గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు!

ఆడపిల్ల జీవితంలో వివాహం, గర్బం దాల్చడం కీలకమైన మలుపులు. వీటి తరువాత నుండి మహిళల జీవితం చాలా మార్పులకు లోనవుతుంది. పండంటి పాపాయి పుట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలని  వైద్యుల నుండి పెద్దల వరకు చెబుతారు. అయితే ఇప్పటి కాలం అమ్మాయిలు చాలామంది ఉద్యోగాల కారణంగా పెద్దలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరికి అసలు తాము తీసుకునే ఆహారాల మీద స్పష్టతే ఉండదు.  ఈ కింది ఆహారాలు గర్బవతులు అస్సలు తీసుకోకూడదని, అలా తింటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు.  ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..


మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గర్భవతులు మొలకెత్తిన గింజలకు దూరం ఉండాలి. మొలకెత్తిన గింజలలో బ్యాక్టీరియా  ఎక్కువగా డవలప్ అవుతుంది.  వీటిని తింటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

పాలు కూడా ఆరోగ్యానికి మంచివే అయినా పాశ్చరైజేషన్ చేయని పాలు మాత్రం గర్భవతులకు ప్రమాదం. వీటిలో  లిస్టేరియా, ఇకోలి, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తాయి.

ఉడికించిన కోడిగుడ్లు అందరికీ మంచివే.  అయితే కొందరు పచ్చిగుడ్లు కూడా తింటారు. మరికొందరు హాఫ్ బాయిల్ అంటూ సగం ఉడికీ ఉడకని గుడ్లు తింటారు. అయితే గర్భవతులు ఆరోగ్యం బాగుండాలంటే పచ్చిగుడ్లు తినడం అవాయిడ్ చేయాలి. దీవివల్ల వాంతులు, వికారం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి.

గర్భవతులు మద్యపానం, ధూమపానంకు దూరం ఉండాలి. ఇవి కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి.

సముద్రంలో లభించే క్యాట్ ఫిష్, షార్క్ వంటి చేపలలో పాదరసం ఎక్కువ శాతం ఉంటుంది. ఈ చేపలను తినడం వల్ల కడుపులో బిడ్డ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.

బొప్పాయికి, గర్భిణులకు మద్య ఉండే విషయాలు అందరికీ తెలిసిందే. అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భిణులకు గర్భస్రావం  అయ్యే కారణం ఉంటుంది.

కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో కెఫిన్ ఆరోగ్యం చేకూరుస్తుంది. కానీ కాపీ ఎక్కువ తాగితే కెఫిన్ కంటెంట్ కడుపులో బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తుంది.  కెఫిన్ తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి.

                                              *నిశ్శబ్ద.