Ye Devi Varamo Neevu Serial: రాకీని తీసుకొచ్చిన శంకర్.. అంజలి ఏం చేయనుంది!
Nov 25, 2026 8:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -124 లో అందరు దీపావళి సెలబ్రేషన్స్ కి రెడీ అవుతారు. అందరూ ఉన్నారు రాకీ ఉంటే బాగుండు, మీరు వెళ్లి తీసుకొని రండీ అని బానుతో గీత అంటుంది. మన రోహిత్ ఉన్నాడు కదా వెళ్లి తీసుకొని వస్తాడని అంటాడు. ఒరేయ్ రోహిత్ నువ్వు వెళ్లి బావని తీసుకొని రా అని గీత అనగానే బావ ఇంటికి రావద్దని రోహిత్ అంటాడు. ఎందుకు రావద్దని గీత అడుగుతుంది. రోహిత్ డైవర్ట్ చేస్తాడు. నువ్వు ముందు వెళ్లి తీసుకొని రా అని గీత అనగానే రోహిత్ గుమ్మం దగ్గరికి వెళ్తాడు.
అంజలి అడ్డువచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్, వాడు ఇంటికి రావద్దని కోపంగా మాట్లాడుతుంది. తీరా వెనక్కి తిరిగి చూస్తే రాకీని తీసుకొని శంకర్ వస్తాడు. కమల వాళ్లకి హారతి ఇస్తుంది. రాకీ లోపలికి రాగానే నీకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిసి చాలా కంగారు పడ్డాను, నువ్వు ఇక హాస్టల్ కి వద్దు అని కమల అంటుంది. ఆ తర్వాత రాకీ రూమ్ కి అంజలి వెళ్తుంది. మళ్లీ ఎందుకు వచ్చావని అంజలి అడుగుతుంది. నువ్వు రేపు పొద్దున వరకు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆర్డర్ వేస్తుంది.
అంజలి వెళ్లాక నీకు ఎవరు భయపడతారు, మా నాన్నని అడ్డుపెట్టుకుని ఇక్కడే ఉంటానని రాకీ అనుకుంటాడు. మరోవైపు అంజలి రూమ్ లోకి భవిత వెళ్లి మనీష్ ఇచ్చిన చీర ఎక్కడ పెట్టిందోనని వెతుకుతుంది. తీరా చీర కనిపించగానే దాన్ని కత్తిరిస్తుంది భవిత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




