Home

»

Tv News

మా ఫస్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి థాంక్యూ

Aug 1, 2026 2:44PM

బుల్లితెర మీద అమూల్య గౌడ - నిరంజన్ జోడి బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. ఇక రీసెంట్ గా వీళ్ళు ఒక లైవ్ వీడియో కూడా చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టింది అమూల్య.  " మా ఫస్ట్  వీడియో 10 లక్షలకు పైగా వ్యూస్ ని సంపాదించుకుంది. మాకు చాలా ఆనందంగా ఉంది.

"మీ ప్రేమ, సపోర్ట్ కి చాలా హ్యాపీగా ఉంది.  మీ అందరి వలన ఈ విజయం సాధించాను.  దయచేసి మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ, మీ ప్రేమను మాపై కురిపిస్తూ ఉండండి. అలాగే, మేము అఫీషియల్ గా  మా ఛానెల్ పేరును 'అమూల్య నిరంజన్ యూట్యూబ్ ఛానెల్'గా మార్చాము! త్వరలో మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తో మిమ్మల్ని అలరిస్తాం.   కాబట్టి మా  యూట్యూబ్ ఛానెల్ ని  సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మాతో కలిసి మా ప్రయాణంలో భగంపంచుకోండి" అంటూ అమూల్య ఒక నోట్ పెట్టింది. దాంతో నెటిజన్స్ చాలామంది రియాక్ట్ అయ్యారు.

"కంగ్రాట్యులేషన్స్  .. మీ నుంచి మరిన్ని వీడియోస్ రావాలని కోరుకుంటున్నాం. కొత్త ఛానెల్ కి శుభారంభం. మీరు చాలా బాగున్నారు మేడం. ఎప్పుడూ మీకు సపోర్ట్ చేస్తాం. మా అభిమాన జోడి మీరు... పెళ్లి డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదేంటి... మీ ఇద్దరికీ శుభాకాంక్షలు" అంటూ వాళ్ళను విష్ చేస్తున్నారు. ఇంకొంతమంది రెడ్ హార్ట్ ఎమోజిస్ తో వాళ్ళ అభిమానాన్ని పంచుకున్నారు. ఇక ఈ జోడి మా బోనాల జాతర షోలో కూడా త్వరలో కనిపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు.
------------- 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com