ఆడవాళ్లు ఎక్కువగా ఉద్యోగం చేస్తే..?     మారుతున్న సమాజంలో స్పష్టంగా కనిపించే అంశం... ఆడవారు కూడా ఉద్యోగసోపానంలో ఉన్నత శిఖరాలను అందుకోవడం! మరి తమను తాము నిరూపించుకునే క్రమంలో వారు ఛేదిస్తున్న లక్ష్యాలతో పాటుగా వెంటాడుతున్న అనారోగ్యాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఆదివారం మినహా రోజుకి పదేసిగంటలపాటు ఉద్యోగం చేస్తూ ఉంటే... ఎవరికైనా చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అలాంటివారు అజీర్ణం, ఊబకాయం... లాంటి అనారోగ్యాలను గమనించుకోక తప్పదు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ‘అలార్డ్‌’ అనే పరిశోధకుడు పూనుకున్నాడు. తన పరిశోధన కోసం దాదాపు 7,500 ఉద్యోగులను మూడు దశాబ్దాల పాటుగా గమనించాడు. వీళ్లలో గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, ఉబ్బసం, రక్తపోటు, డిప్రెషన్‌ లాంటి సమస్యలు ఏర్పడటానికీ... పనిగంటలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా అని పరిశీలించాడు. అలార్డ్‌ పరిశోధనల్లో... పనిగంటలకీ, పైన పేర్కొన్న వ్యాధులకీ కొంత సంబంధం ఉందని తేలింది. అయితే విచిత్రంగా ఆడవారిలో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతోందన్న దాని మీద అలార్డ్‌ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోయింది. ‘బహుశా ఉద్యోగిగా, గృహిణిగా, తల్లిగా... ఇన్ని బాధ్యతలను ఒక్కసారిగా సమర్థవంతంగా మోయాలనుకునే ప్రయత్నంలో వారి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటోందేమో’ అని ఊహిస్తున్నారు అలార్డ్‌. అయితే డా॥ గోల్డ్‌బర్గ్‌ అనే వైద్యరాలు మాత్రం అధికపనిగంటల వల్ల ఆడవారు అనారోగ్యం పాలవ్వడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. పని ఒత్తిడిలో పడిపోయి ఆడవారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరనీ. స్త్రీలకు అవసరమైన మేమోగ్రాం వంటి పరీక్షలు చేయించుకునేందుకు కూడా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారనీ గోల్డ్‌బర్గ్‌ విశ్లేషిస్తున్నారు. అంతేకాదు! ఉద్యోగం చేసే ఆడవారు ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒక చిరుతిండితో సరిపెట్టేసుకుంటారనీ అంటున్నారు. మరి అధిక పనిగంటలు ఉన్నాయి కదా అని ఆడవారు ఉద్యోగాలలో వెనుకంజ వేయాలా? అంటే అదేమీ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఉద్యోగ బాధ్యతలలో ఏది అవసరం, ఏది అనవసరం అని బేరీజు వేసుకుని అనవసరమైన బాధ్యతలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోజులో కాస్త సమయాన్నైనా తమకోసం వెచ్చించుకోవాలని సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేయడమో, పుస్తకాలు చదవడమో, టీవీతో కాలక్షేపం చేయడమో, ధ్యానంలో ఉండటమో... ఇలా ఉద్యోగపరమైన ఆలోచనల నుంచి కాసేపు మనసుకి విశ్రాంతిని కలిగించమంటున్నారు. - నిర్జర  

Yoga For Computer Users     Yoga For Computer Users: Watch Dr C.V.Rao of Kapila Maharshi Yoga Kendram show us various exercises for people who are on the Computer for long hours. A must watch for all those ladies who are in the field of IT and who use the computer regularly. He shows simple Yoga exercises which can be done at your workplace without any discomfort or need for space. He shows various breathing exercises along with Yogaasanas for keeping the body fit , alert and free from any symptoms related to excessive use of the Mouse and watching the Computer for long.  

Yoga for a Healthy Menstrual Cycle Yoga for a pain-free Menstrual Cycle: Watch Rajeswari Vaddiparthi  show us Yogic postures for pain free periods.These asanas also help in regulating your period cycles and ease cramps.    

  హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే....     ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్దతులు పాటిస్తే మంచిది. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే  చాలు, ఎలాంటి సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో  కాస్తంత జాగ్రత్త పాటింఛి దానిని పెంచుకోవటం  మంచిది  కదా. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్ళు ఎక్కువగా పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలయినవి తినాలి. నువ్వులు,బార్లి, బాదం పప్పు  తినటం కూడా మంచిది. మాంసాహారులు ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.   అదేగనక ఒంట్లో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే అలాంటి వాళ్ళు జామకాయలు, బొప్పాయి, కివి పండు, కమలాపండు, ద్రాక్ష తీసుకోవాలి. అదే కూరగాయల్లో అయితే కాప్సికమ్, క్యాబేజ్, టమాటా  ఇలాంటివి ఎక్కువగా తినాలి. బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ దోహదపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు రోజుకి 10 లేక 12 బాదం పప్పులు నానబెట్టుకుని తినాలి. బీట్రూట్ రక్తహీనతకు తిరుగులేని మందు. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్రూట్ జ్యూస్ , 20 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్ కూడా రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవన్ని ఉండేటట్లు చూసుకుంటే చాలు హిమోగ్లోబిన్ పెరగటానికి టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సిన పని ఉండదు.   ..కళ్యాణి

పసుపుతో చేసిన మందులతో కేన్సర్ మాయం     భారతీయ స్త్రీలకు పసుపు అంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. ఇంట్లో పసుపు నిండుకుంటే, వారికి రోజంతా లోటుగానే తోస్తుంది. కూరలో కాస్త రుచి కావాలన్నా, మొహం కాంతిగా ఉండాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా.... ఆఖరికి కొత్త బట్టలు వేసుకోవాలన్నా చిటికెడు పసుపు లేనిదే పని జరగదు. పసుపులో ఉండే ఔషధగుణాల వల్లే మన సంప్రదాయంలో దానికి అంత ప్రాముఖ్యత అంటారు. పసుపుకి ఉండే ఔషధి గుణాల గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఓ నాలుగు గ్రాముల పసుపు నోట్లో పడితే జీర్ణాశయం దగ్గర నుంచి గుండె వరకు మన ఒంట్లో అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. కేన్సర్ని నిరోధించడంలోనూ పసుపు ప్రభావం గురించి ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కేన్సర్కు మందుగా పసుపుని ఉపయోగించడం ఎలాగా? అన్నది ఇప్పటిదాకా ఓ సమస్యగానే ఉంది. ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కనుగొన్నారన్న శుభవార్త వినిపిస్తోంది. పసుపు ఆ రంగులో ఉండేందుకు, అది ఒక ఔషధంగా ఉపయోగపడేందుకు... అందులో ఉండే సర్కుమిన్ అనే రసాయనమే కారణం! అయితే ఈ సర్కుమిన్ను నేరుగా కేన్సర్ కణాల మీద ప్రయోగించడం సాధ్యం కాదు. సర్కుమిన్కు కరిగే గుణం తక్కువ, స్థిరత్వమూ తక్కువే! దాంతో నానోపార్టికల్స్ అనే ప్రక్రియ ద్వరా దీనిని కేన్సర్కు మందుగా వాడే ప్రయత్నం చేశారు. ఇందుకోసం Cerium oxide అనే సూక్ష్మకణాలకు (nano particles) సర్కుమిన్ను జోడించారు. దీనికి dextran అనే ఒక తరహా గ్లూకోజ్ను పైపూతగా పూశారు. ఇక మందు సిద్ధమైపోయింది! పరిశోధకులు రూపొందించిన ఈ మందుని Neuroblastoma అనే ఒక అరుదైన కేన్సర్ మీద ప్రయోగించి చూశారు. ఎక్కువగా పసిపిల్లలని కబళించే ఈ తరహా కేన్సర్ని చాలా ప్రాణాంతకంగా భావిస్తూ ఉంటారు. నాడీవ్యవస్థని ప్రభావితం చేసే ఈ కేన్సర్ మన అడ్రినల్ గ్రంథులలో మొదలై శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఈ కేన్సర్ కణాలు సంప్రదాయవైద్యానికి ఓ పట్టాన లొంగవని చెబుతారు. చికిత్స తర్వాత కేన్సర్ తగ్గినట్లు కనిపించినా మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఎక్కువే. అదృష్టవశాత్తూ వ్యాధి నయమైనా కూడా ఇతరత్రా దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్టమైన Neuroblastoma కేన్సర్ మీదకు పసుపుతో చేసిన నానోపార్టికల్స్ను ప్రయోగించి చూశారు. ఫలితం ఊహించినదే! పసుపుతో చేసిన ఈ మందులు కేన్సర్ కణాలను నిర్వీర్యం చేసిపారేశాయి. ఈ క్రమంలో అవి శరీరంలోని ఇతరత్రా ఆరోగ్యకరమైన కణాలను ఎటువంటి హానీ తలపెట్టలేదు. కేన్సర్ వల్ల మృత్యువాత పడే పిల్లలలో 15 శాతం మంది ఈ Neuroblastomaతోనే చనిపోతున్నారట. కాబట్టి ఈ సరికొత్త ప్రయోగంతో అలాంటి మరణాలను నిస్సందేహంగా ఆపవచ్చని ఆశిస్తున్నారు. ఇదే తరహా చికిత్సను ఇతరత్రా కేన్సర్లకి కూడా ప్రయోగించే రోజులూ వస్తాయి. అదే కనుక జరిగితే... ఇక మానవాళి కేన్సర్ నుంచి విముక్తి చెందినట్లే! - నిర్జర.    

మందులే కదా అని మింగేయకండి!            పెయిన్ కిల్లర్... ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వేసుకోవాల్సి వస్తుంది. అయితే పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలామంది చేసే తప్పు... మళ్లీ మళ్లీ వేసేసుకోవడం. ఒక ట్యాబ్లెట్ వేస్తే నొప్పి తగ్గింది కదా అని ఎప్పుడు నొప్పి వచ్చినా అదే ట్యాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. అది ఎంత ప్రమాదమో ఊహించరు. నిజానికి ఈ మందులు వెంటనే ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ మోతాదు మించితే చెప్పలేనని సమస్యలు తెచ్చిపెడతాయి.       పొట్టలోని లోపలి పొరలు, రక్తనాళాల్ని దెబ్బ తీస్తాయి. మూత్రపిండాల్లోని నాళాలు కూడా దెబ్బ తింటాయి. కొందరిలో అయితే హై బీపీ వస్తుంది. గుండె పనితీరుపై ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంది. అలాగే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే ప్లేట్ లెట్స్ దెబ్బ తింటాయి. ఇది ఒక్కోసారి తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది. ఇవి మాత్రమే కాక.. నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, నోరు ఎండిపోయి అస్తమానం దాహం వేయడం, మలబద్దకం, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, ఊరకే అలసిపోవడం వంటి రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఇవి మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని తెలియక చాలామంది హైరానా పడిపోతుంటారు.        కాబట్టి పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ని అడక్కుండా ఎలాంటి పెయిన్ కిల్లర్ వాడకండి. డాక్టర్ కనుక వాడమని ఏదైనా మందు రాస్తే ఎంత మోతాదు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి వంటి వివరాలు తప్పకుండా అడిగి తెలుసుకోండి. మందులు కొనేటప్పుడు ఎక్స్ పయిరీ డేట్ తప్పకుండా చూసుకోండి. షీట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమైనా రాశాడేమో బాగా చదవండి.         పరగడుపున పెయిన్ కిల్లర్ ఎప్పుడూ వేసుకోవద్దు. అలాగే వేసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. మందు వేసుకున్న తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే డాక్టర్ కి తప్పకుండా చెప్పాలి. ఒకవేళ అది మీకు పడదు అనుకుంటే వెంటనే మారుస్తారు. అలాగే పడని ఆ మందు పేరును ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఏ డాక్టరైనా పొరపాటున ఆ మందు రాస్తే మళ్లీ వాడేయకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే కోర్సు వాడటం పూర్తయినా సమస్య తీరకపోతే మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లండి తప్ప మీ అంతట మీరే కోర్సును కంటిన్యూ చేసేయొద్దు.        ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే పెయిన కిల్లర్ తో ఏ సమస్యా ఉండదు. కానీ నిర్లక్ష్యం చేశారో... ప్రాణాలో పోసే మాత్రలే ప్రాణాల మీదికి తీసుకొస్తాయి గుర్తుంచుకోండి.  -Sameera  

ఆ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయొద్దు!     మన శరీరం, మన అలవాట్లు, మన దైనందిన చర్యల్లో మార్పులు వస్తున్నా గమనించుకోలేనంత బిజీ జీవితాలు మనవి. ముఖ్యంగా వర్కింగ్ ఉమన్. ఓపక్క ఇంటిని చక్కదిద్దుకుంటూ, మరోపక్క ఉద్యోగాల కోసం పరుగులు తీసే క్రమంలో తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో కొన్ని ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో మూత్రాశయ క్యాన్సర్ ఒకటి. మూత్రం, మూత్ర విసర్జనాక్రమంలో వచ్చే మార్పులను గమనించుకోకపోవడం వల్ల మూత్రాశయ క్యాన్సర్ ని ముందుగా గుర్తించలేకపోతున్నారు. తద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మీరు ఆ తప్పు చేయకండి. ఈ లక్షణాలు కనుక కనిపిస్తే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి. - మూత్రం ఎరుపురంగులోకి మారిందా? అయితే పరీక్ష చేయించుకోవాల్సిందే. మూత్రంలో రక్తం పోతూ ఉన్నప్పుడే అలా రంగు మారవచ్చు. - మాటిమాటికీ మూత్రం వస్తున్నట్టు అనిపిస్తుంది. వెళ్తే చుక్కలు చుక్కలుగా చిన్న మొత్తంలో వచ్చి ఆగిపోతుంది. - మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుంది. చురుక్కు చురుక్కుమనడంతో మొదలై నరాలు మెలిపెడుతున్నంత నొప్పి కలుగుతుంది. - తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. - అరికాళ్లు, మడమల దగ్గర వాపు వస్తూ ఉంటుంది. అలా అని ప్రతి వాపూ క్యాన్సర్ లక్షణం కాదు. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల నీరు చేరవచ్చు. అయితే వాపు వచ్చి ఓ పట్టాన తగ్గకపోతే మాత్రం ఆలోచించాల్సిందే. - కటి ప్రాంతంలో ఎముకలు, నరాలు నొప్పిగా అనిపిస్తాయి. - బరువు వేగంగా తగ్గిపోవడం కూడా సంభవిస్తుంది. అయితే ప్రతి ఒక్కరిలో ఇవన్నీ కనిపించకపోవచ్చు. ఏ ఒక్క లక్షణం కనిపించినా నిర్లక్ష్యం కూడదు. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. నిజంగా వ్యాధి ఉంటే కనుక దాన్ని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్సకు వీలుంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. - Sameera      

థైరాయిడ్‌ ఆడవాళ్లకే ఎందుకు వస్తుంది?   ఈమధ్య ఏ ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకున్నా వచ్చే ప్రశ్నలలో ఒకటి- ‘మీకు థైరాయిడ్ ఉందా?’ అంతేకాదు త్వరగా ప్రెగ్నెంట్ కాకపోయినా, బాగా నీరసంగా ఉన్నా, ఒక్కసారిగా ఒళ్లు చేసినా, జుట్టు రాలిపోతున్నా... ఆఖరికి చిరుకుగా ఉన్నా డాక్టర్లు థైరాయిడ్ టెస్ట్‌ చేయించుకోమనే సూచిస్తున్నారు. ఇంతకీ థైరాయిడ్‌ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది.   థైరాయిడ్ సమస్య ఆటోఇమ్యూన్‌ వ్యాధి వల్ల వస్తుంది. మన శరీరమే, కొన్ని అవయవాల మీద దాడి చేసి వాటిని పాడు చేయడాన్ని ఆటోఇమ్యూన్ వ్యాధి అంటారు. ఆడవాళ్లకి నెలసరి వచ్చిన ప్రతిసారీ వాళ్ల శరీరంలోని హార్మోనులలో విపరీతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ గ్రంధిని దెబ్బతీస్తుంది. దానివల్ల థైరాయిడ్‌ చాలా తక్కువగా పనిచేయడమో (హైపో థైరాయిడ్‌) లేదా ఎక్కువగా పనిచేయడమో (హైపర్‌ థైరాయిడ్‌) జరుగుతుంది.   ప్రెగ్నెన్సీ సమయంలోను, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అకస్మాత్తుగా థైరాయిడ్‌ సమస్య రావడానికి కారణం కూడా హార్మోన్‌ ఇంబాలెన్సే! అందుకనే ఆడవాళ్లు ఎప్పటికప్పుడు ఇతర పరీక్షలతో పాటు తప్పకుండా థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే పిల్లలు పుట్టకపోవడం, పుట్టినా ఆరోగ్యంగా లేకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. -Nirjara

పాలతో క్యాన్సర్‌ ఆటకట్టు   క్యాన్సర్ బాధితులకు ఒక శుభవార్త..! నిత్యం రెండు గ్లాసులు పాలు తాగితే క్యాన్సర్ నుంచి కొంతలో కొంతైనా ఉపశమనం పొందొచ్చంటున్నారు నిపుణులు. పాలలో ఉండే ‘మిల్క్ ప్రొటీన్’ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్, స్వీడన్ నిపుణులు గుర్తించారు.   మిల్క్ ప్రొటీన్ గల ఏ పదార్థాలైనా సరే అవి.. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేయగల గుణం మిల్క్ ప్రొటీన్‌కు ఉంది. ఎక్కువ మిల్క్ ప్రొటీన్ తీసుకునే వారిలో క్యాన్సర్ సమస్యలు పెద్దగా కనిపించలేవని నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. పాలు ఆరోగ్యానికే కాదు... క్యాన్సర్ రోగానికి కూడా మందు లాంటిదే.

వేసవిలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి మనలో చాలామంది వేసవి వస్తుంది కదా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఏమో అని భయపడుతూ ఉంటారు. అలా భయపడుతూ మరింతగా ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దాంతో మరింతగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఎలా అని ఆలోచిస్తాము. ఆ ఆలోచన ఏదో వేసవి వస్తుండటంతో ఆలోచిస్తే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకోసం సింపుల్ గా ఈ కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.   * ప్రతిరోజూ కొబ్బరి నీళ్ళు, పళ్ళరసాలు, మంచినీళ్ళు, మజ్జిగ, తాటిముంజెల నీరు తీసుకుంటే మంచిది.   * బార్లీ గింజల్లో నీరుపోసి, ఉడికిన తరువాత బార్లీ నీళ్ళల్లో ఉప్పుగాని, పంచదార లేదా నిమ్మరసం వేసుకొని తాగితే చలువ చేస్తుంది. ఈ నీరు పిల్లలకి చాలా ఉపయోగదాయకం.   * ఉదయం పూట తీసుకొనే టిఫిన్స్ కాని, సాయంత్రం పూట తీసుకొనే స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవాలి.

నిజంగా కొబ్బరి నూనే వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా...  

పేస్ బుక్... అమ్మాయిలు అమ్మో!   మీరు ఫేస్‌బుక్‌కి అతుక్కుపోతున్నారా..? అయితే మిమ్మల్ని.. మీ జీవితాన్ని ఫేస్‌బుక్ కంట్రోల్ చేస్తుందట. అసూయ, డిప్రెషన్‌లాంటి సమస్యలు ఎదురవుతాయి. మరి దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=THUkA8sSvyQ

యూరిన్ ఇన్ ఫెక్షన్ కి కారణాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తలు..!  

ఈ చిన్న చిట్కాతో డిప్రెషన్ ని పోగొట్టుకోవచ్చు...   ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల మహిళలు త్వరగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారు డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో.. ఈ వీడియో చూసి నేర్చుకొండి.  https://www.youtube.com/watch?v=oax1WsQvUrM

కంటి నిండా నిద్ర పట్టాలంటే...?     హాయిగా కంటి నిండా నిద్ర పడితేనే మర్నాడు చక్కగా పనులు చేసుకోగలుగుతాం . లేదంటే చిరాకు , కోపం , అలసట అన్నీ ఒక్కసారే మనపై దాడి చేస్తాయి. ఏదో ఎప్పుడో ఒకసారి అలా నిద్ర కోసం యుద్ధం చేయాల్సి రావటం పర్వాలేదు కాని , తరుచు నిద్ర పట్టటం కష్టం గా మారితే మాత్రం కొంచం జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు డాక్టర్స్. నిద్ర పట్టక పోవటానికి టెన్షన్స్ , సెల్ ఫోన్స్ లాంటివి కొంత వరకు కారణం అని మనమందరం వినే వుంటాం. అయితే మనం తీసుకునే ఆహరం కూడా అందుకు కారణం కావచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు . పిండి పదార్ధాలు , ఖనిజాలు తక్కువగా వుండే ఆహరం తీసుకోవటం , లేదా నిద్ర పోయే ముందు మాంస క్రుత్తులు ఎక్కువగా వుండే స్నాక్స్ తినటం వంటి పొరపాట్లు మనకి  నిద్రని దూరం చేస్తాయిట.   1.పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే పదార్థాల్ని ఆహరంగా తీసుకుంటే అవి " ట్రిప్టోఫాన్ " అనే అమినో ఆమ్లాలను మెదడుకు పంపిస్తాయి. దాంతో నిద్ర ముంచుకు వస్తున్నా భావన కలుగుతుంది అట. కాబట్టి రాత్రి పూట బియ్యం , గోధుమలు , బ్రెడ్ , రాగి , కార్న్ ఫ్లేక్స్ వంటివి మన ఆహరం లో ఉండేలా చూసుకోవాలి.    2. అలాగే కాల్షియం , మెగ్నీష్యం , ఐరన్‌లు మన శరీరంపై మత్తుగా ఉండేలా ప్రభావాన్ని చూబిస్తాయి . కాబట్టి గోరువెచ్చటి పాలు , ఆకుకూరలు , బాదం , జీడిపప్పు , వంటివి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది .    3. ఇక పడుకునే ముందు మాంస క్రుత్తులు అదికంగా వుండే స్నాక్స్ తినకపోవటమే మంచిది .ఎందుకంటే ఇవి మనం తిన్న ఆహరం నుంచి " ట్రిప్టోఫాన్ " మెదడును చేరకుండా అడ్డుకుంటాయి. దాంతో సరిగ్గా నిద్ర పట్టదు.    ఈ సారి నిద్ర పట్టక పోతే ఒకసారి మీ ఆహారపు అలవాట్లని కూడా గమనించి చూసుకోండి . మంచి ఆహరం మంచి నిద్రని , మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ,ఇస్తాయి . మంచి ఆరోగ్యం మనల్ని అన్నిరకాలుగా చురుకుగా ఉంచుతుంది .  -రమ  

కడుపులో కవలలు ఉంటే..?     కడుపులో బిడ్డ పడితే తల్లికి ఎంత సంబరమో. అదే కడుపులో ఇద్దరు బిడ్డలు పడితే? సంతోషంతో పాటు కాస్త టెన్షన్ కూడా మొదలవుతుంది. ఒక బిడ్డ ఉంటేనే ఎంతో కేర్ తీసుకుంటాం. మరి ఇద్దరు బిడ్డలు ఉంటే ఎక్కువ కేర్ తీసుకోవద్దా? తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలి. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా వచ్చే ప్రెగ్నెన్సీ కంటే కన్సీవ్ అవ్వడం కోసం మందులు వాడేవాళ్లు, ఐవీఎఫ్ చేయించుకున్నవాళ్లు, ముప్ఫై అయిదేళ్లు దాటిన వారికి కవలలు ఎక్కువగా పుడుతుంటారు. మామూలుగా అయితే ఒక బిడ్డ పెరగడానికి అనువుగానే శరీరం ఉంటుంది. కాబట్టి కవలలు ఉన్నారని తేలితే హైరిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తుంటారు వైద్యులు.  ఇద్దరు శిశువులకు రెండు మాయలు, రెండు ఉమ్మనీటి సంచులూ ఉంటే పిల్లలిద్దరూ మామూలుగానే పెరిగి, సుఖప్రసవం అవుతుంది. కానీ ఒకే మాయ ఉంటే మాత్రం కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి కడుపులో కవలలు ఉన్నారని తెలిస్తే కాస్త ఎక్కువ కేర్ తీసుకోవం మంచిది. పదకొండు వారాల సమయంలో స్కానింగ్ చేయించుకుంటే కడుపులో శిశువులు ఎలా ఉన్నారు, ఎన్ని మాయలు ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది డాక్టర్స్ చెప్తారు. వాళ్లు చెప్పినట్టు ఫాలో అయితే ఏ సమస్యా ఉండదు. బలమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా జాగ్రత్త పడటం వంటి వాటి వల్ల ప్రసవం తేలికగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు బిడ్డలకు ఎలా జన్మనివ్వాలా అని టెన్షన్ పడటం మానేసి, తగిన కేర్ తీసుకుంటూ తల్లి కాబోయే అనుభూతిని ఆస్వాదించండి. - Sameera

  నాన్ వెజ్ ఎలా తినాలి?     అనారోగ్యానికి అసలు కారణం మాంసాహారం అంటారు కొందరు. నాన్ వెజ్ ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం అంటారు ఇంకొందరు. ఇలాంటివన్నీ విన్న తర్వాత మాంసాహారం మానెయ్యాలా అన్న సందేహం అందర్లోనూ తలెత్తుతోంది. అయితే పూర్తిగా మానెయ్యక్కర్లేదు అంటారు డాక్టర్స్. ఎంత తినాలి, ఎలా తినాలి అన్నది తెలుసుకుంటే నాన్ వెజ్ తో వచ్చే నష్టమేమీ ఉండదట. - మాంసంతో కూరగాయల్ని కలిపి వండటం వల్ల ఫైబర్ యాడ్ అవుతుంది. యాసిడిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది. కూరగాయల్లో ఉండే ఎంజైమ్స్ వల్ల మాంసం త్వరగా అరిగిపోతుంది కూడా. ఒకవేళ కలిపి వండకపోయినా మాంసాహారం తిన్న తర్వాత కూరగాయలతో చేసిన సలాడ్ కొద్దిగానైనా తీసుకునేలా అలవాటు చేయండి. - రెడ్ మీట్ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దానికే ప్రాముఖ్యతనివ్వండి. - మాంసం కొనేటప్పుడు దానిలో కొవ్వు ఎక్కువగా లేకుండా చూసుకోండి. వండేటప్పుడు కూడా నూనె తక్కువ వాడాలి. - వీలైనంత వరకూ ఎల్లో తీసేసి ఎగ్ వైట్ మాత్రమే తినాలి. చిన్న పిల్లలు తప్ప పెద్దవాళ్లు వారానికి రెండుసార్లకు మించి ఎగ్ తినకపోవడమే మేలు.     - చేపలు, కోడిగుడ్లను వేయించడం కంటే ఉడికించి తినడమే మేలు. ఫ్రై చేయడం వల్ల ప్రొటీన్స్ హరించుకుపోతాయి. అరుగుదల కూడా కష్టమవుతుంది. - మాంసం కంటే చేపలు చాలా ఉత్తమం. కొలెస్ట్రాల్ ప్రమాదం ఉండదు. అరుగుదల ఎక్కువ. కాల్షియం కూడా తగినంత అందుతుంది. - మాంసాహారం తిన్న తర్వాత కొంత సేపటివరకూ ఫ్రూట్స్ తినడకపోవడం మంచిది. లేదంటే ఫెర్మెంటేషన్ కారణంగా అజీర్తి, వికారం వంటి సమస్యలొస్తాయి. - థర్మోజెనిక్ ఫుడ్ అవ్వడం వల్ల మాంసాహారం తిన్న తర్వాత వేడి ఎకు్కవగా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. - యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్లు మాత్రం మాంసం తినకూడదు. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు కూడా మాంసం బదులు చేపలు తినడం మంచిది. అందులో ఉండే మెగ్నీషియం, ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గిస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే నాన్ వెజ్ తిన్నా ఏమీ కాదు. తినడం మానేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నాన్ వెజ్ అంటే భయపడకండి. మీరూ తినండి, మీవాళ్లకీ పెట్టండి. - Sameera  

ఆడవారిలో జ్ఞాపకశక్తి ఎక్కువా?   ఆడ, మగ... ఈ ఇద్దరిలో జ్ఞాపకశక్తి ఎక్కువ అని అడిగితే చెప్పడం కష్టం. ప్రకృతి ఇద్దరికీ సమానంగానే జ్ఞాపకశక్తిని అందించింది. కాకపోతే స్త్రీలకు ఉండే ప్రత్యేక బాధ్యతలని బట్టి, వారిలో జ్ఞాపకశక్తి అధికమేమో అన్న అనుమానం శాస్త్రవేత్తలని నిరంతరం పీడిస్తూనే ఉంది. అది నిజమో కాదో ఓ పరిశోధనతో తేలిపోయింది BRAIN FOG సాధారణంగా స్త్రీలు మెనోపాజ్ దశను దాటే సమయంలో అనేక శారీరిక, మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. హార్మోనులలో వచ్చే అసమతుల్యత వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతుంటారు. జ్ఞాపకశక్తిలో ఇబ్బందులు ఏర్పడటం కూడా ఈ సమస్యలలో ఒకటి. అయోమయం, మతిమరపు, దేని మీదా దృష్టి నిలపలేకపోవడం, ఆలోచనలో స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ తరహా పరిస్థితిని ‘Brain Fog’ అని పిలవడం కద్దు. మగవారితో పోలిస్తే స్త్రీలలోని రుతుక్రమం ఆగిపోయే మెనోపాజ్ దశలోనే కాదు, ఆ తరువాత కూడా వారిలో జ్ఞాపకశక్తిలో కొంత క్షీణత ఏర్పడుతుందని ఇప్పటికే తేలింది. పైగా మగవారితో పోలిస్తే స్త్రీలలో డిమెన్షియా అనే మతిమరపు సమస్య అవకాశం ఎక్కువ. నడివయసులోకి అడుగుపెట్టిన ఆడవారికి వ్యతిరేకంగా ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, మగవారితో పోలిస్తే వారి జ్ఞాపకశక్తి కాస్త ఎక్కువేనని తేల్చారు. The North American Menopause Society అనే సంస్థ నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. నేరం ఈస్ట్రోజన్దే ప్రయోగంలో భాగంగా పరిశోధకులు 45 నుంచి 55 వయసు మధ్య ఉన్న 212 మంది వ్యక్తులను ఎన్నుకొన్నారు. వీరికి రకరకాల పరీక్షలని నిర్వహించి  వీరిలో తాత్కాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఏ తీరున ఉందో గ్రహించే ప్రయత్నం చేశారు. మెనోపాజ్ దశను దాటిన స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గుదల వారి జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఒక విషయాన్ని నేర్చుకోవడానికీ, నేర్చుకున్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికీ వీరు ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. అయినా కూడా! ఆశ్చర్యకరంగా ఆడవారు ఏ వయసులో ఉన్నా, తన ఈడు మగవారితో పోలిస్తే వారిలో మేధాశక్తి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ఆఖరికి మెనోపాజ్ దాటినా కూడా మగవారికంటే స్త్రీలలోనే ఎక్కువ జ్ఞాపకశక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే జ్ఞాపకశక్తి ఎవరిలో అధికం అని తెలుసుకోవడం మాత్రమే తమ లక్ష్యం కాదంటున్నారు పరిశోధకులు. మెనోపాజ్ తర్వాత స్త్రీల జ్ఞాపకశక్తిలో అనుకోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందనీ... తమలో Brain Fogని సూచించే లక్షణాలు కనిపించినప్పుడు వారు తప్పకుండా వైద్యులని సంప్రదించాలనీ చెబుతున్నారు. అలాగే మగవారు కూడా, తమ రోజువారీ జీవితాన్ని అడ్డుకునే స్థాయిలో జ్ఞాపకశక్తిలో మార్పులు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకి వెళ్లాలని సూచిస్తున్నారు. - నిర్జర.