పెడిక్యూర్ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి.. బ్యూటీ పార్లర్ అక్కర్లేదు..!

 


మగువలు శరీరంలో ప్రతి భాగం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వెంట్రుకల నుండి పాదాల వరకు ప్రతీదీ వారి సౌందర్య సంరక్షణలో భాగమే.. ముఖ్యంగా పాదాలు చాలా తొందరగా ప్రభావానికి గురవుతూ ఉంటాయి.దుమ్ము,ధూళి,  కాలుష్యం,  ఎక్కువ తేమ తగలడం వంటి కారణాల వల్ల పాదాలు పగలడం,  గరుకుగా మారడం,  కళ కోల్పోవడం,  పాదాల చర్మం పొట్టులాగా లేవడం వంటివి జరుగుతూ ఉంటాయి.  ఈ కారణంగానే చాలామంది బ్యూటీ పార్లర్ కు వెళ్లి పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు. కానీ కేవలం నిమ్మకాయ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చు.  


కావసిన పదార్థాలు..


ఇంట్లోనే పెడిక్యూర్ చేయడానికి  2, 3 నిమ్మ తొక్కలు


1 షాంపూ సాచెట్


ఆముదం


బేబీ ఆయిల్


బేకింగ్ సోడా అవసరం అవుతాయి.

పెడిక్యూర్ పేస్ట్..


1 గ్లాసు నీటిని వేడి చేయాలి. మరుగుతున్న  నీటిలో  నిమ్మ తొక్కలు వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఒక పెద్ద పాత్రలో వేసి ఎక్కువ నీరు కలపాలి.  దీనివల్ల పాదాలకు సరిపడినంత నీరు సమకూరుతుంది.  ఇప్పుడు ఉడకబెట్టిన నిమ్మతొక్కకు  స్క్రబ్‌ మిశ్రమం వేసుకుని పాదాలను బాగా రబ్  చేసుకోవాలి. దీని తరువాత, నిమ్మ  తొక్కతో గోర్లు,  ముఖ్యంగా గోర్ల  మూలలను శుభ్రం చేయాలి. తర్వాత నీళ్లతో పాదాలను శుభ్రంగా కడగాలి.

స్క్రబ్ ఎలా చేసుకోవాలంటే..

ఒక గిన్నెలో 1 టీస్పూన్ బేబీ ఆయిల్, 1 టీస్పూన్ ఆముదం,  1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్టే ను పాదాలకు స్ర్కబ్ లాగా ఉపయోగించాలి.


                                    *రూపశ్రీ.