.webp)
బిగ్ బాస్ సీజన్ 9తో బాగా పాపులరైన వాళ్ళల్లో డెమోన్ పవన్ కూడా ఒక వ్యక్తి. రీసెంట్గా అతను తండ్రిని కోల్పోయాడు. అలాంటి డెమోన్ కూకు విత్ జాతి రత్నాలు షోకి వచ్చాడు. ఇక రీతూ చౌదరితో మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. రీసెంట్గా డెమోన్ తన స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టాడు. " నా ప్రియమైన వారందరికీ మీ ప్రేమకు మీ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటు న్నారు. నేను తప్పు చేయకపోయినా, వ్యతిరేకతను, ద్వేషాన్ని భరించాల్సి వస్తోంది. ఐనా కానీ మౌనంగా ఉంటున్నాను. కానీ అది నా వాళ్లను ఇబ్బంది పెట్టె పరిస్థితికి వస్తోంది. ఒక వేళ అలా జరిగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు అప్పుడు వాడిని తట్టుకోవడం చాలా కష్టం .చాలా మంది తెలియకుండానే తప్పులు చేస్తారు. తర్వాత తెలుసుకుని మారతారని నేనేప్పుడూ అనుకుంటాను. అందుకే నేను అలాంటి వాళ్ళను క్షమించి, ప్రశాంతంగా ఉంటున్నాను.
నేను మంచోళ్ళకు మంచోడిని, చెడ్డోళ్లకు చెడ్డోడిని . మీరందరూ ఇక మీదట ఇవన్నీ ఆపేస్తారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను ఎప్పటికీ ఇలాగే ఉంటాను" అంటూ తనను ట్రోల్ చేసేవారికి, కామెంట్స్ చేసేవారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు డెమోన్ పవన్. అలాగే స్టేటస్లో పెట్టిన మరో పోస్ట్ చూస్తే వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో వాళ్ళ అమ్మ తనతో పాటు ఉండటానికి తన ఇంటికి హైదరాబాద్ వచ్చేసిందని చెప్పాడు.






