ఆకట్టుకునే లుక్ కోసం వి నెక్


చీర ధర ఎంత అనే రోజులు కావివి. బ్లౌజు ఎలా కుట్టిస్తున్నామన్నదే అసలు విషయం. అందుకే డిజైనర్ బొటిక్ లకు డిమాండ్ మామూలుగా లేదు. అలాని అందరూ హెవీ వర్క్ డిజైన్లకే మొగ్గుచూపుతున్నారని కాదు. ఎందుకంటే ఈ జనరేషన్ అమ్మాయిలను ఒక్కప్పటి వింటేజ్ ట్రెండింగ్...వి నెక్ డిజైన్స్ మెప్పిస్తున్నాయి. ఆ వి నెక్ డిజైన్లను మనమూ ఓసారి చూద్దామా.