మహిళలూ.. జీన్స్ కొనుగోలులో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఇది మీకోసమే..

జీన్స్ వేసుకోవడం అబ్బాయిల నుండి అబ్బాయిల వరకు అందరికీ ఇప్పుడు సాధారణం అయిపోయింది. అయితే అబ్బాయిలు జీన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు పెద్ద కష్టపడకుండానే సెలెక్ట్ చేసుకుంటారు. నచ్చిన రంగు, నచ్చిన ధర ఫిక్స్ అయితే చాలు. వారికి పెద్ద కంప్లైంట్స్ ఉండవు. కానీ మహిళల విషయానికి వస్తే, జీన్స్  కొనుగోలు చేయడం పెద్ద ఛాలెంజే.  ఎందుకంటే ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుంది. కొందరికి చిన్న నడుము, కొందరికి పెద్ద నడుము. స్త్రీలు  దాదాపు 30కి పైగా వెరైటీ నడుము కొలతలు కలిగి ఉంటారు.  ఇలాంటి సందర్భంలో మహిళలు ఎవరు ఎలాంటి జీన్స్ కొంటె బాగుంటుంది? ఎలాంటి జీన్స్ ధరిస్తే టాప్స్ నుండి  టీ-షర్టు వరకు ప్రతిదీ మెరుగ్గా కనిపిస్తుంది. తెలుసుకంటే..

స్ట్రైట్ కట్ జీన్స్..

స్కిన్నీ జీన్స్  వంకరగా ఉన్న శరీరాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తుంది. అందుకే కొందరు ఈ జీన్స్ ను  ఇష్టపడరు. అలాంటి  మహిళల కోసం  స్ట్రెయిట్ కట్ జీన్స్ ఖచ్చితంగా సరిపోతాయి. స్ట్రెయిట్ కట్ కారణంగా  దిగువ భాగంలో  వంకరలు  బాగా కవర్ అవుతాయి. ఇక  ఇది  షర్ట్ తో ఆఫీసులకు వెళ్లడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.  

హై రైజ్ జీన్స్..

వెడల్పాటి హిప్ లైన్స్ ఉన్న మహిళలు  తక్కువ ఎత్తున్న జీన్స్ వేసుకుంటే ఎంత అసౌకర్యానికి గురవుతారో అర్థం చేసుకోవచ్చు. అయితే  ఇలాంటి హిప్ లైన్స్ జీన్స్  బదులుగా ఎత్తైన జీన్స్‌ను ఎంచుకుంటే  హిప్ లైన్స్ ఉన్న మహిళలకు సౌకర్యాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి మంచి ఆకృతిని ఇస్తుంది.  

మమ్ జీన్స్..

మమ్  జీన్స్ అనేది జీన్స్ లో ఉన్న  మరొక సౌకర్యవంతమైన రకం. ఇది కొంతవరకు స్ట్రెయిట్ కట్ జీన్స్ కేటగిరీలోకి వస్తుంది. ఒక తేడా ఏమిటంటే  కాలు  వెడల్పు కొంచెం పెద్దదిగా ఉంటుంది.  ఇది సాధారణంగా ఎత్తుగా లేదా నడుము మధ్యలో ఉంచబడుతుంది. 30 ప్లస్ నడుము ఉన్న క్రాస్  ఫిగర్ మహిళలకు ఇది సరైన ఎంపిక అవుతుంది.

బూట్ కట్ జీన్స్..

 ఫిట్టింగ్ టాప్ కావాలంటే దిగువన ఓపెన్ హెమ్‌లైన్ ఉంటే, ఫ్లేర్డ్ లేదా బూట్ కట్ జీన్స్ మంచి ఆప్షన్. ఈ రకమైన జీన్స్‌లో కర్వ్‌లు అందంగా హైలైట్ గా ఉంటాయి. ఇవి కొంచెం సెక్సీ టచ్‌ని కూడా జోడిస్తాయి. దిగువ భాగం విశాలంగా ఉన్న కారణంగా  ఇది బూట్‌లు లేదా హీల్స్‌తో చాలా బాగా సెట్ అవుతుంది. ఇది షేప్ ను కవర్ చేయడంలో బాగా పనిచేస్తుంది.

మిడ్ రైజ్ జీన్స్..

ఎత్తుగా కనిపించడం ఇష్టం లేకపోయినా  30-35 నడుము సైజ్ ఉన్న మహిళలకు మిడ్ రైజ్ జీన్స్  మంచి ఎంపిక. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో రంగుల సెలక్షన్ చాలా బాగుంటుంది.

                                                   *నిశ్శబ్ద.