మీరు మీ నేస్తాలకంటే కాస్త పొడవు ఎక్కువగా ఉన్నానని సంబరపడిపోతున్నారా. పడండి... పడండి... పనిలో పనిగా మీ పోషకాహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తపడండి. లేకపోతే మీ పొడవే మీకు శాపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.   ఇదీ పరిశోధన పొడవనేది మన జన్యువుల మీద ఆధారపడి వచ్చే లక్షణం. అయితే ఆడవారి పొడవుకీ, వారి ఆరోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో చూడాలనుకున్నారు వెంజీ అనే పరిశోధకురాలు. ఇందుకోసం ఆమె 1980లో ప్రభుత్వం వద్ద తమ ఆరోగ్య వివరాలు నమోదు చేయించుకున్న 68 వేలమంది స్త్రీల గణాంకాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి ఎత్తు, బరువు, నడుము కొలత, పొగతాగడంలాంటి వ్యసనాలు, ఆహారపు అలవాట్లు, శారీరిక శ్రమ... లాంటి అనేక విషయాలను పరిశీలించారు. అప్పట్లో వారి సగటు వయసు 44 ఏళ్లు. అంటే ఇప్పటికి వారందరూ కూడా ఇంచుమించుగా 70 ఏళ్లు దాటినవారే అన్నమాట!     ఇదీ సంబంధం 1980 నాటి వివరాలను మళ్లీ తాజా వివరాలతో పోల్చిచూశారు వెంజీ. 70 ఏళ్లు దాటాయి కాబట్టి వీరిలో మతిమరపు, డయాబెటిస్‌, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆ సమస్యలకీ పొడవుకీ సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వారిని ఐదు భాగాలుగా విభజించారు. ఆశ్చర్యం ఏమిటంటే వీరిలో పొడవు ఎక్కువ ఉన్నవారిలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. వీరి కుటుంబనేపథ్యం, జాతి మూలాలు, వివాహం... వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.   ఇదీ ఉపాయం పొడవుగా ఉండే ఆడవారికే ఎందుకీ ఆరోగ్య సమస్యలు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు పరిశోధకులు. బహుశా వారి పొడవుతో పాటుగా వచ్చే ఇతర జన్యువులే ఈ సమస్యలకు కారణం అని ఊహిస్తున్నారు. మరి పొడవుగా ఉంటే దానికి ఫలితం అనుభవించాల్సిందేనా! అంటే దానికి మాత్రం ఓ స్పష్టమైన జవాబు సిద్ధంగా ఉంది. తమ ఆహారపు అలవాట్ల విషయంలో అశ్రద్ధ చేయని స్త్రీల మీద పొడవు ప్రభావం అంతగా కనిపించలేదట. అంటే పోషకాహారమే ఈ శాపానికి మందన్నమాట! - నిర్జర.  

ఒత్తిడిని మీరు ఓడించండి... లేదంటే ఒత్తిడి మిమ్మల్ని ఓడిస్తుంది!   భారతీయ స్త్రీ... ప్రపంచంలోని అందరు స్త్రీల కన్నాఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనే జీవి! కాదంటారా? ఖచ్చితంగా అనలేరు. ఒకప్పుడు మన దేశంలో మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవారు. అప్పుడు వాళ్లకి కేవలం ఒక ఒత్తిడి మాత్రమే వుండేది. ఆర్దిక స్వాతంత్ర్యం లేకున్నా మానసిక ఒత్తిడి సగానికి సగం తక్కువగా వుండేది. కాని, ఇప్పుడు ఆధునిక భారతీయ మహిళ రెండు కోణాల్లో ఒత్తిడికి లోనవుతోంది. ఇంటా, బయటా ఏక కాలంలో ద్వంద్వ యుద్దం చేస్తోంది! మరి ఈ మాడన్ మానసిక ప్రెషర్ కి పరిష్కారం ఏంటి? కొన్ని సూచనలు, సలహాలు పాటిస్తే ఒత్తడి నుంచి బయటపడవచ్చు... మన దేశపు స్త్రీల సమస్యలలో అతి పెద్ద సమస్య అత్తగారే! సీరియల్స్ లో చూపినంత దారుణంగా, ఒళ్లు గగుర్పొడిచేలా అత్తా, కోడళ్ల సంబంధం వుండకపోవచ్చు కాని...వారిద్దరి మధ్యా సంఘర్షణ సహజం, అనివార్యం. ఒక్కోసారి ఇద్దరి తప్పూ వుండకపోవచ్చు కూడా. అయినా సరే ఎక్కువ ఒత్తిడి భరించే స్త్రీగా కోడలు కాస్త ధృఢంగా వుండాలి. తాను ఎలా వుండాలో అలా వుంటూనే అత్తగారి మనసు నొప్పించకుండా వుండాలి. ఆ క్రమంలో తాను మానసిక వేదనకి గురికాకుండా మాత్రం జాగ్రత్తపడాలి. తాను తానే కాని... అత్తగారు కోరుకున్న విధంగా మారిపోయే సినిమా తెరపై నటిని కాదని చెప్పగలగాలి. ఉద్యోగం చేయటం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. కాని, ఉద్యోగం వల్ల ఇంటి బాద్యతలతో పాటూ వృత్తి బాధ్యతలు కూడా స్త్రీల నెత్తిన పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్లు ఆఫీస్ బాస్ వద్ద చాలా ప్రాక్టికల్ గా వుండాలి. ఎంత పని చేసినా గుర్తింపు దక్కపోతే క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. అప్పటికీ ఫలితం లేకుంటే కొత్త ఉద్యోగం అన్వేషించటం బెటర్. ఇది మనం అనుకున్నంత కష్టమైంది, అసాధ్యమైంది కాదు. ప్రపంచంలో టాలెంట్, హార్డ్ వర్క్ కి ఎప్పుడూ డిమాండ్ వుంటూనే వుంటుంది! భర్తని నూటికి నూరు శాతం నమ్మటం బార్య తప్పక చేయాల్సిన పని. కాని, అందుకోసం మీ వ్యక్తిగత కోణాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల్ని నైపుణ్యాల్ని, విద్యల్ని ఎప్పటికప్పుడూ నేర్చుకుంటూ వుండండి. అప్పుడు మీ భర్త దృష్టిలో మీకు విలువ పెరుగుతూ వుంటుంది. ఆయనపై మీరు ఆధారపడ్డారన్న భావం ఆయనకు కలగదు. సమానత్వం భర్త ఇచ్చేది మాత్రమే కాదు... భార్య స్వయంగా కష్టపడి సాధించుకోవాల్సిందని గుర్తుంచుకోండి! మగవాళ్లకు కూడా ఒత్తిడి వుంటుంది. కాని, ఆడవాళ్లకు రెట్టింపు ఒత్తిడి వుంటుంది. ఇందుక్కారణం ఆఫీస్ లో అద్భుతంగా పని చేయాల్సి రావటంతో పాటూ ఇంట్లో చక్కగా వండి పెట్టగలగాలి. పిల్లలు, భర్త, అత్త,మామలు... అందర్నీ సంతోషరచగలగాలి. ఈ క్రమంలో మీకు ఇంటా, బయటా ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలని తాపత్రయపడకండి. ప్రతీ చోటా ప్రతీ సారీ టాపర్ గా వుండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంట్లో ప్రతీ రోజు నాలుగేసి వంటకాలు చేయకపోయినా ఫర్వాలేదు. అలాగే, ఆఫీస్ లో ప్రమోషన్ కోసం అర్థరాత్రి దాకా పని చేయాల్సిన అగత్యం లేదు. మీకు ఏది ముఖ్యమో తేల్చుకుని దాని కోసం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పని చేస్తూ ముందుకెళ్లండి... పైన చెప్పిన అన్నిటికంటే ముఖ్యమైంది మీ పక్కనున్న స్త్రీలతో పోటిపడకపోవటం. ఆరోగ్యకర పోటీ మంచిదే కావచ్చు కాని జీవితంలో ప్రతీ విషయంలో పోటీ పడుతూ పోతే ఆరోగ్యం పాడైపోతుంది. ఈ విషయం గుర్తుంచుకొని సాధ్యమైనంత వరకూ పోటీకి దూరంగా వుండండి. పోలికను దరి చేరనీయకండి. అప్పుడు మీరు మీలా వుండగలుగుతారు. ఈ ప్రపంచంలో ఒత్తిడి లేకుండా వుండటానికి మనం మనలా వుండటం తప్ప మరో మార్గం లేదు!  

Best Summer Foods   Have you ever wondered why most people suffer from stomach ailments and viral infections during the summer months? The reason is simple. We don’t cool our bodies enough. Even if you include half a bowl of pure curd with every meal, it will largely benefit you. If you tire of curd easily, include curd based drinks, lassi or even buttermilk along with every meal.The best way to get through summer without compromising on your health is by avoiding foods that heat your body and stomach. Primarily, meat products, eggs and most protein rich foods do so.It is best to avoid them and instead consume platefuls of lightly cooked vegetables. Sometimes, it isn’t about consuming the right foods during summer, as much as it’s about the right cooking and preparation technique. In this sense, use fewer spices, because too many of them can definitely make matters worse. Use smaller quantities of heat rich spices like ginger and red chilli. Consume small quantities of every vegetable you can avail of in your local market, the key to balanced health is after all balanced variety. Summer is the season to binge on fresh fruits and fresh juices. Fruits like watermelon, all kinds of citrus fruits, apples, grapes, bananas, melons are known to hydrate the body or boost it with more energy in one way or other. During the summer months, you tend to sweat more.  This can lead to dehydration if you don’t consume the right foods and cooling, hydrating drinks.  Cucumbers have long since known to be the best kind of cooling food. If you consume a few pieces daily, it will definitely keep away upset stomachs and summer illnesses and bugs. Try to chill the cucumber before eating it so that it tastes better. You can decorate it with various kinds of seasoning to add more flavour to it.  It isn’t exactly a delicious thought to consume a whole lemon, but by keeping a piece in your mouth for a few minutes when out in the sun, it can help you stay hydrated and fresh. No food would be right enough if you don’t have enough water. Summer is the time to focus on your thirst! You will always find yourself thirsty this season. So be sure to keep drinking cooling beverages, juices and water throughout.  

  ఆడవారి ముక్కు... మరింత షార్పు     మనిషికీ, మనిషికీ వాసన పసిగట్టడంలో కొంత తేడా ఉండవచ్చు. కానీ మగవారికంటే ఆడవారి ముక్కులు మహా చురుగ్గా పనిచేస్తాయంటే నమ్మగలమా? నమ్మితీరాలంటున్నారు శాస్త్రవేత్తలు. మగవారితో పోలిస్తే ఆడవారి ముక్కు చురుగ్గా పనిచేస్తుందేమో అన్నది మొదటి నుంచీ ఉన్న అనుమానమే! కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా, ఆ వాదనకు రుజువు కనుక్కోలేకపోయారు. బ్రెజిల్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంలో తాడోపేడో తేల్చేద్దామనుకున్నారు. అందుకోసం వాళ్లు Isotropic fractionators అనే పరీక్షని రూపొందించారు. ఈ పరీక్షతో మెదడులో ఏ భాగానికి సంబంధించి ఎన్ని కణాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్కకట్టవచ్చునట!   Isotropic fractionatorsని ఉపయోగించి కొందరిని పోస్ట్మార్టం చేశారు. వారి మెదడులో వాసనని పసిగట్టే olfactory bulb వంటి ప్రాంతాలలోని కణాలను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. దీంతో వాసనకి సంబంధించిన న్యూరాన్లు ఆడవారిలో 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బహుశా ఆడవాళ్లకి పుట్టుకతోనే వాసనకి సంబంధించి ఎక్కువ కణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.   మనకి తెలియకుండానే ముక్కు చాలా విషయాల్ని తెలియచేస్తుంటుంది. బయట వర్షం పడుతున్నా, ఎక్కడన్నా మంటలు చెలరేగుతున్నా... కొన్ని వాసనలు వస్తుంటాయి. పిల్లల్ని పెంచే క్రమంలో తల్లులకి ఈ సూచనలు చాలా ఉపయోగపడతాయి. అందుకనే ప్రకృతి వాళ్లకి వాసన చూస్తే శక్తిని అధికంగా అందించి ఉంటుంది. అదే నైపుణ్యం తర్వాత ఆహారం సేకరించడానికీ, వంటలు చేయడానికీ ఉపయోగపడుతోంది.   వాసన మన ఇంద్రియాలలో ఒక భాగం. మనం పొందే రకరకాల అనుభూతులకి ప్రేరణ. ఒక మంచి వాసన మన మనసు, శరీరాల మీద కూడా ప్రభావం చూపవచ్చు. అలా చూసుకుంటే ఆడవాళ్లు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. - నిర్జర.  

ఉగాదినాడు నువ్వుల నూనేతో స్నానం...   Ugadi begins with a ritualistic oil bath with sesame oil. Watch this video to know why one should not miss sesame oil bath on Ugadi day…

పీరియడ్స్ రాకపోవడానికి కారణాలెన్నో!     మహిళల ఆరోగ్యం పీరియడ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెలసరి సరైన సమయానికి రాకపోవడం వల్ల లెక్కనేనన్ని సమస్యలు వచ్చిపడుతుంటాయి. పీరియడ్స్ ఆలస్యంగా వచ్చినా, రావాల్సిన దానికన్నా ముందే వచ్చేసినా కూడా సమస్యే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రెండు మూడు నెలల వరకూ రాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ పరిస్థితి వస్తే కానీ కొందరు దీని గురించి ఆలోచించరు. అదేదే ముందే నెలసరి ఎందుకు క్రమం తప్పుతుందో తెలుసుకుంటే సమస్య ఆదిలోనే అంతమవుతుంది. కాబట్టి మీ సమస్యకి వీటిలో ఏది కారణమో వెంటనే తెలుసుకోండి. * ఒత్తిడి ఎక్కువైతే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల స్థాయిలో మార్పులు వస్తాయి. ఆ ప్రభావం రక్త ప్రసరణపై పడి నెలసరిలో తేడాలు వస్తాయి. * ఆహారపు అలవాట్లలో తేడా వచ్చినా కూడా సమస్య వస్తుంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల బరువు తగ్గి రుతుక్రమంపై ప్రభావం పడుతుంది. లేదా జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగి సమస్య వచ్చి ఉండొచ్చు. * హార్మోన్ల అసమతుల్యతను లెక్క చేయకపోవడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల క్రమక్రమంగా పీరియడ్స్ లో తేడా వస్తుంది. * చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... మితిమీరి వ్యాయామం చేయడం కూడా ఈ సమస్యను తెచ్చి పెడుతుంది. ఎక్సర్ సైజ్ మోతాదు మించడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందట. తద్వారా సమస్య ఏర్పడుతుందన్నమాట. * దీర్ఘకాలిక వ్యాధులకు యాంటి బయొటిక్స్ వాడటం వల్ల కూడా సమస్య వస్తుంది. * కొంతమంది ఏవో ముఖ్యమైన పనులున్నాయనో, పూజలూ వ్రతాలూ ఉన్నాయనో పీరియడ్స్ రాకుండా మందులు వేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఓసారయితే ఫర్వాలేదు కానీ తరచుగా ఇలా చేస్తుంటే మాత్రం సమస్యలు రావడం ఖాయం. సహజంగా వచ్చేదాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల అది క్రమం తప్పి మనల్ని ఇబ్బంది పెడుతుంది. చూశారు కదా! వీటిలో ఏ కారణమైతేనేమి... పీరియడ్స్ కి అడ్డు పడుతోందంటే దాన్ని మనం అడ్డుకునే తీరాలి. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. కారణం తెలుసుకోండి... దానికి తగిన చికిత్స తీసుకోండి. - Sameera

  లేడీ డాక్టరు దగ్గరకు వెళ్లడమే మంచిదా!     ప్రపంచంలో వంద మంది ప్రసిద్ధ వైద్యుల జాబితాను తయారుచేయమని అడిగితే.... అందులో బహుశా 90 శాతం మగవారే కనిపిస్తారు. కారణం స్పష్టమే! ఆడవారు ఎంత నైపుణ్యం చూపినా, దానిని సమాజం అంగీకరించేందుకు వెనుకడుగు వేస్తూనే ఉంటుంది. కానీ గణాంకాలను పరిశీలిస్తే, నిజాలు వేరేలా కనిపిస్తాయి. అందుకు ఉదాహరణగా ఓ పరిశోధన.. వైద్యాన్ని అందించడంలో మగ డాక్టర్లకీ, లేడీ డాక్టర్లకీ మధ్య వ్యత్యాసం ఉంటుందన్న విషయం ఎప్పుడోనే బయటపడింది. రోగులకు వైద్యం చేసేటప్పుడు లైడీ డాక్టర్లు నియమనిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారనీ, రోగులకు సమాచారాన్ని అందించడంలో లోటు రానివ్వరని పరిశోధకులు చెబుతూ ఉంటారు. ఇలాంటి పద్ధతుల వల్ల రోగులకు మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అవి ఏకంగా రోగుల ప్రాణాలనే కాపాడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు స్త్రీ, పురుష వైద్యుల దగ్గరకి వెళ్లే రోగుల పరిస్థితి ఏమిటా అని గమనించారు. ఇందుకోసం 2011 – 14 మధ్య చికిత్స పొందని ఓ పదిలక్షల మంది రోగుల తీరును గమనించారు. వీరిలో లేడీ డాక్టర్ల దగ్గరకు వెళ్లిన రోగుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. మగ డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్న రోగులతో పోలిస్తే వీరు తిరిగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఓ ఐదు శాతం తక్కువగా ఉన్నట్లు బయటపడింది. కేవలం ఆసుపత్రిలో చేరడమే కాదు.. లేడీ డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్న రోగుల ఆయుష్షు కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరులతో పోలిస్తే వీరిలో అర్థంతరంగా చనిపోవడం అనేది ఓ ఐదు శాతం తక్కువగా కనిపించింది. అలా చూసుకుంటే పరిశోధకుల వద్ద ఉన్న రోగులలో దాదాపు 32,000 మంది ఆయుష్షు దీర్ఘంగా సాగినట్లు తేలింది. అదీ విషయం! స్వభావసిద్ధంగా నియమనిబంధనలను అనుసరించే మనస్తత్వం వల్లనైతేనేం, రోగులతో ఉన్న సంబంధబాంధవ్యాల వల్లనైతేనేం... స్త్రీ వైద్యుల దగ్గర చికిత్స తీసుకునే రోగుల పరిస్థితి మెరుగ్గా అన్నట్లు ఈ పరిశోధనతో బయటపడింది. కానీ విచిత్రం ఏమిటంటే... మగ డాక్టర్లతో పోలిస్తే, లేడీ డాక్టర్లకు దాదాపు ఎనిమిది శాతం తక్కువ వేతనాలు లభిస్తాయట. అంతేకాదు! ఆసుపత్రులలో పనిచేసే లేడీ డాక్టర్లకు పదోన్నతుల విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంటుందన్న ఆరోపణలూ ఉన్నాయి. - నిర్జర.  

గోళ్ల రంగుకి అమ్మాయిల బరువుకి లింకేంటి..?   గోళ్ల రంగు వేసుకుంటే బరువు పెరుగుతారా..? అసలు గోళ్ల రంగుకి.. శరీర బరువుకి సంబంధం ఏంటీ..? పరిశోధనలో ఏం తేలింది..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=SoTbYnQ6BTQ

  Are you eating more protein than needed?     Protein is awesome. It’s essential for maintaining a lean, healthy body composition. Our bodies simply wouldn't be able to build and repair its cells without protein. Protein is made up of amino acids that are the building blocks of body tissues, including muscles, blood vessels, hair, skin, and nails. It's also involved in the production of enzymes and hormones that help the body to function normally. But anything in excess than what our body requires is doing no good to our health. Are you eating too much protein? Here are some signs that you could be taking in more than what is required. One of the major signs is that your cholesterol levels slowly but steadily are rising. According to a research, it could very well have to do with the amount of protein you’re eating. Also the fact that you see that you start gaining weight. If you're eating excess animal protein or downing protein shakes this is bound to happen. Meat often means extra fat and also calories. And many protein shakes have added sugar to make them taste better. Over time, too many excess calories, no matter from fat, sugar, or protein, will cause weight gain. To shift your meals in a healthier direction, aim for balanced meals that include lean protein, whole grains, fruit and vegetables. Low energyis another major problem we see with ultra-high protein diets. Your brain needs carbs in all their sugary, starchy glory to stimulate the production of the mood-regulating hormone serotonin. Strip them from your diet, and you're more likely to feel grouchy, irritable. Bad breath is something that’s often accompanied by high-protein, low-carb diets. Low carb intake causes bad breath due to ketosis. According research when we don’t eat enough carbs, the body gets energy from fats and protein and this process causes bad breath. Another issue is indigestion and kidney problem. The fact that protein is hard to digest makes it great for weight loss. But this advantage is also a curse. Our stomachs can’t process excess protein, especially from animal sources. As a result, eating too much protein can cause constipation, nausea and indigestion. One of the waste products created by the kidneys during the filtering process is blood urea nitrogen. Researchers and physicians use blood urea nitrogen levels to evaluate kidney function, and it's also a measure of how hydrated a person is.  It's important to pay attention to this sign specifically, as kidney stones can also be caused by a high-protein diet. Depending on other factors, when you put your kidneys into overdrive, the risk of kidney stones increases for those who are already prone because of particular issues with absorbing specific forms of calcium, mostly from leafy greens, surprisingly enough. - Divya

    ఫ్యాషన్‌తో వెన్నునొప్పి వస్తుందా!     చిరోప్రాక్టిక్ మెడిసిన్ అని ఒక తరహా వైద్యం ఉంది. వెన్నుపూస మీద కలిగే ఒత్తిడి కారణంగానే శరీరంలో అనేక సమస్యలు ఏర్పడతాయన్నది వీరి వాదన. ఆధునిక వైద్యం వీరి చికిత్సా విధానాన్ని అంతగా అంగీకరించనప్పటికీ... చిరోప్రాక్టిక్ చికిత్సకి పాశ్చాత్య దేశాలలో మంచి ఆదరణ ఉంది. ఆ చికిత్సని అందించే అధికారిక సంస్థలూ ఉన్నాయి. వాటిలో ఒకటి  British Chiropractic Association (BCA). ఈ సంస్థ కొన్ని వందల మందిని పరిశీలించిన మీదట ఈమధ్యనే ఒక నివేదికను వెల్లడి చేసింది. ఆధునిక మహిళల వస్త్రధారణ వల్ల నానారకాల సమస్యలు ఏర్పడతాయన్నది ఇందులోని సారాంశం. మరి వారి వాదనలేంటో వినండి...   బిగుతైన జీన్స్‌:- బాగా బిగుతుగా ఉండే జీన్స్ వంటి దుస్తులను ధరించడం వల్ల కాళ్లలోని సహజమైన కదలికలు తగ్గిపోతాయట. దానివల్ల నడిచేటప్పుడు పూర్తి బరువంతా మన కీళ్ల మీదే పడుతుందని హెచ్చరిస్తున్నారు. బరువైన హ్యాండ్‌బ్యాగ్స్:- ఇప్పటి మహిళలు మోస్తున్న హ్యాండ్‌ బ్యాగ్స్ చాలా బరువుగా ఉంటున్నాయని వాపోతోంది BCA సంస్థ. పైగా వీటిని భుజానికి కాకుండా, మోచేతులకి తగిలించుకోవడం వల్ల... ఒకవైపు భుజాన్ని కిందకి లాగివేసే పరిస్థితి ఏర్పడుతోందట. దీనివల్ల వెన్నునొప్పి ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. బరువైన కోట్లు:- మన దగ్గరైతే తక్కువ కానీ... పాశ్చాత్య దేశాలలో ఇంతింత బరువుండే ఉన్ని దుస్తులను వేసుకుంటారు. తల మీద బరువుంచే ఇలాంటి దుస్తుల వల్ల మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయట. హైహిల్స్:- హైహీల్‌ చెప్పుల గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పుకోనవసరం లేదేమో! కానీ ఇలాంటి చెప్పుల వల్ల వెన్నుపూస మీద లేనిపోని ఒత్తిడి ఏర్పడుతుందని మరోసారి హెచ్చరిస్తోంది BCA. పట్టీలేని చెప్పులు – చెప్పులైనా, షూస్‌ అయినా పాదం వెనక భాగం నుంచి పట్టు అందించేలా ఉండాలి. కానీ ఇప్పుడు ధరించే పాదరక్షలు ఫ్యాషన్‌ కోసం కేవలం కాలి వేళ్ల మీదే ఆధారపడి ఉంటున్నాయి. దీని వల్ల పాదాలు, నడుములలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయంటున్నారు. బరువైన ఆభరణాలు:- సందర్భాన్ని బట్టి మెడలో బరువైన ఆభరణాలను వేసుకోవడం ఇప్పుడ తరచూ కనిపించేదే! దీని వల్ల మెడలో ఉండే ఎముకల మీద లేనిపోని ఒత్తిడి కలగడమే కాకుండా, శరీర భంగిమలో కూడా తేడా వస్తుందట.   ఒక్కముక్కలో చెప్పాలంటే మన సహజమైన కదలికలను ప్రభావితం చేసే ఎలాంటి దుస్తులైనా, అలంకరణలైనా... ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. BCA నివేదిక ప్రకారం 73 శాతం మంది ఏదో ఒక తరహా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే వారలో మూడోవంతు మందికి తమ నొప్పికి కారణం అసహజమైన వస్త్రధారణ అని తెలియనే తెలియదు! అయితే ఈ వాదనను ఇంగ్లీషు వైద్యులు కొట్టిపారేస్తున్నారు. మన వెన్ను మరీ అంత సున్నితమైనదేమీ కాదనీ.. చిన్నా చితకా బరువులని నిర్భయంగా మోయగలదని చెబుతున్నారు. కొద్దిపాటి ఒత్తిడిని ఆనాయాసంగా తట్టుకోగలదని హామీ ఇస్తున్నారు. అంటే ఎవరి మాట వినాలో ఇక మనమే నిర్ణయించుకోవాలన్నమాట!                           - నిర్జర.

    అస్తమా - నివారణ     గతంతో పోలిస్తే వైద్య రంగం చాలా పురోగతి సాధించింది. నిన్న మొన్నటి వరకు చికిత్సే లేదనుకున్న ఎన్నో వ్యాధులకు చికిత్స అందించగలుగుతున్నారు. కానీ అస్తమాకు మాత్రం ఇప్పటివరకు పర్మనెంట్ సొల్యుషన్ రాలేదు. అస్తమా ఏ వయసులో వారికైనా రావచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరికైనా అస్తమా బాధించవచ్చు.అస్తమా శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి.           అస్తమా సాధారణంగా ఎలర్జీవల్ల కలుగుతుంది. మనం పీల్చిన గాలి, లోపలికి వెళ్ళేప్పుడు ఎలర్జీవల్లగాని, ఒత్తిడివల్ల గాని బ్రాంకియోల్స్‌ లోపల పొర వాస్తుంది. మ్యూకస్‌ మెంబ్రేన్‌ ముడుచుకుపోతుంది. గాలి ప్రసరించే దారులు ముడుచుకుపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. గురకవస్తుంటుంది. దగ్గు రావచ్చు. ఉన్నట్టుండి ఆయాసం మొదలై శ్వాస పీల్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు అస్తమా రోగులు వణికిపోతుంటారు. కాస్త చల్లటి గాలులు వీచినా, చల్లటి ఆహారపదార్థాలు తిన్నా, తాగినా శ్వాసలో ఇబ్బంది మొదలవుతుంది. అందుకే అస్తమా బాధితులు ఇబ్బంది ఎక్కువ కాకముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మన చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి, వీలైతే ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. కొవ్వు పదార్థాలను తినడం తగ్గించాలి. నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్స్, చేపలు, తదితరాలను స్వీకరించకపోవడం మంచిది. చల్లదనాన్నిచ్చే పుచ్చకాయ, బీరకాయ, ఖర్బూజా వంటివి తినకూడదు. ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులు పెరుగు అసిడిక్ ఆమ్లం అధికంగా ఉన్న నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పళ్ళ రసాలను తీసుకోరాదు. ఇబ్బంది తగ్గే వరకు కారం, పులుపు తగ్గించడం మంచిది. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి, వీలయితే ఆహారం కడుపు నిండా కాకుండా, కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. పడుకోవడానికి కనీసం మూడు గంటలు ముందుగానే రాత్రి భోజనం తినేయడం మంచిది. మునగాకులో కఫం తొలగించే గుణాలు పుష్కలం, కాబట్టి మునగాకు బాగా తినాలి.  అస్తమాకు చికిత్స లేదు , నివారణ ఒక్కటే మార్గం అస్తమాకు చికిత్స లేదు, అలాగని అస్తమాను నిర్లక్ష్యం చేస్తే క్రానిక్ ఎయిర్ వేస్ డిసీజ్ గా మారి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పౌష్టికాహారం తింటూ, మన చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అస్తమా తీర్వ్రతరాన్ కాకముందే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటించడం ద్వారా అస్తమాను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.    ఇంట్లోనే అస్తమాకు ఉపశమనం తేనే   తేనే అస్తమాకు మంచి ఉపశమనకారిగా పని చేస్తుంది. రెండు చుక్కల తేనే అస్తమా వ్యాధి గ్రస్తుల ముక్కులో పోసినట్లయితే , అస్తమా వ్యాధి గ్రస్తులు శ్వాస ఇబ్బందుల నుండి కాస్త కోలుకునే అవకాశముంది. అత్తిపండు తో ఉపశమనం     అత్తిపండు అస్తమా రోగులకు మంచి ఔషధకారి. అత్తిపండును వేడి నీళ్ళలో బాగా కడిగి రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం రోగులకు ఇస్తే అస్తమాతో పాటు దగ్గు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.   నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి భోజనంతో పాటు తీసుకోవాలి. ఉసిరికాయ     5 గ్రాముల ఉసిరికాయను ఒక టేబుల్ స్పూన్ తేనే తో కలిపి ప్రతి ఉదయం పరగడుపున సేవిస్తే మంచి టానిక్ లా పని చేస్తుంది.    కాకర వేళ్ళతో అస్తమా ఉపశమనం కాకర వేళ్ళు అస్తమా వ్యాధిగ్రస్తులకు వరం. ఈ మందుకు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది, ఒక టేబుల్ స్పూన్ నిండా కాకర వేళ్ళ ను పొడిచేసి తేనే లో లేదా తులసి రసంలో కలిపి రోజుకు ఒక పూట చొప్పున సేవిస్తే అస్తమా అస్తమా తగ్గుముఖం పడుతుంది.   ములక్కాడ ఆకులతో ఉపశమనం   180ml నీళ్ళలో గుప్పిట నిండా ములకాడ ఆకులను ఉడకబెట్టి కాస్త ఉప్పు, మిరియాల పౌడర్, కాస్తంత నిమ్మరసం కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. అల్లం ఒక టీ స్పూన్ నిండా అల్లం రసం తీసుకుని ఒక కప్పు మెంతి డికాషన్ లో కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి   అస్తమా ప్రారంభదశలో ఉన్న రోగులు రోజూ పది వెల్లుల్లి పాయల్ని తీసుకుని 30 ml పాలలో మరగబెట్టి రోజుకొకసారి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. వాము అర టీ స్పూన్ నిండా వాము గింజల్ని తీసుకుని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి రోజు రెండు పూటలా సేవిస్తే అస్తమాతో పాటు దగ్గుతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. దీనితోపాటు వాము గింజల్ని వేడినీళ్ళలో వేసి అస్తమాతో బాధపడేవారికి ఆవిరి పడితే రిలీఫ్ గా ఉంటుంది. కుంకుమ పువ్వు     5 గ్రాముల కుంకుమ పువ్వును ఒక టేబుల్ స్పూన్ నిండా తేనేలో కలిపి రోజుకు ఒకసారి సేవించినట్లయితే మంచి ఔషధకారిగా పని చేస్తుంది.    ఉపవాసం , ఎక్సర్ సైజు   వారానికొకసారైనా ఉపవాసం చేయడం, ఎక్సర్ సైజు చేయడం మంచిది. యోగాఎక్స్ పర్ట్ ను సంప్రదించి శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేస్తే ఉపశమనం కలుగుతుంది. 

స్పాండిలోసిస్ ఇక దూరం..!     పొద్దున్న లేచిన దగ్గరి నుంచి..పొద్దు పోయేవరకు ఇంటిల్లిపాది అలనా, పాలనా చూడటం దగ్గరి నుంచి ఆఫీసు పనుల దాకా మహిళలు ఒంటి చేత్తో చక్కదిద్దాల్సి ఉంటుంది. వయసులో ఉన్నపుడు అంతా ఓకే అనిపించినా..వయసు పెరుగుతున్న కొద్ది మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంటారు. ప్రస్తుతం ఇంటా, బయటా నిరంతర పని ఒత్తిడికి గురవుతుండటంతో ఇవన్నీ చేరి మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాటిలో ఒకటి స్పాండిలోసిస్..సర్వసాధారణంగా మెడనొప్పిలాగా అనిపించినప్పటికి అన్ని రకాల మెడనొప్పులు స్పాండిలోసిస్ కాదు..దీని లక్షణాలు వేరు. స్మోకింగ్, డ్రింకింగ్, కంప్యూటర్లపై ఎక్కువ సేపు పనిచేసే వారికి, డ్రైవింగ్ ఎక్కువగా చేసేవాళ్లకు స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రోజులు వచ్చి ఆ తర్వాత పోయే మెడనొప్పిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.   అయితే నెలల తరబడి మెడనొప్పి అలాగే ఉండి భుజం వరకు నొప్పి వస్తుంటే మాత్రం అది స్పాండిలోసిస్‌గా అనుమానించాల్సిందే. మెడ ఎముకలలో అరుగుదల వల్ల, మెడను కదిలించే ప్రదేశంలో ఉండే స్పాంజిలాంటి కండరం పల్చబడి కుషన్‌లా పనిచేసే లక్షణాన్ని కోల్పోవడం వల్ల ఈ మెడనొప్పి వస్తుంది. దీని వల్ల మెడలో, చేతులలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. నీరసం కూడా ఎక్కువగా ఉంటుంది. స్పర్శలో మార్పులు వస్తాయి. నొప్పి ప్రాథమిక దశలో ఉంటే చిన్న చిన్న జాగ్రత్తలతో సమస్యను దూరం చేసుకోవచ్చు.   * మెడనొప్పి మరీ తీవ్రంగా ఉంటే డ్రైవింగ్ ఆపేయ్యాలి. * టీవీ చూసే సమయంలో కూడా కాస్త ఆగి చూడాలి. * కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారు తల తిప్పకుండా పనిచేయడం మాని కాస్త   మెడను    అటు ఇటు తిప్పుతూ ఉండాలి. * మెడ మీద అధిక బరువు పడకుండా కూర్చొనే పద్ధతి మార్చాలి. * కండరాలకు శక్తినిచ్చే వ్యాయామాలు చాలా అవసరం. ముఖ్యంగా భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా స్పాండిలోసిస్ రాకుండా కాపాడుకోవచ్చు. * ప్రతి రోజు గుడ్లు, పాలు తీసుకోవడం వల్ల ఎముకలకు కావాల్సినంత బలం అందుతుంది.

సిజేరియన్‌తో మనం మారిపోతున్నాం   ఒకప్పుడు బిడ్డకు  జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మలా ఉండేది. ఇప్పటికీ ఈ మాటలో వాస్తవం ఉన్నా, సిజేరియన్‌ ప్రక్రియ వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తగ్గిపోతున్నాయి. అయితే ఇలా సిజేరియన్‌ ద్వారా బిడ్డను బయటకు తీయడం వల్ల మానవజాతి పరిణామం మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.   అవే జన్యువులు స్త్రీలలో కటిప్రాంతం సన్నగా ఉండి యోనిమార్గం బిగుతుగా ఉంటే... బిడ్డ బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. దాని వల్ల తల్లీబిడ్డా చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండేది. సిజేరియన్ల కారణంగా ఈ ముప్పు తగ్గిన మాట వాస్తవమే అయినా... కటి ప్రాంతం సన్నగా ఉండే స్త్రీలు బతికిపోవడం వల్ల, వారి నుంచి అవే తరహా జన్యవులు వారి పిల్లలకు చేరుతున్నాయట. అందుకనే కటిప్రాంతం తక్కువగా ఉండే స్త్రీల సంఖ్యలో ఏమన్నా మార్పు వచ్చిందేమో తెలుసుకునేందుకు ఆస్ట్రియాకు చెందిన కొందరు పరిశోధకులు పూనుకొన్నారు. ఇందులో తేలిందేమిటంటే... 1960ల ప్రాంతాలలో 1000 మంది స్త్రీలలో 30 మందికి మాత్రమే సన్నటి యోనిమార్గం ఉండేదట. కానీ ప్రస్తుతం 1000 మంది స్త్రీలలో 36 మందిలో ఈ ఇబ్బంది కనిపిస్తోంది.   తీసిపారేయలేం 30కీ 36కీ ఏమంత తేడా లేకపోవచ్చు. కానీ వేల ఏళ్ల పరిణామక్రమంలో కేవలం ఒక యాభై ఏళ్లలోనే 20 శాతం మార్పు కనిపించడాన్ని తీసిపారేయలేం. పైగా బిడ్డ వైపు నుంచి చూస్తే దీనికి రెండో కోణం కూడా ఉంది. తల్లి కడుపులో ఉన్న పిల్లవాడి తల బాగా పెద్దదిగా ఉన్నా కూడా అది బయటకు రావడం కష్టం. అలాంటి బిడ్డ బతికి బట్టకట్టడం ఒకప్పుడు ఆసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు సిజేరియన్‌ వల్ల ‘తల పెద్దగా ఉన్న’ పిల్లలు కూడా క్షేమంగా బయటకు వస్తున్నారు. దాంతో వారి జన్యువులు కూడా తరువాత తరాలకు అందుతున్నాయి. అంటే సిజేరియన్‌ వల్ల ఇటు కటిప్రాంతం సన్నగా ఉండేవారి సంఖ్యా, అటు తల పెద్దగా ఉండేవారి సంఖ్య కూడా నానాటికీ పెరిగే అవకాశం ఉందన్నమాట. అలా బహుశా సిజేరియన్ చేయక తప్పనిసరి పరిస్థితులు కూడా పెరిగిపోతాయి. ప్రకృతి శాపం కటి సన్నగా ఉండే ఆడవారు, పెద్ద తలతో పుట్టే పిల్లలు సిజేరియన్‌తో బతికిపోవడంతో అవే జన్యువులు వ్యాపిస్తున్నాయన్న మాట వినడానికి చాలా క్రూరంగా ఉంది. ఆ కాస్త లోపం వల్ల వారు మరణించాలని కోరుకోము కదా! అందుకనే ‘మా ఉద్దేశం వైద్యుల ప్రమేయాన్ని విమర్శించడం కాదు. దీని వలన మానవ పరిణామంలో మార్పులు వస్తున్నాయి అని ఒక మాట చెప్పడమే’ అంటున్నారు పరిశోధకులు. వైద్యులు ఎడాపెడా సిజేరియన్‌ చేసిపారేస్తున్నారు అన్న అపవాదు ఉన్నప్పటికీ, ప్రకృతి పరంగా కూడా మనిషికి కొంత లోటు ఉంది. ఎందుకంటే మనకు దగ్గరగా ఉండే కోతుల వంటి జీవులతో పోలిస్తే మనుషులలో ప్రసవం కాస్త కష్టంగానే ఉంటుందట. దానికి తోడు షుగర్‌, ఊబకాయం వంటి కారణాలతో కూడా సిజేరియన్లు చేయవలసి వస్తోందంటున్నారు. అయితే అవసరం ఉండే సిజేరియన్ వైపు మొగ్గు చూపుతున్నారా! దాని వల్ల ఇతరత్రా దుష్ఫలితాలు ఏమిటన్నది వేరే చర్చ!   - నిర్జర.

బొప్పాయితో ఆరోగ్య సమస్యలు దూరం     బొప్పాయిని కారుచౌక, పోషక సమృద్ధి ఫలం అంటారు. ఎందుకంటే యాపిల్, జామ, సీతాఫలం, అరటి తదితర పండ్లు కంటే బొప్పాయిలో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ A కూడా అదే మోతాదులో లభిస్తుంది. ఇక పచ్చి బొప్పాయి నుంచి విటమిన్ C, మరికొన్ని ఖనిజ లవణాలు లభిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ బొప్పాయి మంచి ఔషధంగా పనిచేస్తుందట. పిల్లలలో కడుపు నొప్పి, నులిపురుగుల సమస్య కనిపిస్తే తరుచు బొప్పాయిని ఇస్తుంటే నులి పురుగులు పోతాయట. అదే విధంగా ఆకలి కూడా పెరుగుతుంది అంటున్నారు నిపుణలు. అలాగే రోజు బొప్పాయి పండు ముక్కలను తేనెతో కలిపి తింటే గుండె, కాలేయం, మెదడు, నరాలకు రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుందట. ఇక మధుమేహం ఉన్నవారు రోజు రెండు బొప్పాయి పండు ముక్కల్ని తింటే చాలు విటమిన్స్ లోపం రాదట. ఇలా ఎన్నో విధాలుగా మనకి మేలు చేసే బొప్పాయిని పచ్చిగాను, పండుగాను కూడా మన ఆహారంలో తరుచు చేర్చుకోవటం అవసరం అని సూచిస్తున్నారు నిపుణులు.

బియ్యం, గోధుమలతో ఆరోగ్య జీవితం     ఆరోగ్యానికి, ఆహారానికి ఉన్న సంబంధం అందరికి తెలిసిందే కాబట్టి ఆ నమ్మకాలు సరైనవిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉదాహరణకి కొవ్వు పదార్ధాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు అని మనందరి నమ్మకం. అయితే కేవలం అవే కాదు పాలిష్ పట్టిన బియ్యం, శుద్ది చేసిన గోధుమలతో తయారైన బ్రెడ్డు కూడా వాటికేమి తీసిపోవటం లేదని తాజా అధ్యయనాలు చేబుతున్నాయి. కొవ్వు పదార్ధాలు మన శరీరంలో చెడు కొలస్ట్రాల్ మోతాదు పెరిగేలా చేస్తాయి. అలాగే మంచి కొలస్ట్రాల్ నిల్వలని తగ్గిస్తాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.   కొవ్వు పదార్ధాలకి బదులుగా బాగా శుద్ధి చేసిన గోధుములతో చేసిన బ్రెడ్డు ఆరోగ్యానికి మంచిదని తింటుంటారు చాలా మంది. అయితే వీటిని రోజు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. ఎందుకంటే బాగా పాలిష్ పట్టినపుడు బియ్యం పైన ఉండే తవుడు, పోషకాల వంటివి పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఆ తవుడులోని పీచు, మెగ్నీషియం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటానికి బాగా తోడ్పడుతాయి. అదే తెల్లటి పాలిష్ పట్టిన బియ్యం రక్తంలో గ్లూకోస్ స్థాయిని త్వరగా పెంచేస్తుంది. కాబట్టి కొవ్వు పదార్ధాలు తినటం లేదు కనుక ప్రమాదమేమి లేదు అనుకోవటానికి లేదు. పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు కూడా హాని చేయటంలో వాటికేమి తీసిపోవు అంటున్నారు పరిశోధకులు.   రోజు మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేస్తే చాలు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణలు. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం వంటి వాటికి బదులుగా దంపుడు బియ్యం తింటే టైప్2 మధుమేహం వచ్చే అవకాశం 16 శాతం తగ్గుతుందని తేలింది. ఇక రకరకాల ముడి ధాన్యాలను కలిపి తీసుకుంటే మధుమేహం వచ్చే ముప్పు 36 శాతం తక్కువగా ఉంటున్నట్టు వారి అధ్యయనంలో తేలింది. కాబట్టి దంపుడు బియ్యం, ముడి ధాన్యాలను తప్పనిసరిగా మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవటం అత్యవసరం అని సూచిస్తున్నారు.   ఆహారం విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి తరుచు తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే తెలుసుకున్న వాటిని ఎంత వరకు పాటిస్తున్నామన్నదే ముఖ్యం. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టకతప్పదు. కాబట్టి ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. దంపుడు బియ్యం, నూనెగింజలు, చిరుపోషక గింజలు వంటి వాటిని, ఆకుకూరలు, పండ్లు, పాలుని నిత్యం మన ఆహారంలో భాగంగా చేర్చుకోవటం ఎంతో అవసరం. అందరు తప్పక పాటించాల్సిన నియమం. మరి మీరు కూడా పాటిస్తారు కదా!

చలికాలంలో ప్రాణా ఔషదాన్ని పెంచే సీతాఫలాలు   సీతాఫలాన్నిఅమృతఫలం అనే కాకుండా కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. ఇది చలికాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పుకోవచ్చు.రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణగణాలు సీతాఫలంలో దాగి ఉన్నాయి. సీతాఫలం ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుంది. * ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. * సీతాఫలం పండు తింటే అజీర్తి మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. నరాలు, కండరాలు బలహీనత గలవారికి ఈ పండు మంచి ఫోషకాహారం. చర్మవ్యాధులు తగ్గిపోతాయి. * సీతాఫలంతో కొన్ని చిట్కాలు సీతాఫలంలోని గుజ్జును పాలతో కలిపి తాగితే శీరీరంలోని వేడి, అతి దాహం తగ్గుతాయి. జ్వరంగా ఉండి నాలు పిడచకట్టి ఒకటే దాహంగా ఉన్నప్పుడు సీతాఫలం గుజ్జును, పాలు కలిపిన మిశ్రమాన్ని ఇస్తే దాహ బాద తగ్గిపోతుంది. * సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. మెదడుకు, నరాల వ్యవస్థకూ సీతాఫలం చాలా ఉపకరం అంటున్నారు. * హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Diabetics Affect Eyes     Although individuals with diabetes are more likely to develop cataracts at a younger age and are twice as likely to develop glaucoma as are non-diabetics, the primary vision problem caused by diabetes is diabetic retinopathy, the leading cause of new cases of blindness and low vision in adults aged 20-65:   * "Retinopathy" is a general term that describes damage to the retina. * The retina is a thin, light-sensitive tissue that lines the inside surface of the eye. Nerve cells in the retina convert incoming light into electrical impulses. * These electrical impulses are carried by the optic nerve to the brain, which interprets them as visual images. * Diabetic retinopathy occurs when there is damage to the small blood vessels that nourish tissue and nerve cells in the retina. * "Proliferative" is a general term that means to grow or increase at a rapid rate by producing new tissue or cells. When the term * "proliferative" is used in relation to diabetic retinopathy, it describes the growth, or proliferation, of abnormal new blood vessels in the retina. "Non-proliferative" indicates that this process is not yet occurring. * Proliferative diabetic retinopathy affects approximately 1 in 20 individuals with the disease.

Vitamin D protects Women`s Mental Health   Vitamin D,Health for Women Vitamin D, Healthy Women Advised Vitamin D: Among this population, women who developed Alzheimer’s disease had lower baseline vitamin D intakes (50.3 micrograms per week) than those who developed other dementias (63.6 micrograms per week) or no dementia at all (59.0 micrograms per week).     * The group led by Yelena Slinin, at the VA Medical Centre in Minneapolis, found that low vitamin D levels among older women are tied with higher odds of global cognitive impairment and cognitive decline. * The group based its analysis on 6,257 community-dwelling older women, who had vitamin D levels measured during the Study of Osteopathic Fractures and whose cognitive function was tested by the Mini-Mental State Examination, the Journals of Gerontology Series A: Biological Sciences and Medical Sciences reported. * The team led by Cedric Annweiler, at the Angers University Hospital in France, based its findings on data from 498 community- dwelling women. * while praising Ricky Ponting’s intentional retirement, a India opener, when quizzed about Sachin Tendulkar, was discreet adequate to supplement that retirement is an particular decision. Asked about Punter, Gambhir said, “He played all his life on his possess terms.