ్సైట్ ఇవ్వలేని అత్యుత్తమ సేవ.  ఇది మార్కెట్‌లో అంతరాన్ని తగ్గించడానికి ప్రారంభించబడింది.  ప్రముఖ ప్యాషన్ డిజైనర్లు  సబ్యసాచి ముఖర్జీ, అంజు మోడీ, మనీష్ మల్హోత్రా, రిధి మెహ్రా వంటి ఫ్యాషన్  పరిశ్రమలోని వారు డిజైన్ చేసిన దుస్తుల మీద ఆసక్తి ఉంటే  అందుకు  స్టేజ్ 3కి మంచి వేదిక. డిజైనర్ దుస్తులను అద్దెకు ఇవ్వడం నుండి సెలబ్రిటీల రూపాన్ని ప్రతిబింబించే వరకు, ఇది అందరికీ  అందుబాటులో ఉంటుంది.                                                              *నిశ్శబ్ద.