ముడతలు పడిన జీన్స్ ను మామూలుగా చేయడానికి బెస్ట్ ఐడియాస్..

నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అని సినిమా పాట అన్నేళ్ళ కిందట రాసిన కారణమో ఏమో కానీ నేటికాలం అమ్మాయిలు  జీన్స్ లేనిదే ఇంట్లో నుండి కదలరు. పట్టణాలు, నగరాలలో నివసించే ఎంతోమంది  రోజువారీ డ్రెస్సింగ్ లో జీన్స్ ఒక భాగం. అయితే కాలేజీలలో అయినా, ఆఫీసులలో అయినా జీన్స్ వేసుకుని గంటలు గంటలు కూర్చోవడమే జరిగేది. ఇలా చేయడం వల్ల ప్యాంటు నడుము, మోకాళ్లు, తొడల పై భాగంలో  ముడుతలు పడతాయి. వీటిని సరిచేయడం కష్టంగా అనిపిస్తుంది. కొందరికి సహనం పోతుంది. కానీ వీటిని కొన్ని పద్దతుల ద్వారా సులువుగా సరిచేయవచ్చు. అవేంటో తెలుసుకుంటే..


డ్రై ఐస్..

ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో డ్రై ఐస్ వేయాలి.  ఇంకొక బ్యాగ్ లో ముడుతలు పడిన ప్యాంట్ పెట్టాలి. ప్యాంట్ ఉన్న బ్యాగ్ ను డ్రై ఐస్ ఉన్న బ్యాగ్ లో పెట్టాలి. రెండుగంటల పాటు దీన్ని ఇలాగే వదిలేయాలి. ఆ తరువాత తీసి చూస్తే ప్యాంటు మీద ముడుతలు అన్ని మంత్రించినట్టు మాయమవుతాయి. అయితే ముడుతలు ఎక్కువ లేని దుస్తులకు ఈ టిప్ ఫాలో అయితే దుస్తులు పాడయ్యే అవకాశం ఉంటుంది.

ఐరన్..

ఐరన్ ఎంత చేసినా జీన్స్ ప్యాంటు మీద ముడతలు పోలేదా? అయితే ఈ చిట్కా ఉపయోగించాలి. జీన్స్ ప్యాంటు మీద ముడతలు ఉన్నచోట బాగా నీటిని చిలకరించాలి. ప్యాంటు కాస్త తడిగా ఉన్నప్పుడు బాగా రుద్దితే ముడుతలు చాలా వరకు  సెట్ అయిపోతాయి. అయితే ముడుతలు పోవాలని ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు ఐరన్ బాక్స్ తో రుద్దకండి.

స్నానం..

జీన్స్ ప్యాంటుకు స్నానమా అని ఆశ్చర్యం వేస్తుందా?  పూర్తీగా తెలుసుకోండి. జీన్స్ ప్యాంటు వేసుకుని అలాగే దుస్తులతోనే నీరు నిల్వ ఉన్న బాత్ టబ్ లేదా నీటి తొట్టెలలో కూర్చోవాలి. అయితే సబ్బు, షాంపూ గట్రా ఉపయోగించకుండా కేవలం అలా నీటిలో కూర్చోవాలి అంతే.. వేడినీటిలో ఇలా కూర్చుని నీరు చల్లగా మారిపోగానే బయటకు వచ్చేయాలి. ఈ జీన్స్ ను జాగ్రత్తగా తీసి ఆరేయాలి. లేదంటే అలాగే ఒంటి మీద ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకుంటే ఒక్క ముడుత లేకుండా ప్యాంట్ ఐరన్ చేసినట్టు మారిపోతుంది. అయితే ఇది ఎలాంటి ఇతర మార్గాలు లేని సమయంలో దూరప్రాంతాలలో వసతులు సరిగా లేని చోట ఫాలో అయితే మంచిది. ఎందుకంటే తడిబట్టలతో అలా ఉండటం ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

ఫ్రీజర్..

ప్యాంటును ప్రిజ్ లో పెట్టడం గురించి విన్నారా? సమ్మర్ లో కొందరు సరదాగా వీడియోస్ కోసం బట్టలు ఫ్రీజర్ లో పెట్టడం చూసి ఉంటారు. కానీ ముడుతలు పడిన జీన్స్ ను ఒకరోజంతా ఫ్రీజర్ లో ఉంచితే అదిరిపోయేలా ఒక ముడుత కూడా లేకుండా సెట్టయిపోతుంది. అయితే కాటన్ జీన్స్ మాత్రం ఇలా చేయకూడదు.

                                                               *నిశ్శబ్ద.