స్త్రీలలో బిపి వుంటే ప్రమాదం!   స్త్రీలలో బిపి ఎక్కువగా ఉంటే ప్రమాదమే అంటున్నారు వైద్యులు. స్త్రీలలో ముఖ్యంగా  మధ్య వయసులో ఉన్న వారికి హై బిపి వచ్చిందా.. నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. స్త్రీలలో హై బిపి ని సత్వరం గుర్తించి సరైన నిర్ణయం తీసుకోడం తప్పనిసరి అన్నారు.  మధ్య వయస్సు దాటిన వారిలో  హై బిపి  తరచుగా వస్తుందంటే ఇది మేనోపాజ్  లక్షణమే అని మరికొన్నిరిపోర్టులు  చెపుతున్నాయి. హై బిపిని సత్వరం కనక గుర్తించి చికిత్స చేయకుంటే చాలా దుష్పరిణామాలు   ఉంటాయని అంటున్నారు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన హార్ట్ ఫెయిల్యూర్ కు  దారి తీస్తుందని, లేదా గుండె పోటుకు దారి తీస్తుందని అంటున్నారు డాక్టర్లు. ఇంట్లోనే బి పి ఎప్పటి కప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే  జీవన శైలిని మార్చుకోవాలని, సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. హై బిపి ఒత్తిడి లేదా మేనోపాజ్ కు దారి తీస్తుందని స్త్రీలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఒకవేళ గుర్తించడంలో ఆలస్యమైనా , నిర్లక్ష్యం చేసిన అత్యంత ప్రమాదకరమని అన్నారు. గుండెపోటు లేదా హార్ట్ ఫెయిల్యూర్ కు  దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనిని సత్వరం  గుర్తించడం ద్వారా కార్డియోవాస్క్యులర్ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు తేల్చారు. అసలు హై బిపిని స్త్రీలు స హాజంగా నిర్లక్ష్యం చేస్తారని. డాక్టర్ అంజెలా హెమ్ మాస్ స్పష్టం చేసారు. హై బిపి కి స్త్రీలు పురుషులు అతీతులు కారని  ఇది చాలా తీవ్రమైన అంశమని  పేర్కొన్నారు. స్త్రీలు బిపి ని గుర్తించినా సతమౌతునప్పటికీ ఎవరికీ చెప్పరని డాక్టర్  అంజెలా అన్నారు. బిపి ఉన్నా చికిత్స తీసుకోడానికి ఇష్టపడరని, చికిత్స తీసుకోడానికి ఎక్కువగా నచ్చ చెప్పాల్సి వచ్చేదని డాక్టర్ అన్జేల్ల హెమ్ మాస్ తెలిపారు. హైబిపి మెనోపాజ్  వచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని చదువు కోనివాళ్లలో  ఈసమస్య అధికమని ఆమె పేర్కొన్నారు. పురుషులకంటే స్త్రీలలో గుండె సమస్యలు  తక్కువే అని అభిప్రాయ పడ్డారు. కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ మూన్  మలఫ్జి మెథడిస్ట్ దేబకీ కార్డియోలజీ  అసోసియేట్స్  పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ఇది స్త్రీలలో మేనోపాజ్ కు దారి తీస్తుందని తెలిపారు. బిపి స్త్రీలలో పురుషులలో కారణాలు వేరు వేరుగా ఉంటాయని అన్నారు నిపుణులు. 

ఆహారంలో న్యుట్రీషియన్లు ఉండేలా చూసుకోండి ఆరోగ్యంగా ఉండండి..   పచ్చి కూరాగాయలు పండ్లు తింటే 10,000  రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా పచ్చి పండ్లు తీసుసుకోవం  వల్ల  మరెన్నో లాభాలు ఉన్నాయని  వైద్యులు అంటున్నారు. అయితే పండ్లు పచ్చివే తినాలి. కూరగాయలు ఉడికించి తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు కోల్పోతున్నామని శరీరంలో పోషకాలు అక్కడక్కడా పేరుకు పోతున్నాయని, దీనివల్ల శరీరం సక్రమంగా పనిచేయదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి కేవలం మనం తీసుకుంటున్న ఆహార పదార్ధాలను ఇష్టం వచ్చినట్లు ఒండి వార్చడమే అని నిపుణులు పేర్కొన్నారు. మనం కొన్ని పళ్ళను  లేదా కూరగాయలను పచ్చిగా తిన్నప్పుడే ఉండే ఆ ఆనందం వేరని అంటారు . దీనివల్ల చాలా సున్నితంగా ఉండే  పైతో న్యుట్రియాంట్స్ వేడికి నాశనమౌతాయి. ప్రత్యేకంగా ఉండే ఎంజాయిమ్లు, ప్రోటీన్లు, కేటాలిస్టు గా పనిచేస్త్హాయి. మనం తీసుకున్న ఆహరం నుంచే విటమిన్లు , మినరల్స్ ఎమినో ఆసిడ్స్ అత్యవసరమైనా ఫెటీ ఆసిడ్లు మనా ఆహరం నుండే తీసుకుంటాయి . మనం తీసుకున్న ఆహారంనుండే పోషకాహారం బ్లాక్స్ ను నిర్మిస్తుంది. జీవితాన్ని శరీరాన్ని దృడంగా ఉంచడమేకాకుండా సమర్ధవంతంగా పనిచేస్తుంది ఆహారం వల్ల  వచ్చే ఎంజయిమ్స్ ఆహరం అరుగుదలకు సహకరిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండడానికి బ్లాకులు నిర్మిస్తుంది. ఎంజయిములు ఎప్పుడు శరీరాన్ని అంటిపెట్టుకుని  ఉంటాయి కాబట్టి వీటిని లివింగ్ న్యుట్రీషియన్స్ అని అంటారు. ఇవి మన శరీరానికి సహకరిస్తాయి. ఆహారంలో ఉండే ఎంజయిమ్లు మనం ఎప్పుడైతే వండుతామో అవి తరిగిపోవడం వల్లే వీటిని  మన శరీరంలో నిల్వచేసుకోనందు వల్లె వివిధరకాల సమస్యలు ఎదురుకుంటున్నట్లు  వైద్యులు విశ్లేషించారు.ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేనందు  వల్లే  మెటాబాలిక్ డిజార్దర్ సమస్యలు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. వివిధ రకాల రసాయనాల ద్వారా  ఉత్పత్తి చేస్తున్న కూరాగాయలు,పండ్లలో ఎకువగా రసాయనాలు ఉన్నాయని దీనివల్ల శరీరానికి దీర్గకాలంలో  మరిన్నిసమస్యలు తప్పవని    నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి సహజంగా వచ్చే ఎంజాయిములతోనే మేటాబాలిజం  డిటాక్సికెషన్   ఆధారపడి ఉన్నాయని అంటున్నారు శాస్త్రజ్ఞులు, మనం ప్రకృతి నుంచి వచ్చే సహజమైన కూరాగాయలు, పండ్లకు  ఎప్పుడో దూరమయ్యామని పచ్చికూరాగాయలు పండ్ల లో ఉండే సహజ విత్తనాలు ఎంజయిములను ఉత్పత్తి చేస్తుందని అందుకే పశువులు, పక్షులు గింజలను ఆకులను తింటాయని పరిసోదకులు వెల్లడించారు. ఆహారా పదార్ధాలలో ఆరోగ్యాని పెంచే న్యూట్రీషియన్స్ విషయంలో  కాస్త సర్దుకుపోతున్నామని దీనివల్ల ఆహారంలో ఉండాల్సిన విటమిన్లు విటమిన్ సి ,విటమిన్ బి 1 , బి 5 వంటి విటమిన్లు వండడం వల్ల కోల్పోతున్నాము. అదేపనిగా ఉడికించడం లేదా వేయించడం వల్ల, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ని కోల్పోతున్నామని ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు. కేబేజీ,కేలీ ఫ్లవర్, దుంపలు బ్రోకోలీ, ని 112 డిగ్రీల్లో  మండించడం వల్ల పూర్తిగా న్యుట్రీ షియన్లు,కోల్పోతున్నమని లేదా వాటిని తినడం మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే ఆహారంలో న్యుట్రీషి యన్లు ఉండేలా చూసుకోండి ఆరోగ్యంగా ఉండండి . 

ఎండలో వుండండి క్యాన్సర్‌కు చెక్ పెట్టండి! ఎండలో శ్రమించే మహిళలకు వక్షోజాల క్యాన్సర్ ప్రభావం తక్కువే. ముఖ్యంగా 50 సంవత్సరాల తరువాత మహిళల్లో క్యాన్సర్ ప్రభావం తక్కువే అని నిపుణులు తేల్చారు. అక్యుపెషనల్ ఇన్విరాన్మెంటల్  మెడిసిన్ జనరల్‌లో ఈ అంశాన్ని ప్రచురించింది. బయట ఎక్కువగా ఎండలో పని చేసే రైతులు, రైతు కూలీలు, ఇతర పనులు చేసే మహిళలకు డి విటమిన్ అందడం వల్లే వక్షోజాల క్యాన్సర్ ను నివారిస్తుందని నిపుణులు తేల్చారు. విటమిన్ డికు ఆధారం ఎండ మాత్రమే అని అందుకే మహిళల్లో క్యాన్సర్ రిస్క్ తక్కువే అంటున్నారు వైద్య నిపుణులు. ఉదాహరణకు చదుకున్న మహిళలు ఎండ బారిన పడకుండా  కార్పొరేట్ ఆఫీసులలో కంప్యూట‌ర్‌ల ముందు పనిచేసే మహిళల్లో ముఖ్యంగా ఎండ తగలకుండా పనిచేయడం వల్లే వక్షోజాల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ల బారిన పడుతున్నారని తెలుస్తోంది. 20వ శతాబ్దంలో వస్తున్న వక్షోజాల క్యాన్సర్ డి విటమిన్ లోపం వల్లే వివరిస్తున్నారు నిపుణులు. గత పరిశోధనలలో విటమిన్ డి రక్తంలో ఎక్కువ ఉంటె వక్షోజాల క్యాన్సర్ ప్రభావం తక్కువే అని తేల్చారు. ఉదయం 1౦ గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేసే మహిళల్లో విటమిన్ డి ఎక్కువగా అందడం వాళ్ళ బయట పని చేసేవా రికంటే లోపల  పనిచేసే వారిలోనే రిస్క్ ఎక్కువగా  ఉంటుందని తెలిపారు. 7 ౦ సంవత్సరాల లోపు ఉన్న మహిళల్లో 3 8. 3 7 5 సాధారణ వాక్సోజాల క్యాన్సర్ను గుర్తించామని ప్రతి ఒక్కరినీ పరిశీలించినప్పుడు 5 గురు మహిళల్లో అదేసంవత్సరంలో పుట్టడం గమనింఛామని నిపుణులు తెలిపారు. వివిధ స్థాయిల్లో పనిచేసే వారికి ఎండలో పనిచేయనందువలె క్యాన్సర్ ప్రమాదం వస్తుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. 5౦ సంవత్సరాల తరువాత క్యాన్సర్ ప్రమాదం తక్కువే అని తేల్చారు. విటమిన్ సుప్లిమెంట్లు ఇతర ఆహరం విషయంలో జీవన గతిని మార్చడం లేదా మందులు, హార్మోన్ రీప్లేస్ మెంట్ తెరఫీ, మద్యం, ఊబకాయం శారీర వ్యాయామం తప్పనిసరి  అని నిపుణులు సూచించారు. దీర్గాకాలంలో ఎండలో పనిచేసిన వారు క్యాన్సర్కు గురికారని, ఒత్తిడి ఇతర ఆనారోగ్య సమాస్యలు వారిని ఇబ్బంది పెడతాయని వైద్యులు విశ్లేషించారు. 

కాస్మోటిక్స్ తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం   కాస్మోటిక్స్, సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నారా? అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అందంగా కనబడడం కోసం అమ్మాయిలు తెగ తాపత్రయ పడిపోతారు. బ్యూటీపార్లర్లు, కాస్మోటిక్స్, పేస్ మాస్క్ అప్లై చేయడం.. ఒకటికాదు నానా తంటాలు పడుతూ వుంటారు. ఇటీవలికాలంలో స్త్రీలకు అందంపై మరింత మోజు పెరిగింది. అందం పెంచే సౌందర్య సాధనాల కోసం నెట్లో వెతుకుతూ ఉంటారు. చిట్కాలు ప్రయోగిస్తూనే ఉంటారు. అందం పెంచే సౌందర్య సాధనాల ఉత్పత్తులు మరింత పెరిగాయి. క్లినిక్లు పెరిగాయి. ఏమైతే ఏమి స్త్రీ సౌందర్య సాధనాలలో వాడే కాస్మోటిక్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలొ చెప్పాలంటే మేకప్ లిప్ స్టిక్ లేకుండా స్త్రీలు బయటికి రావడం లేదంటే అతిశయోక్తికాదు. ఇక్కడే సమస్య. మీరువాడే కాస్మోటిక్స్, సన్ స్క్రీన్ లోషన్లలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ ఉండడం వల్ల క్యాన్సర్ వస్తుందని నిపుణులు తేల్చారు. స్త్రీ సౌందర్య సాధనాలలో కాస్మోటిక్స్, లిప్ స్టిక్స్, ఎండాకాలం వాడే సన్ స్క్రీన్ లోషన్ లలో రసాయనాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. రసాయన కారకాల వల్ల స్త్రీలలో ఉండే కణాలు డి ఎం ఏ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో జనవరి 15 న ఈవిషయం వెల్లడించించింది. ఈస్ట్రోజెన్స్ - ఎంస్ట్రోజెన్స్ బయట ఉండే రసాయనాలు కలిసి క్యాన్సర్ కారకాలుగా నిర్ధారించారు. ఆమ్ హెర్ట్స్ కు చెందిన మసాచూట్స్ విశ్వ విద్యాలయానికి చెందిన పసు శాస్త్ర విభాగం డాక్టర్ జోసఫ్ జర్రీ ఈ విషయం వెల్లడించారు. డాక్టర్ జోసఫ్ జర్రీ వ్యాలీ లైఫ్ సైన్సు కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రైన్ ఆఫ్ హోప్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ పై ఉమ్మాస్ ఆమ్ హర్ట్స్ సెంటర్ సంయుక్తంగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ మేరకు బయటి నుంచి వచ్చే రసాయనాలు వల్ల ఎక్కువ టాక్సిట్స్ ఉన్నట్లు గా ఎఫ్ డి ఏ గుర్తించింది. కొనుగోలు దారులకు సొందర్య సాధనాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. కాస్మోటిక్స్ లో 1నుండి 10% -1నుండి 30% రసాయనాల ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ రసాయనాల సాంద్రతను తట్టుకునే స్థితిలో ఉండదు. తద్వారా వక్స్లోజాల క్యాన్సర్ కు కారణం అవుతున్నట్లు గుర్తించామని, దీనివల్ల డి ఎన్ ఏ డ్యామేజ్ అవుతున్నట్లు నిపుణలు డాక్టర్ జెర్రీ వెల్లడించారు.

రుతుస్రావాన్ని అంగీకరిద్దాం..   రుతు స్రావం అనేది ఒక సిగ్గుపడే ప్రక్రియగా ఆడవారి మనస్తత్వాన్ని చాలా బాగా మార్చేశారు. ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఇంకెన్ని గొప్ప పనులు సాధించినా దీని గురించి మాట్లాడడానికి ఇప్పటికీ సంకోచమే.  ఆడదానికి సిగ్గు అలంకారమట. జననేంద్రియాల ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడకూడదట. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి కూడా ఆడవారికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. హార్మోన్లను విపరీతంగా ప్రభావితం చేసే మందులను దొంగ చాటుగా, తప్పు చేస్తున్న వారిలా వేసుకుంటూ, తమ శరీరాలను గుల్ల చేసుకుంటున్న ఆడవారు చాలా మంది ఉన్నారు. కుటుంబ నియంత్రణ వస్తువులను బహిరంగంగా, ధైర్యంగా కొనుగోలు చేసుకునే అవకాశం కూడా మన స్త్రీలకు ఇవ్వలేని మన సమాజానికి జోహార్లు. విశృంలత్వం, విచ్చలవిడితనం కాదిది. తమ శరీర అవసరాలను గుర్తించి, తల ఎత్తుకుని తమకు కావాల్సినవి సాధించుకోవడం. మీకు గుర్తుందా?! గుజరాత్ కళాశాలలో ఒక అమ్మాయి తన బహిష్టు సమయంలో వంటగదిలోకి వెళ్ళింది అని 68 మంది విద్యార్థినుల ప్యాంటీ లను చెక్ చేసి, వారిని క్షోభకు గురి చేశారు. 21వ శతాబ్దంలో పురోగతి దిశగా అడుగులు వేస్తూ ఉన్న మనం, స్త్రీల పట్ల ఇంకా అదే మూస ధోరణిలో ఉండిపోలేదూ!  కిచెన్ లోకి వెళ్ళకూడదు, అందరితో కలిసి తినకూడదు..ఇలా ఇంకెన్నో ఆంక్షలు అదే కళాశాలలో మరొక ప్రబుద్ధుడు ఆడవారు బహిష్టు సమయంలో మగవారికి అన్నం వండితే వారు మరుజన్మలో కుక్కగా పుడతారు అని జ్ఞాన బోధ చేసాడు. ఇటువంటి సమాజం లోనా మనం బతుకుతున్నది అని అనిపించింది. అతడిని సపోర్ట్ చేస్తూ , మిగతా వారు కూడా వంత పాడడం శోచనీయం. ఈ సిగ్గు అనే మానసిక జడత్వం ఎంతగా మన ఆడవారిలో చొప్పించారు అంటే, వాటిని వ్యాపారానికి ముడి సరుకులా చేసుకుని వ్యాపారులు తమ జేబులు నింపుకునేంత ◆ వెంకటేష్ పువ్వాడ      

గర్భస్థ దశలో స్త్రీ ఆరోగ్యం? గర్భిణిగా ఉన్నప్పుడు తల్లులు వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెతేస్ద్ ఎం డి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెల్లడించారు. ఒత్తిడి నిరాశకు గురికావడాన్ని గమ నించారు.ఒత్తిడి,నిరాశకు గురి అయ్యే గర్భిణీ లలో పిండం పై తీవ్ర ప్రభావం పడుతుందని పలు మార్పులు పిల్ల వాడి ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచించారు.ఈ మార్పులు ఎపి జనోమిక్స్ లో ప్రచురించారు.జీన్ ఎక్టివీటిలో మార్పులు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి,నిరాశ స్త్రీలలో సహజమని అది ప్రతి మందిలో ఒకరికి ఈసమస్య వస్తోందని.అమెరికాకు సంబందించిన ఓబీ ట్రీ షియన్,గైనకాలజిస్ట్ పేర్కొన్నారు. ఒత్తిడి,లేదా నిరాశ అన్నది ప్రసవ అనంతరం పుట్టిన బిడ్డ పై ఉంటుందని.అతని జీవితాంతం మనస్తత్వం,బావోద్వేగాలపై తీవ్రప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గర్భిణిగా ఉన్న మహిళ ఒకరకమైన భావోద్వేగాల డిజార్దర్ బాల్యం లోనే ఎదుర్కోక తప్పదు.18 సంవత్సరాల వయస్సులోనే ఒత్తిడి నిరాశ లు అవరించించింది.గర్భిణిగా ఉన్న సమయం లో ఒత్తిడి అన్న అంశం పై చేసిన పరిశోదన 312 మంది  మహిళల పై నిర్వహించారు.ఈ పరిశోదన 126 ఆసుపత్రులలో నిర్వహించారు.అమెరికా సంయుక్త రాష్ట్ర్రాలలో  చేసిన పరిశోదనలో పాల్గొన్నారు. నైతికంగా డైవర్స్ తీసుకున్న వారు.34% హిస్పానిక్ 26% నాన్ హిస్పానిక్ 24% నాన్ హిస్పానిక్ బ్లాక్ 17% ఆశియా పసిఫిక్ దీవులకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. పరిశోదన ప్రారంభం లో స్త్రీలకు ఒక ప్రశ్నావళి మీ పూర్తి చేయమన్నారు.ఒత్తిడి,నిరాశ ను పరీక్షించేందుకు సమాచార సేకరణ జరిపారు.5 సార్లు ఆ ప్రశ్నావళిని పూర్తి చేసారు.ఒక్కొక్కరు ఒక్కొకరికి జన్మనిచ్చారు.పరి శోదకులు టిష్యు సంమ్పుల్ ను స్వీకరించారు.పిండం నుండి సేకరించారు.ఈ అంశంపై మార్కోస్ తెస్ఫయే గర్భిణీ లలో పిండంలో వచ్చిన రాసాయనమార్పులు గుర్తించారు.పిండం లో మెదడు నిర్మాణం పిండం బయట 16 సంవత్సరాలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. న్యూరో లాజికల్ సైక్రి యాటిక్ ఇల్ నెస్ వస్తే వారిని వారి బిడ్డను ఇబ్బందికి గురి కాక తప్పదని తేల్చారు. అయితే గర్భి నీలు ముఖ్యంగా వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని వారే నియంత్రించుకోవాలి.గర్భిణీలు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు.

బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి రావచ్చు...  అందులో రిస్క్ ఎంత ?   బ్రెస్ట్ క్యాన్సర్ వయస్సు పై బడుతున్న కొద్ది మంది స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 3౦ ఏళ్ల లోపు స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అరుదు.మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో 3౦ ఏళ్ల లోపు  వాళ్లకు వచ్చే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుంది. 4౦ ఏళ్ల స్త్రీలకు -21 7 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 5౦ ఏళ్ళు -5౦ మందిలో ఒకరికి. 85 ఏళ్ళు దాకా జీవించే స్త్రీలకు 8 మందిలో ఒకరికి వచ్చే అవకాశం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అంతార్జాతీయంగా వచ్చిన పరిశోధనలలో ఈ క్రింది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. సామాజికంగా,ఆర్ధికంగా హై స్టేటస్ లో ఉండే స్త్రీలు వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు,అవివాహిత స్త్రీలు. పిల్లలు కలగని స్త్రీలు,వక్షోజం లో అసాధారణ లక్షణాలు కల స్త్రీలు. నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలు, ప్రసవ సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు. పిన్న వయస్సులోనే 12 ఏళ్ల వయస్సులోపు రసజ్వల అయిన వాళ్ళు 55 ఏళ్ల తరువాత ముట్లుదిగిన స్త్రీలు. గర్భాశయం, జీర్ణాశయం, రెక్టం, అందాసాయాల క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న స్త్రీలు. కొవ్వు పదార్ధాలు అధికంగా తినే స్తూల కాయం గల స్త్రీలు. దీర్ఘకాలం పాటు హార్మోన్లతోకూడుకున్న గర్భ నిరోధక మాత్రలు వాడిన స్త్రీలు. అమ్మ,అమ్మమ్మ అక్క చెల్లెళ్ళు కూతుళ్ళలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటె వాళ్ళ లో ఎంత మందికి  ఏ ఏ వయస్సులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అన్న అంశం పై బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్  ఆధార పది ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ లో దశలు --- ప్రాధమిక దశ... వక్షోజం లోని గడ్డ 2 సెంటి మీటర్లు లోపున ఉంటె అంటే 3 /4 వంతు అది ప్రాధమిక దశ.కిందికి వస్తుంది.దీనిని స్టేజ్ ౦ గా నిర్ధారిస్తారు.క్యాన్సర్ గడ్డ చిన్నగా ఉంటె అవతలకు వ్యాపించే స్థాయిలో లేకపోతే ౦ దశగానే నిర్ధారిస్తారు. మొదటి దశ... గడ్డ రెండు సెంటిమీటర్ల కు మించి ఉండక పోవడం క్యాన్సర్ ఇంకా లింఫ్ నోడ్స్ వరకూ  వ్యాపించిఉండక పోవడం క్యాన్సర్ వక్షోజాన్ని దాటి అవతలికి వెళ్లక పోవడం. రెండవ దస... గడ్డ 2 నుండి 5 సెంటీ మీటర్లు మధ్య ఉండడం క్యాన్సర్ చంకలోని లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉండవచ్చు. వ్యాపించక పోవచ్చు.లేదా గడ్డ 2 సెంటీ మీటర్ల లోపు ఉండి కూడా చంకలో 3 మీటర్లకు మించని లింఫ్ నోడ్స్ కి వ్యాపించడం లేదా వక్షోజం లో అసలు గద్దె ఉండక పోవచ్చని క్యాన్సర్ కణాలు చంకలో 3 కు మించని లింఫ్ నోడ్స్ లో కనిపించడం. మూడవ దశ... స్థానికంగా ముదిరి పోయిన క్యాన్సరు.కిందకు వస్తుంది.దీనిని క్యాన్సరు కణాలు వక్షోజాలకు దగ్గరగా ఉండే లింఫ్ నోడ్స్ కి ఉదాహరణకు చంకలోను కాలర్ బోన్ వద్ద ఉండే లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉంటాయి గాని ఇంకా అవతలి అవయవాలకు పాకవు.గడ్డ 5 సెంటీ మీటర్లు మించి ఉండదు కాని చంకలోని లింఫ్ నోడ్స్ లో వరసగా కాకుండా అక్కడక్కడా కనిపించడం. 5సెంటీమీటర్ల నున్చిలోపు ఉంటుంది కాని దగ్గరలోని లింఫ్ నోడ్స్ లో ప్రవేశించడమే కాక గడ్డ పక్క కణాలకు కూడా పాకి దాని మూలంగా అక్కడి లింఫ్ నోడ్స్ ఒకదాని తో ఒకటి కలిసిపోవడం.క్యాన్సర్ కణాలు కాలర్ బోన్  పైభాగాన ఉండే లింఫ్ నోడ్స్ కి కూడా వ్యాపించడం ఇంఫ్లామేటరీ బ్రెస్ట్ క్యాన్సర్... ఇది మూడవ దశ కిందకి వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ లో గడ్డ ఉండక పోవచ్చని క్యాన్సర్ కణాలు లింఫ్ వ్యవస్థకు చెందిన నాళాలను మూసేస్తాయి దీనివల్ల వక్షోజం ఉబికి సాగిపోతాయి పై చర్మం ఎర్రగా గరుకుగా అయి గట్టి పడిపోతుంది.దీనిని కూడా డాక్టర్లు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ కిందే పరిగ నిస్తారు. నాల్గవ దశ... ఇది పూర్తిగా ముదిరి పోయిన దశ,క్యాన్సరు కణాలు వాక్షోజానికి దూరంగా ఉండే ఎముకలు,ఊపిరి తిత్తులు లివర్,లాంటి శరీర భాగాలకు ఆడారి దాపుల్లో ఉండే లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉంటాయి. నాల్గవదశ బ్రెస్ట్ క్యాన్సర్ ను మేటా స్టా టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. నాలుగు దశలలో సోకే బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స సరైన సమయం లో తీసుకుంటేనే క్యాన్సర్ నుండి విముక్తి  అన్నిటి కన్నా మానసికంగా కుంగి పోక దృడంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.విజయం సాధించాలి.   

బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మొదలవుతుంది   శరీరంలో ఏ భాగం లో అయినా అసాధారణ కణాలు ఒకే చోట గుమిగూడి గడ్డగా తాయారు కావడం ద్వారా క్యాన్సర్ ప్రారంభ మౌతుంది.కొంత కాలం గడిచేసరికి ఈ అసాధారణ కాణాలు రూపాన్ని మార్చుకుంటూ అసంఖ్యా కంగా వృద్ధి చెంది ఆ భాగాన క్యాన్సర్లు పరిమితం కావడం లేక రక్త ప్రవాహం ద్వారా,లింఫ్,వ్యవస్థ ద్వారా ఇతర భాగాలకు వ్యాప్తి చెందితే క్యాన్సర్ గా మారుతుంది.వక్షోజాలాలో బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు కూడా ఇలాగే ఏర్పడతాయి. సాధారణంగా వక్షోజాలలో ఏర్పడే చాలా భాగం గడ్డలు ప్రామాడం లేనివి బినైన్ వి అయి ఉంటాయి. అంటే ఇవి ప్రామాదం లేనివి అయి ఉంటాయి.కాని ఇలాంటి గడ్డలలో కొన్ని తరువాత తరువాత ఆ స్త్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ ని కలిగించే అవకాసం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు... బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాధమిక దశలో ఉన్నప్పుడు సాధారణంగా నొప్పి అంటూ ఉండదు.లక్షణాలలో  మొదటిది వక్షం లోపల గడ్డ ఏర్పడడం.సాధారణం గా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. వక్షం లో గాని చంకలో గాని గడ్డ లేక వాపు ఉండడం.నిపుల్ లోపలికి వంపు తిరిగి ఉండడం. లేదా నిపుల్ సజులో మార్పు. నిపుల్ చర్మం మందం కావడం లేదా సొట్ట బడడం. వక్షోజపు చర్మం బత్తాయి తోలు మీద ఉన్నట్లు గుంటలు గుంటలు గా గరుకుగా ఉండడం. బ్రెస్ట్ బరువెక్కడం. నిపుల్ నుంచి రక్తం తో కూడుకున్న డిశ్చార్జ్ కావడం. క్యాన్సర్ నిర్ధారణ... బ్రెస్ట్ క్యాన్సర్నే కాదు ఏ క్యాన్సర్ నైనా గాని ప్రాధమిక దశలో గుర్తిస్తే ప్రాణా పాయం నుంచి తప్పించడం కుదురు తుంది. 2౦ నుంచి 49 సంవత్సరాల వయస్సుగల ప్రతి స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించి రెండేళ్ళ కొకసారి 5౦ ఏళ్ళు దాటిన తరువాత యాడాది కి ఒక సారి పరీక్ష చేయించుకోవడం అవసరమని నిపుణులు బోధించారు. శారీరకంగా పరీక్షించే సమయం లో డాక్టర్లు స్త్రీలను రెండు చేతులు పైకి ఎత్తమని పక్కకి వదిలి పెట్టమనడం. పిరుదల మీద కొట్టుకోమని చెప్పి వివిధ కోణాలలో ఆమె వక్షోజాల సైజ్ ,షెపులు నిశితంగా పరిశీలిస్తారు. అలాగే వక్షోజాల పై చర్మం గురుకుగా అయిందా,గుంటలు పడిందా వంటి అసాదారణ చిహ్నాల కోసం చూస్తారు. నిపుల్స్ మీ నొక్కి ఏమైనా ద్రవం కారుతున్నదేమో చూస్తారు. అలాగే వక్షోజాలను వెల్ల నొక్కడం ద్వారా లోపల గడ్డలు తగులు తున్నా యేమో పరిశీలిస్తారు.ఒక వేళ గడ్డ తగిలితే దాని సైజు,షేపు,అటుఇటూ కడుతున్దాలేదా అని మరీ పరిశీలిస్తారు. వక్షోజం లోని గడ్డలలో అపకారం లేని హానికరం కాని,హానికారక మైన గడ్డలు క్యాన్సర్ గడ్డలకు తేడాలు ఉంటాయి. హాని కలిగించని సాధారణ గడ్డలు మృదువుగా మెత్తగా గుండ్రంగా ఉంటాయి.తేలికగా అటూ ఇటూ కదిలేట్లు ఉంటాయి. క్యాన్సర్ గడ్డలు గట్టిగా ఉండి.గుండ్రంగా కాకుండా వంకర టింకర గా ఉండి అటు ఇటూ కదల కుండా ఉన్న చోటే  పట్టుకునే ఉంటాయి. అయితే క్యాన్సర్ గడ్డ అవునా కాదా అన్నది నిర్ధారించుకోడానికి చేసే నిర్ధారణ పరీక్షలు.... మామోగ్రామ్... వివిధకోణాలలో వక్షోజం లోపలి తక్కువ పవర్ గల ఎక్స్ రే కిరణాలు పంపి అక్కడి కనజాల చిత్రాలను తీయడం మామోగ్రామ్ మామూలు  పరీక్షలో చేతికి తగలని గడ్డలు.మామో గ్రామ్ లో కనిపిస్తాయి.అలాగే సూక్షంగా కాల్షియం డిపాజిట్లు ఉన్నా తెలుస్తాయి. ఈ కాల్షియం డిపాజిట్లను మైక్రో కల్సిఫికేషన్స్ అంటారు.ఇవి అవి తరువాత తరువాత క్యాన్సర్ కు దారి తీసే అవకాసం ఉంది లేదా క్యాన్సర్ కు సంబందించినవి అయి ఉండవచ్చు. అల్త్ర్రా సౌండ్... వక్షోజాల లోపలి గడ్డ గట్టిగా ఉందా లేదా ద్రవం తో కూడుకుని ఉన్న సిస్టా లేక ఈ రెండిటి కలయికతో కూడుకుని ఉందా అన్న విషయం తెలుస్తుంది. సిస్ట్ అయితే సాధారణ క్యాన్సర్  ఉండదు.సాలిడ్ గా ఉన్న గడ్డలు మాత్రం క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాసం ఉంది. ఎం ఆర్ ఐ... ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా వచ్చే చిత్రాలలో సాధారణ కణాల కంటే భిన్నంగా ఉండే రోగ పూరిత కణాలు తెలుస్తాయి. బయాప్సి... శరీరంలో ఉన్న కణజాలపు ముక్కను బయటికి తీసి పరీక్షించడం బాయప్సి అంటారు.క్యాన్సర్ అవునా కాదా అన్నది ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉన్న ఒకే ఒక సాధనం బ యాప్సి లోపల అసాధారణ మైన కణజాలం ఉన్నట్లుగా పైన పేర్కొన్న టేస్ట్లలో ద్వారా తేలినప్పుడు బయాప్సి చేయాల్సిన అవసరం వస్తుంది.అసాధారణ కణజాలం ఉన్నట్లు తేలిన ప్రదేశం నుంచి కాణ జాలాని లేదా,ద్రవాన్ని,గాని బయటికి తీయించి.అది ఏ రకంసైన క్యాన్సర్ అన్నది తెలుసుకోడానికి ల్యబోరేట రీలో పరీక్ష చేస్తారు.బయాప్సి లో నీడిల్ బయాప్సి, కోర్ బయాప్సి ,స్కిన్ బయాప్సి,సర్జికల్ బయాప్సి లో వక్షోజం లోపలి గడ్డలో కొంత భాగాన్ని బయటకి తీసి లేక గడ్డ మొత్తాన్ని బయటికి తీయడం లాంటివి ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కు చికిత్స... మిగతా అన్ని క్యంసర్ల లాగానే బ్రెస్ట్ క్యాన్సర్ కు మూడు ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. శాస్త్ర చికిత్స,రేడియేషన్,తెరఫి,కీమో తెరఫి  బ్రెస్ట్ ,క్యాన్సర్ దశను బట్టి హార్మోన్ సున్నితంగా ఉంటాయి కాబట్టి.రోగి ఇతర అవయవాల పనితీరు ఉంది అన్న అంశాల పనితీరును బట్టి చికిత్సను నిర్ణ యిస్తారు. క్యాన్సర్ దసలు వివిధ దశల్లో చికిత్సలు మీకు అందిస్తాం.

గర్భస్రావానికి 24 వారాలు... ' ఇక మహిళలు గర్భస్రావానికి 24 వరాలు మాత్రమే గడువు విదిస్తూ కేంద్రం ఎం టి పి చట్టం 19 71 ని సవరించింది.ఈ మేరకు టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి చట్టం 2౦21 ని సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి తెచ్చింది. గతం లో ఉన్న 1971 ఎం టి పి ప్రకారం గర్భస్రావానికి 2౦ వరాలు మాత్రమే గడువు ఉండగా దీనిని సవరిస్తూ మరో నాలుగు వారాలు గడువును పెంచింది. అయితే గర్భ శ్రావం చేసుకోడానికి గల కారణాలను సూచిస్తూ ఎవరు గర్భ స్రావాన్ని చేసుకో వచ్చో చట్టంలో పేర్కొంది.ముఖ్యంగాలైంగిక దాడులకు గురి అయిన వారు.  మానభంగానికి గిరి అయిన వారు.మైనర్లు అంగవైకల్యం గల మహిళలు. మానసిక రోగులు,ఎవరైతే మానసిక సమాస్యలతో బాధ పడుతున్నారో.ఆయా సందర్బాన్ని బట్టి గర్భం లో ఉన్న పిండాన్ని తొలగించడం ప్రమాదం తో కూడుకున్నదని ఒక్కో సారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని సవరణ చట్టం లో పేర్కొన్నారు.కాగా సవరణ చట్టం లో ఎవరైతే పిల్లలు శారీరకంగా మానసిక తీవ్ర అంగ వైకల్యం తో బాధ పడుతున్నారో,లేదా ఇతర అనారోగ్య సమస్యల తో బాధ పడేవారు,వివాహం లో ఇబ్బందులు,ఆతరువాత వచ్చిన మార్పు పరిణామాల నేపధ్యం లో అవాంచిత గర్భం వచ్చినప్పుడు అది తీవ్ర సమస్యగా మారవచ్చు. ఆసమయంలో అత్యవసరంగా గర్భ శ్రావం చేయాల్సి వస్తే చట్ట ప్రకారం వారు గర్భ శ్రావం చేసుకో వచ్చని కేంద్రం చట్టం లో పేర్కొంది.వైద్య పరంగా గర్భస్రావం టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి యాక్ట్ 2౦21 సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి వస్తుందని చట్టం లో పేర్కొన్నారు. 

Healthy Heart Diet Tips You can lower your chances of getting heart disease by eating healthy. For a healthy heart, Weight control and regular exercise are critical for keeping your heart in shape but the food you eat may matter just as much. * Eat a diet low in fat, especially animal fats and palm and coconut oils. (These foods contain saturated fat and cholesterol. Saturated fat and cholesterol can cause heart disease.) * Choose a diet moderate in salt and sodium. * Maintain or improve your weight. * Eat plenty of grain products, fruits and vegetables. * Choose milk with 1% fat or skim milk instead of whole milk. * Eliminate fried foods and replace them with baked, steamed, boiled, broiled, or microwaved foods. * Cook with oils which are low in fat and saturated fat like corn, safflower, sunflower, soybean, cottonseed, olive,canola, peanut and sesame oils. Stay away from oils and shortenings that are high in fat and saturated fat. * Smoked, cured, salted and canned meat, poultry and fish are high in salt. Eat unsalted fresh or frozen meat, poultry and fish. * Replace fatty cuts of meat with lean cuts of meat or low-fat meat alternatives. * In recipes requiring one whole egg try two egg whites as a lower fat alternative. * Replace sour cream and mayonnaise with plain low-fat yogurt, low-fat cottage cheese, or low-fat sour cream and mayonnaise. * Substitute hard and processed cheeses for low-fat, low-sodium cheeses. * Use herbs and spices as seasoning for vegetables and potatoes instead of salt and butter. * Replace salted crackers with unsalted or low-sodium whole-wheat crackers. * Substitute canned soups,bouillons and dry soup mixes which are high in salt for sodium-reduced soups and bouillons. * Replace white bread, white rice, and cereals made with white flour with whole-wheat bread, long-grain rice, and whole-grain cereals. * Substitute snacks high in salt and fat with low-fat, low salt snacks. Cut-up vegetables and fruits are a quick healthy snack.    

చక్కెర చిక్కులు తగ్గించుకోండిలా!   డయాబెటిస్ ఒక్కటి వస్తే చాలు... దాని వెనకాల తట్టెడు రోగాలు చుట్టుముడతాయి. అందుకే దాని పేరు చెబితే చాలు ప్రపంచమంతా వణికిపోతోందిప్పుడు. అలా అని వస్తుందేమో అని భయపడుతూ కూర్చుంటే ఎలా? రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా! వీలైనంత వరకూ చక్కెరను ఒంట్లోకి వెళ్లకుండా ఆపగలిగితే మంచిది. అందుకోసం మొత్తం నోరు కట్టేసుకోనక్కర్లేదు. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు... * స్వీట్ల మోతాదు తగ్గించండి. ఒకవేళ తిన్నా చక్కెరతో చేసిన వాటికంటే బెల్లంతో చేసిన వాటినే తీసుకుంటూ ఉంటే కాస్త బెటర్. *ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి పోవద్దు. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. వాటి బదులు ఫ్రూట్స్ తో చేసే ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ చాట్ లాంటివి ఎంచుకోండి.  * కూల్ డ్రింక్స్ బదులు జ్యూసులు, బటర్ మిల్క్ లాంటివి తాగండి. * కేక్స్, కుకీస్ లాంటివి కూడా ఎక్కువ తినకూడదు. తినాలనిపిస్తే అప్పుడప్పుడూ ఓ చిన్న ముక్క. అంతే తప్ప ఒకేసారి నాలుగైదు ముక్కలు లాగించేశారో... అంతే సంగతులు. * పాలు, పెరుగు వంటి వాటిలోని చక్కెర త్వరగా కొవ్వుగా మారిపోతుంది. కాబట్టి బయట పెరుగు కొనకండి. అవి రోజుల తరబడి నిల్వ ఉంచుతారు కదా! ఇంట్లోనే ఎప్పటికప్పుడు పెరుగు తోడు పెట్టుకుని తాజాగా ఉండగానే తినేస్తే మంచిది. * సాస్ లనీ, డిప్స్ అనీ ఏవేవో దొరకుతున్నాయి మార్కెట్లో. అస్సలు టెంప్ట్ అవ్వొద్దు.  * ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకండి. అంతగా టెంప్ట్ అవుతుంటే నీళ్లశాతం ఎక్కువగా ఉండి, ఏదో కొద్దిగా ఫ్లేవర్ ఉండే ఐస్ ఫ్రూట్స్ ఉంటాయి. అవి తిని సరదా తీర్చుకోండి. అలాగే చాక్లెట్లు కూడా. మితిమీరి తినవద్దు. అంతగా తినాలనిపిస్తే మామూలు చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ తినండి. * తినగలిగితే మామూలు రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టండి. మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ మెల్లగా అలవాటైపోతుంది. అలాగే బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ తింటే ఏ భయమూ ఉండదు.       ఇవన్నీ మనం చేయగలిగినవే. ఫుడ్ విషయంలో అవసరం కంటే టెంప్టేషన్ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. అందుకే ఆకలి లేకపోయినా తినాలనిపించి తినేస్తుంటాం. టెంప్ట్ అవ్వడం మానేస్తే అసలు సమస్యే ఉండదు. అబ్బే లేదు అంటే మాత్రం పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. చక్కెరతో చిక్కులు రాకుండా ఉంటాయి.   

గోళ్ల రంగుకి అమ్మాయిల బరువుకి లింకేంటి..?     గోళ్ల రంగు..ఇదివరకటి రోజుల్లో పెళ్లిళ్లకో, వేరే ఏదైనా శుభాకార్యాల కోసమో అందంగా రెడీ అవ్వడానికి అమ్మాయిలు గోళ్ల రంగు వేసుకునేవారు. కానీ కాలం మారింది..గోళ్లరంగు వేసుకోవడానికి ప్రత్యేకంగా సందర్భం ఏమీ అక్కర్లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. ఏ రోజుకు ఆ రోజు డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా పాత నెయిల్ పాలిష్‌ని రిమూవ్ చేసి కొత్తది వేసుకుంటున్నారు మగువలు. అయితే ఇలాంటి వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల బరువు పెరుగుతారట. డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో నివ్వెరపరిచే వాస్తవాలు బయటపడ్డాయి..ముఖ్యంగా నెయిల్ పాలిష్‌లో ఉండే ట్రైఫీనైల్ ఫాస్ఫేట్ అనే పదార్థం వల్ల గోళ్ల రంగులు ఎక్కువ కాలం మన్నుతాయి. ఫ్లాస్టిక్ పదార్థాలు, ఫోమ్ ఫర్నిచర్‌కు త్వరగా మంటలు అంటుకోకుండా ఈ రసాయనాన్ని వాడుతారు. కానీ ఇది అంతిమంగా హార్మోన్లపై ప్రభావం చూపెడుతోందని పరిశోధకులు నిర్థారించారు. పశువుల మీద చేసిన పరీక్షలలో వాటికి సంతానోత్పాత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అయితే మనుషుల్లో బరువు పెరిగే లక్షణాన్ని గుర్తించారు. మార్కెట్లో దొరుకుతున్న సుమారు 3 వేల రకాల నెయిల్ పాలిష్‌లు సేకరించి వాటిని పరీక్షించగా వాటిలో 49 శాతం ట్రైఫీనైల్ ఉంది. గోళ్ల రంగు వేసుకున్న 10-14 గంటల తర్వాత వాళ్ల శరీరంలోని టీపీహెచ్‌పీ మోతాదు దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోళ్లు పెట్టుకుని, వాటికి మాత్రమే రంగులు వేసుకున్న వాళ్లకు మాత్రం అలా పెరగలేదు. అందువల్ల తరచు గోళ్ల రంగులు వేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని..దానివల్ల శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తప్పనిసరైతే చర్మానికి తగలకుండా చూసుకోవాలని, అలా తగిలితే రక్తంలోకి వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు..కాబట్టి బీ కేర్ ఫుల్..

జీరో యావలో లైఫే "జీరో"...     కరువు కాటకాలతో అల్లాడే దేశాల్లో తినడానికి ఆహారం దొరకదు కాబట్టి అక్కడ ప్రజలు బక్కచిక్కిపోయి, ఎముకలు బయటపడి ఉండటం మనం చూస్తుంటాం. కానీ నేటి కాలం యువతులకు ఏం పోయే కాలం..అన్నీ ఉన్నా కావాలని కడుపు కట్టేసుకుని సన్నగా గడకర్రలా ఉండటానికి..? ఆ దేశం, ఈ దేశం అని లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లోని అమ్మాయిలు  నాజూకుతనం కోసం పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే సన్నబడాలనే ఉద్దేశ్యంతో శరీరావసరాలకు సరిపోని స్థాయిలో అతి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. వారి టార్గెట్ ఒక్కటే "సైజ్ జీరో"..ఇదంతా బాగానే ఉంది కాని దీని కారణంగా బయటపడిన ఒక మానసిక వ్యాధి ప్రపంచంలోని అమ్మాయిల ప్రాణాలను హరిస్తోంది. అదే "ఎనరెక్సియా నెర్వోసా"..ఇది అత్యధిక మోడళ్లలో కనిపించే ఒక మానసిక సమస్య. తిండి తినడం వల్ల బరువు పెరుగుతుందనే ఫోబియా వల్ల వచ్చే రోగం ఇది. ఇది ఒక సాంఘిక అంటువ్యాధి..నా కన్నా ఆ అమ్మాయి సన్నగా ఉందనే ఆత్మన్యూనతా భావంతో ఈ డిజార్డర్ బారిన పడి కలత చెంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారెందరో..తాజాగా ఇది ఇండియాలో అడుగుపెట్టింది. ఈ వ్యాధి తీవ్రతను గుర్తించిన యూరప్ అమ్మాయిలు సైజ్ జీరో నుంచి బయటపడుతుండగా..అదే సమయంలో దాన్ని ఇండియాకి తీసుకొచ్చింది కరీనా. "తషన్" చిత్రంలో కరీనా సన్నదనం చూసి బాలీవుడ్‌తో పాటు అమ్మాయిలు స్టన్నయ్యారు. ఇంకేముంది క్యాలరీలు కట్ చేసుకోవడం మొదలెట్టారు. మహానగరాల నుంచి కుగ్రామాల వరకు ఇండియాలో ఇప్పుడోక ఫ్యాషన్‌లా మారింది జీరో సైజ్. త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో డైటింగ్‌లు, తీవ్రస్థాయిలో వ్యాయామంతో పాటు మందులు వేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అనొరెక్సియా నెర్వోసా దుష్పలితాలు: * ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో మంట * ఏకాగ్రత తగ్గడం * నిద్రలేమి * శరీరంలో పెళుసైన ఎముకలు విరిగిపోవడం * మూర్ఛవ్యాధి * హర్మోన్లలో అసమతుల్యత * రుతుక్రమంలో లోపాలు సైజ్ జీరోని సాధించడానికి చాలా పద్ధతులున్నాయి. కానీ, ఆరోగ్యవంతమైన పద్ధతులు చాలా తక్కువ. మగవాళ్లు సిక్స్ ప్యాక్‌కు కష్టపడినట్టు, అమ్మాయిలు కూడా జీరో సైజుకి అంతే కష్టపడాలి. ప్రత్యేకమైన డైట్లు, రోజువారీ ఎక్సర్‌సైజులు చేయాలి. ఇందుకు నెలల తరబడి టైం పడుతుంది. అయితే అందరికన్నా ముందు దీనిని సాధించాలని కొందరు పూర్తిగా ఆహారాన్ని మానేసి కాఫీలతో కాలం గడుపుతున్నారు. మరికొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటూ..జీరో సైజ్ యావలో లైఫ్‌ని జీరో చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే అతి నాజూకుతనం భారతీయ మగ కంటికి అంత ఇంపుగా అనిపించకపోవడంతో జీరో సైజ్‌ని ఎంచుకునేవారి సంఖ్య జీరోకి చేరుతోంది. అమ్మాయిలైనా అతిగా ఉన్న కొవ్వును కరిగించుకోవాలే కానీ లేనిదాని కోసం ఆరాటపడటం మంచిది కాదని గుర్తిస్తే మంచిది.

ఉల్లిపాయతో అండాశయ క్యాన్సర్‌కు చెక్   అండాశయ క్యాన్సర్! ఏటా లక్షకు పైగా స్త్రీల ప్రాణాలను హరించే మాయదారి. అతి ప్రాణాంతకరమైన క్యాన్సర్లలో ఇదీ ఒకటి. దీని బారినవారిలో 40 శాతం మంది మాత్రమే ఐదేళ్లకు మించి జీవితాన్ని చూడగలుగుతారు. కానీ ఇలాంటి ఉపద్రవానికి ఉల్లిపాయలు నివారణగా నిలిచే అవకాశం ఉందని తేలడం అద్భుతమే కదా! ఆ అద్భుతం నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.   భయపెట్టే గణాంకాలు: స్త్రీలలో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కేవలం ఒక్క శాతమే ఉంటుంది. కానీ వంశంలో కనుక ఈ వ్యాధి ఉంటే, ఆ ఒక్క శాతం అవకాశం కాస్తా 40 శాతంగా మారిపోతుంది. ఇక ఊబకాయం, సంతానలేమి, హార్మోన్ థెరపీ వంటి మరికొన్ని కారణాల వల్ల కూడా ఈ క్యాన్సర్ దాడి చేసే ప్రమాదం ఏర్పడుతుంది. అండాశయ క్యాన్సర్తో వచ్చే లక్షణాలని ఏదో రుతుసంబంధమైన ఇబ్బందులుగా భావించి నిర్లక్ష్యం చేసే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా ఆదిలోనే తుంచగలిగే ఈ వ్యాధి ముదిరిపోతుంది. అప్పటివరకూ అండాశయానికి మాత్రమే పరిమితమై ఉన్న క్యాన్సర్ కణాలు శరీరంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తాయి. పైగా ఒకసారి ఈ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నాక 80 శాతం మందిలో ఇది మళ్లీ తిరగబెట్టే ప్రమాదం లేకపోలేదు. వైద్య సదుపాయాలు అరకొరగా ఉండే మనలాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరెంత ప్రాణాంతకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.   ఉల్లిపాయ వైద్యం: జపానుకి చెందిన కుమనోటో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఉల్లిపాయలో ఉండే ‘Ononion A’ (ONA) అనే రసాయనాన్ని ఎలుకల మీద ప్రయోగించారు. వీరి ప్రయోగంలో అండాశయ క్యాన్సర్ని నివారించడంలో ఈ ONA అనేకరకాలుగా తోడ్పడుతుందని తేలింది. - మన శరీరంలోని macrophages అనే రక్షణ వ్యవస్థ క్యాన్సర్ కణాల మీద దాడి చేస్తుంది. ఈ దాడిలో క్యాన్సర్ కణాలది పైచేయిగా మారినప్పుడు అవి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం మొదలుపెడతాయి. కానీ ONA అనే రసాయనం శరీరంలోకి చేరిన తరువాత క్యాన్సర్ కణాల వృద్ధి గణనీయంగా తగ్గిపోయినట్లు తేలింది. - ఒకవైపు క్యాన్సర్ కణాలు మన శరీర రక్షణ వ్యవస్థ మీద దాడి సాగిస్తుండగానే, MDSC అనే కణాలు కూడా వాటికి తోడై మన రక్షణ వ్యవస్థని బలహీనపరుస్తాయి. ONA రసాయనంతో ఈ MDSC కణాలు నిర్వీర్యం కావడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. - ఉల్లిపాయలోని ఈ ONA శరీరాన్ని లోలోపల్నుంచే రక్షించడమే కాకుండా, క్యాన్సర్తో పోరాడేందుకు వాడుతున్న మందులు మరింత ప్రభావవంతంగా పనిచేయడంలో తోడ్పడ్డాయట. - అప్పటివరకూ అండాశయానికి పరిమితమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకు సోకకుండా కూడా ONA అడ్డుకోవడాన్ని గమనించారు.   కొత్త ఆశలు: ఇప్పటివరకూ అండాశయ క్యాన్సర్ వస్తే దాని నివారించడం కష్టమన్న అభిప్రాయం ఉండేది. ఈ భయంతోనే కొందరు ముందుగానే అండాశయాన్ని తొలగించుకుని ఇతరత్రా ఆరోగ్య సమస్యలను భరిస్తున్నారు. కానీ ఈ తాజా పరిశోధనతో అండాశయ క్యాన్సర్ను ఖచ్చితంగా నివారించవచ్చన్న ఆశలు మొదలయ్యాయి. ఈ ONA రసాయనం వల్ల ఉపయోగం ఉందంటూ అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యలోకం అంగీకరిస్తే కనుక ONAతో కూడిన మందులు త్వరలోనే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.   - నిర్జర.

Power Foods for the Brain     Powerful foods for powerful brain. here some power foods for the brain increase your mental ability and improve your memory and boost your brainpower.   Almonds : Those tiny little nuts are rich in antioxidants and also contain omega-3 fatty acids. Eating a few almonds everyday can be absolutely worth it Fish: If you are a non-vegetarian and love eating fish, you have some good news. Salmon, tuna and other fatty fish are considered to be rich in protein, calcium Eating fish aids the development of the brain. Eggs: Just as fish, eggs are a great source of omega-3 fatty acids which facilitate the brain cell development process. Including this high-in-protein, low fat and Vitamin E rich food in your daily diet will prove to be an excellent decision. Salad: Green leafy vegetables like lettuce, spinach and others like carrot, broccoli, and cabbage are an apt choice of food for your brain. These fibre-rich foods are rich in antioxidants like Vitamin C and E that protect the brain.  

ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం   ప్రపంచం లో మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారని  పలు నివేదికలు తెలియ చేస్తున్నాయి. ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారని పురాణాలు  చెపుతున్నాయి. ఏమైతే నేమి స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.ప్రతి ఏటా ప్రపంచంలో వివిద దేశాలలో సమూహాలు,దేశాలు ప్రపంచం సైతం స్త్రీ ఆరోగ్యం పై ఆలోచించాలి.స్త్రీ ఆరోగ్యం ఉత్సవాలను ప్ర్థిఏటా 2 4 మే నుండి 28మే వరకు నిర్వహించేందుకు.సమస్తలు సన్నద్ధం అవుతున్నాయి. వైద్య పరిశోదన రంగంలో నోబెల్ కు కృషి చేసిన మహిళలు , వైద్యం లోనూ, ఇటు సైన్యం లోనూ ,ఇంటిని చక్కదిద్దడం, సాంస్కృతిక రంగం లోనూ తమదైన ప్రతిభను ఆవిష్కరిస్తున్న మహిళలు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న ఆశా వర్కర్లు, రోగులను కంటికి రెప్పలా కాపాడే నర్సింగ్ సిబ్బంది  మహిళా ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుగు వన్ హెల్త్ అభినందనలు తెలుపు తోంది. అయితే ప్రపంచం లో మహిళలుఆరోగ్యంగా లేరని వారి అనారోగ్యానికి 10 ఆంశాలు కారణం అవుతున్నాయని అంటున్నారు. కొన్ని ఖాటోర వాస్తవాలు ఇవి... 1)పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని చాలా దేశాలలో అభిప్రాయం ఉంది. కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్నారని అయితే వీరి అనారోగ్య సమస్యకు కొన్ని సామాజిక సమస్యలు ఎదుర్కుంటున్నారని స్త్రీలు చాలా తక్కువ జీవన ప్రమాణాల తో జీవిస్తున్నారన్నది వాస్తవం.స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపడం వల్లే కొన్ని అనారోగ్య సమస్యలలో చిక్కుకుంటున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.స్త్రీ లపై శారీరక హింస లైంగిక వేదింపుల కు గురి అవుతున్నారని ముఖ్యంగా హెచ్ ఐవి  ఊపిరి తిత్తుల  సమస్యలు ఎదుర్కుంటున్నారు. 2)అభివృద్ధి చెందిన దేశాలలో చాలామంది యువతులు ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు గర్భం వచ్చినప్పుడు బిడ్డను ప్రసవించినప్పుడులేదా ఆ తరువాత మరణిస్తున్నారని గమనించ వచ్చు. అభి వృద్ధి చెందుతున్న చెందిన దేశాలలో పొగాకు వాడకం క్రమంగా పెరగడం గమనించ వచ్చు. పురుషుల కంటే మహిళలు పొగతాగే వారిసంఖ్య 10 రేట్లు పెరిగింది. స్త్రీలు మహిళలు యువతులే లక్ష్యంగా పొగాకు ఉత్పత్తుల \ప్రచారం జరగడం దురదృష్ట కరం.యుక్త వయస్సు నుంచే సిగరెట్ల వాడకం క్రమంగా  పెరుగు తోంది.ఈ వ్యసనం నుంచి మహిళలు లేదా యువతులు తగ్గించుకుని విజయం సాధించిన వారి సంఖ్య పెరుగు తోంది. నేకోటిన్ ప్రత్యామ్నాయ థెరఫీ  ప్రభావంతక్కువే అని నిపుణులు తేల్చారు. 3) కోరోనా ప్యాండమిక్ లో ఆఫ్రికాలోని మహిళలు హెచ్ ఐ వి బారిన పడిన వారు దాదాపు 61% కరేబియన్ మహిళలో వైరస్ బారిన పడ్డ వారు 4 3 % లాటిన్ అమెరిక, ఆశియా, తూర్పు యూరప్ లో క్రమంగా పెరుగుతున్నారు. మహిళలు స్త్రీల పై పెరుగు తున్న హింస అనారోగ్యానికి కారణం అవుతుందా  ప్రపంచంలో 15%నుండి 71% మహిళలు శరీరక దాడులు లైంగిక దాడులు పాల్పడు తున్నది వారి భాగ స్వాములే అని తేలింది. పురుషుల వల్లే ఆర్ధికంగా ,సామాజికంగా మహిళలు వేదనకు గురికావడం శారీరక హింస కు గురి కావడం వల్లే అనారోగ్యం పాలవు తున్నారని,  శరీరం పై గాయాలు అవాంఛిత గర్భం హెచ్ ఐ వి ఇతర సుఖ వ్యదులు దీర్ఘ కాలీక ఒత్తిడి కి గురి అవుతున్నారు .     4)ప్రపంచ వ్యాప్తంగా మహిళల పై ముఖ్యంగా 15 సంవత్సరాల వయస్సులో హింస కు గురి అవుతున్నారు. ప్రతి 5 గురు మహిళల్లో 1 క్కరికి లైంగిక వేదింపులకు గురి అవుతున్నారు. 5)ఇన్ని శతాబ్దాలు దాటినా అభివృద్ధి చెందిన దేశాలలో బాల్య వివాహాలు - కొట్టి పారేయలేం. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు బాలికలు  ఒక అంచనా ప్రకారం  8 సంవత్సరం పుట్టిన రోజుకు ముందే పెళ్లి చేసుకున్నట్లు  సమాచారం మరో 10 సంవాత్సరాల తరువాత వీటికి చైనా మీనాహింపు కాదు. ముఖ్యంగా బాలికలలో శారీరక అంశాల పై అవగాహన లేక పోవడం వల్లే హెచ్ ఐ వి వంటి రోగాల బారిన పడుతున్నారు. 6) అభివృద్ధి చెందు తున్న దేశాలలో చాలా మండి టీనేజీ యుక్త వయస్సులో ఉన్న  పిల్లలలో  14 మిలియన్లు ప్రతిసంవత్సరం ఉండవచ్చని అందులో 90% మండి తల్లులు అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండడం ఆవేదన కలిగిస్తోంది. 7) ప్రతిరోజూ 16 0 0 నుంచి 10,0 0 0 మండి మరణించిన వారిలో గర్భంలోనే చని పోవడం గమనించ వచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డలు 90 % గర్భిణీలు పురుడు పోసు కోకుండానే పురుడు పోసుకున్నాకో చనిపోతున్నారు. 8)పురుషుల కన్నా మహిళలు ఆదాయం సంపాదించే వారైతే వారు పంజరంలో ఇరుక్కు పోతున్నారు. గర్భ వతులైన మహిళల లో పిల్లలలో మాలేరియా బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. దోమల బారిన పడకుండా ఉండేందుకు రక్షణగా దోమ తెరను కొనేవారు తానే కాదు తన కుటుంబాన్ని సంరక్షించేందుకు మహిళలు మదన పడుతూనే ఉంటారు. 9)పురుషుల కంటే స్త్రీలలో 50 %ఊపిరి తిత్తుల సమస్యలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. చాలా దేశాలలో ఇప్పటికే మహిళలు వంటింటికే పరిమితం కావడం వల్ల వంటింట్లో వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల అనారోగ్యం వంటింటి   కాలుష్యం వల్లే ప్రపంచంలోని 1 /2 మిలియన్ స్త్రీలలో సంవత్సరానికి 1.3 మిలియన్ల మరణాలు కేవలం ఊపిరి తిత్తుల వ్యాధులతో మరణించారు. పురుషుల కంటే 12% మహిళలు వంటింటి కాలుష్యానికి బలై పోతున్నారు. 10) పురుషుల కంటే స్త్రీలు వినికిడి సమస్యలు బాధపడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలబారిన పడుతున్నారు. స్త్రీ ఆరోగ్యం విషయంలో విచక్షణ గమనించ వచ్చు. పురుషులతో పాటు సమానంగా ఆకాశంలో సగం అంతరిక్షంలో సగం అన్న పదాలు ఆచరణలో మాత్రం లో విచక్షణ చూపడం గమనించ వచ్చు. పురుషులతో పాటు సమానంగా కంటిసమస్య కు చికిత్స అందక పోవడం స్త్రీలలో శస్త్ర చికిత్స విషయంలో వివక్ష ఇలా అన్నిటా కోన సాగుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలలో ఉన్న దేశాలలో ఉన్న మహిళల ఆరోగ్యానికి చర్యలు తీసుకోడం అత్యవసరం.

మేలైన ఆరోగ్యానికి, దృఢత్వానికి సముద్రపు ఉప్పు     సముద్రపు ఉప్పుతో మేలైన లాభాలు. సముద్రపు ఉప్పుపై చాలామందిలో ఉన్న నమ్మకం ఏమిటి అంటే మామూలు ఉప్పుకన్నా సముద్రపు ఉప్పు మేలైనదని అంటారు. అయితే ఇది ఎంతకాలం వాడతారనేది చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు. సముద్రాలలో హానికర రసాయనాలు విడుదల చేస్తున్నారని లేదా ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల సంచులు, బాటిళ్లు విరివిగా ఉండడం వల్లే సముద్రపు నీరు విషతుల్యమవుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల సముద్రం నుంచి ఉప్పు తీయడం సురక్షితం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.   అసలు సముద్రపు ఉప్పును సంస్కృతంలో సైంధవ లవణమని, కళ్ళు ఉప్పు అని అనేవారని అంటారు. ముఖ్యగా ఆయుర్వేదంలో సైంధవ లవణాన్ని ఎక్కువగా వాడేవారని వైద్యులు తెలిపారు. సముద్రపు ఉప్పు వాడకం వల్ల ఆహారంలో రుచికి రుచి, అధిక పోషకాలు మినరల్స్ అందుతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు వాడుతున్న అయోడైజ్డ్‌ ఉప్పు హానికరమని తేల్చిచెప్పారు. ఈ ఉప్పు వాడకం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం వంటి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. సాధారణ సముద్రపు ఉప్పు కన్నా హిమాలయా రాక్ సాల్ట్ లో 84 రకాల మినరల్స్ ను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. హిమాలయా రాక్ సాల్ట్ లో ఎలక్ట్రో లైట్స్ తో పాటు కాల్షియం, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ లభిస్తుందని హిమాలయన్ పింక్ సాల్ట్ , ఇతర సహాజ ఉప్పులకన్నా మన అవయవాలలో హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హిమాలయా సాల్ట్ ను కొన్ని మిలియన్ సంవత్సరాలుగా వాడుతున్నట్లు నిపుణులు తమ పరిశోధనలో వెల్లడించారు. ఇప్పటికీ మార్కెట్ లో హిమాలయన్ ఉప్పుకు అదే డిమాండ్ ఉందని పేర్కొన్నారు. సముద్రం లో ఇంత కాలుష్యం చేరినా నాణ్యత ఏమాత్రం తగ్గలేదని నిపుణులు సర్వేలో వెల్లడించారు. హిమాలయన్ వైట్ సాల్ట్ గోల్డ్ లో 84 రకాల మినరల్స్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రకమైన ఉప్పును 250 మిలియన్ సంవత్సరాలుగా ఇంటెన్స్ టెక్టోనిక్ ప్రేషర్లో 0% వాతావరణంలో రసాయనాలు కాలుష్యం బారిన పడకుండా ఉన్న ఉప్పు హిమాలయన్ ఉప్పు మాత్రమే అని నిపుణులు విశ్లేషించారు. హిమాలయన్ ఉప్పు ఆకారంలో చాలా చిన్నదిగా ఉంటుందని సులభంగా కరిగి పోతుందని ఎంత వేడిలో అయినా హిమాలయన్ రాక్ సాల్ట్ ను నిల్వ ఉంచవచ్చని అంటున్నారు. ఆధునిక భారతదేశంలో ఇతర దేశాలలో కన్నా 3, 4 సార్లు ఎక్కువగా ఉప్పు వాడడం గమనించమని వివరించారు. మానవ శారీరానికి ఆరోగ్యానికి రాక్ సాల్ట్ మంచిదని పోషక విలువలు లేని ఉప్పు వాడడం వల్ల మెటబాలిజం సమస్యలు వస్తాయని శ్వాస సంబంధమైన సమస్యలు వస్తున్నాయని అన్నారు. శ్వాస సంబంధిత ఆసనాలు సాధన చేయడంద్వారా శ్వాస సమస్యలు నివారించవచ్చని సూచించారు. అయితే ఆశ్చర్య కరమైన పరిణామం ఏమిటి అంటే పూరి జగన్నాథ్ ఆలయంలో వండే వంటలలో ఉప్పు వాడకపోవడం గమనించవచ్చు. తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో సమీప ప్రాంతాలలో కూడా ప్రజలు పూర్తిగా ఉప్పు వాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కూడా వంటకాలలో ఉప్పుశాతం తక్కువే అని వివరించారు. హిమాలయన్ రాక్ సాల్ట్ ప్రతిరోజూ వాడటం వల్ల వంట రుచి, సువాసన, నాణ్యత మరింత పెంచుతుందని తేల్చిచెప్పారు. అందుకే అక్కడి ప్రజలు ఆరోగ్యంగా దృడంగా ఉంటారని పరిశోధనలో వివరించారు.

  కాబోయే తల్లి ఈ పరీక్షలు పాసవ్వాలి...   బిడ్డకు జన్మనివ్వడమంటే ఆడది మరో జన్మ ఎత్తడమే. బిడ్డ కడుపున పడిన నాటి నుండి కడుపు చీల్చుకుని ఈ భూమి మీద పడే వరకూ తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని, ఆరోగ్యంగా పుట్టాలని ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కేవలం జాగ్రత్తలు తీసుకుంటే చాలదు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఇవే అవి... - గర్భంతో ఉన్నప్పుడు బీపీ ఎక్కువ ఉంటే బిడ్డపై ప్రభావం పడుతుంది. తల్లికి కూడా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి. - అలాగే షుగర్ టెస్ట్. చక్కెర పాళ్లు ఎక్కువైతే ఉమ్మనీరు పెరుగుతుంది. బిడ్డ పరిమాణం కూడా పరిమితిని మించి పెరుగుతుంది. దానివల్ల నెలలు నిండకముందే పుట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే చనిపోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. - బ్లడ్ గ్రూప్ టెస్టు కూడా చేయించాలి. ఎందుకంటే తల్లిది నెగటివ్, తండ్రిది పాజిటివ్ అయ్యి... బిడ్డది కూడా నెగిటివ్ అయితే సమస్య ఉండదు. లేదా తల్లిదండ్రులది ఏ గ్రూప్ అయినా బిడ్డది పాజిటివ్ రీసస్ ఫ్యాక్టర్ అయినా ఫర్వాలేదు. కానీ తల్లిది నెగటివ్ అయ్యి, తండ్రిది పాజిటివ్ అయ్యి, బిడ్డది కూడా పాజిటివ్ అయితే మాత్రం పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ముందే బ్లడ్ గ్రూప్ ని పరీక్షిస్తే డాక్టర్లు ఒక ప్రత్యేక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా సమస్యలు రాకుండా చూస్తారు. - బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిలో థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా విడుదలవ్వాలి. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ తప్పనిసరి. - హెచ్ఐవీ పరీక్ష కూడా తప్పకుండా చేయించాలి. అలాగే హెపటైటిస్ టెస్ట్ కూడా. - అలాగే సిఫిలిస్ టెస్ట్ కూడా చేయాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది కూడా తప్పనిసరి. - తల్లికి యూటీఐ ఉందేమో అన్నది కూడా పరీక్షించాలి. ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్ల వల్ల బిడ్డ బరువు పెరగకపోవచ్చు. ముందుగానే డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. - తల్లిలో రక్తహీనత ఉన్నా బిడ్డ సరిగ్గా ఎదగదు. కాబట్టి రక్తహీనత నిర్థారిత పరీక్ష తప్పదు. ఇవి కాక బిడ్డలో జన్యుపరమైన సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోడానికి ఫీటల్ అనామలీ స్క్రీనింగ్ టెస్ట్ అనీ, న్యూకల్ ట్రాన్స్ ల్యుయెన్సీ టెస్ట్ అనీ... ఇలా కొన్ని రకాల వైద్య పరీక్షలు ఉన్నాయి. అవి కూడా చేయించుకోవడం మంచిది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా అమ్మతనంలోని కమ్మదనం రెట్టింపయ్యేది. దానికోసం ఈ మాత్రం కేర్ తీసుకోక తప్పదు మరి. - Sameera