మహిళలు బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలి!!
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు, వైద్యులు కూడా. మహిళలు చాలావరకు మానసికంగా బలంగానే ఉంటారు. కానీ శారీరకంగా బలంగా ఉండే మహిళలు చాలా తక్కువ. ముఖ్యంగా నేటి కాలంలో మహిళలు అయితే చాలా సున్నితం ఉంటారు. పెళ్లై, ఓ ఇద్దరు పిల్లల్ని కంటే ఇక చాలా బలహీనం అయిపోతారు. కానీ ఈ బలహీనత రాకూడదన్నా,. ఆల్రెడీ వచ్చిన బలహీనతను అధిగమించాలన్నా ఈ కింది ఆహారాలు తప్పక తినాలి.
కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు మహిళలకు చాలా అవసరం. మహిళలకు కాలం గడిచేకొద్ది ఎముకలు చాలా తొందరగా బలహీనం అవుతాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు అధిగమించవచ్చు. ఎముక బలం ఉంటే మహిళలు చాలావరకు బలంగా ఉంటారు. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, ఫూల్ మఖనా మొదలైన కాల్షియం ఆహారాలు రోజూ తినాలి.
మహిళలలో రక్తహీనత సమస్య కూడా ప్రముఖమైనది. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నెలసరి అస్తవ్యస్తం అవుతుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఈ సమస్యలు అధిగమించవచ్చు. నువ్వులు, బెల్లం, పల్లీలు, చేపలు, బీన్స్ వంటి ఆహారాలలో ఐరన్ బాగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం, నరాల ఆరోగ్యం, జీవక్రియ, రక్తప్రసరణ మొదలైనవాటికి ఫోలేట్ చాలా అవసరం. ఇది లోపిస్తే గర్భదారణ సమయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. పోలిక్ యాసిడ్ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్లు, కమలాపండ్లు, కరివేపాకు, బ్రోకలి, బెండకాయ, గుడ్లు, ఆవు పాలు మొదలైనవాటిలో ఫోలెట్ సమృద్దిగా ఉంటుంది.
మహిళలలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి బాగా తీసుకోవాలి. ఇది చర్మ ఆరోగ్యాన్నికూడా కాపాడుతుంది. నిమ్మజాతి పండ్లు, సిట్రస్ ఆధారిత కూరగాయలు, స్ట్రాబెర్రీలు మొదలైనవాటిలో విటమిన్-సి లభిస్తుంది.
సరైన బరువు ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. బరువు బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి. గుండె జబ్బులను, మధుమేహాన్ని కూడా పైబర్ దరిచేరనివ్వదు. ఫైబర కోసం తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు బెస్ట్ ఆప్షన్.
శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, పాస్పరస్ శరీరానికి అందాలి. ఇవి అందాలంటే విటమిన్-డి ఖచ్చితంగా అవసరం. విటమిన్-డి లోపిస్తే కాల్షియం, పాస్పరస్ ఉన్న ఆహారాలు తిన్నా సరే ఎముకలు బలంగా మారవు. కాబ్టటి విటమిన్-డి తప్పనిసరిగా అందేలా చూడాలి. సూర్యుడి లేతకిరణాలు శరీరం మీద పడుతున్నప్పుడు ఆ ఎండలో గడపాలి. పుట్టగొడుగులు, చేపలు, పాలు, గుడ్లు బాగా తీసుకోవాలి.
మహిళల శరీరంలో కండరాలు బలంగా ఉండాలంటే ప్రోటీన్ బాగా అందాలి. ఇది శరీరంలో కండర కణాల రిపేర్ కు సహాయపడుతుంది. కాయధాన్యాలు, గుడ్లు, చేపలు, పాలు వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి.
రక్తపోటు అదుపులో ఉండాలంటే పొటాషియం తప్పనిసరి. కండరాలు, నరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం. పాలకూర, బీన్స్, అరటిపండ్లు తీసుకుంటూ ఉంటే పొటాషియం బాగా లభిస్తుంది.
*నిశ్శబ్ద.