మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు
on Oct 17, 2024
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో పండు డైలాగ్స్ మాములుగా లేవు. ఈ మధ్య డాన్సర్ పండు జబర్దస్త్ స్కిట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక రాబోయే వారం షోలో వర్ష - పండు కలిసి స్కిట్ చేశారు. పండు స్టేజి మీదకు వర్షాతో పాడు తెగ సిగ్గుపడుతూ వచ్చాడు. "సర్ మేము మొగుడూపెళ్లాలం సర్" అన్నాడు శివాజితో. తర్వాత వర్ష వైపు చూస్తూ "మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తోంది నీకు" అంటూ సిగ్గుమొగ్గలవుతూ అక్కడేదో వాళ్ళ మధ్య జరగకూడనిది జరిగిపోయినట్టు బిల్డప్ ఇచ్చి మరీ అడిగాడు. "పెద్ద ఏమీ అనిపించడం లేదు" అన్నాడు. ఇక జడ్జ్ శివాజీ ఐతే "పండు సూపర్ గా ఉంది కానీ" అని ఎంకరేజ్ చేసాడు. తర్వాత వర్షని హగ్ చేసుకున్నాడు పండు గట్టిగా. దాంతో వర్ష ఒక్కసారిగా షాకయ్యింది. "బాధపడకు" అంటూ ఓదార్చబోయాడు.
"ఒరేయ్ నిన్ను డాన్సర్ అన్నారు కదరా..నువ్వెంటి ఇలా చేస్తున్నావ్" అని అడిగింది "వాళ్ళు ఇచ్చే రెండు మూడు వేలకు ఇక్కడికి వచ్చాననుకున్నావా ఇలాంటి కాన్ఫెరెన్సుల కోసం వచ్చాను" అని చెప్పేసరికి శివాజీ ఐతే చప్పట్లు కొట్టేసాడు. ఇక శివాజీని పొగిడేశారు కెవ్వు కార్తీక్ - పటాస్ ప్రవీణ్. "మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కి ఒక పేరు పెట్టా" అని కెవ్వు కార్తీక్ అన్నాడు. ఏమని అని పటాస్ ప్రవీణ్ అడిగేసరికి "శివాజీ" అని చెప్పాడు. "ఎందుకు ఆ పేరు పెట్టావ్ " అని అడిగాడు ప్రవీణ్ " నిస్వార్థంగా పది మందిని పైకి తీసుకొస్తుందిగా" అందుకే అన్నాడు కార్తీక్.