మణికంఠకు రాడ్ దింపిన టేస్టీ తేజ!
on Oct 8, 2024
మిమ్మల్ని అందరిని అడుగుతున్నా.. అదే మిమ్మల్నే అడుగుతున్నా.. మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవా.. అలా ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చేయి లేపండి.. ఇలా మాట్లాడింది టేస్టీ తేజ.
బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత మొదటి నామినేషన్ జరిగింది. ఇక ఇందులో యష్మీకి అత్యదిక నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాతి పృథ్వీ, విష్ణుప్రియ, కిర్రాక్ సీతలకి నామినేషన్లు పడ్డాయి. కిర్రాక్ సీతని క్రైయింగ్ బేబీ అంటు నయని పావని చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యాయి. అయితే మణికంఠని ఎవరు నామినేషన్ చేయరు అని అనుకున్నారంతా కానీ టేస్టీ తేజ అతడిని నామినేట్ చేసి పాత కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చాడు. నాకు అవకాశం ఇస్తే 8 మందిని నామినేట్ చేసేస్తా బిగ్‌బాస్.. ఎందుకంటే పొద్దున్నే పాట పెట్టగానే మీరంతా డ్యాన్స్ వేయడం లేదబ్బా.. డ్యాన్స్‌లు వేసేటప్పుడు కుక్కల సౌండ్ పెట్టాడు బిగ్‌బాస్.. అది ఈ సీజన్లోనే ఫస్ట్ టైమ్ జరిగింది.. అది నేనెప్పుడు చూడలేదు.. ఇంత బాడీ పెట్టుకొని నేనే డ్యాన్స్ చేస్తున్నా.. మీకేమైంది.. రేపు మార్నింగ్ నుంచి కలిసి డ్యాన్స్ చేద్దాం.. మీ అందరికీ నేను నేర్పిస్తా డ్యాన్స్.. అంటూ తేజ అన్నాడు.
మొదటగా కిర్రాక్ సీతని నామినేట్ చేసిన టేస్టీ తేజ.. తన సెకెంఢ్ నామినేషన్ గా మణికంఠని నామినేషన్ చేశాడు. ఇందులో తేజ ఏం చెప్పాడంటే.. ప్రాబ్లమ్స్ లేనివాళ్లు ఎవరూ లేరబ్బా.. అందరికీ ఉన్నాయి.. అయితే ఒకసారి ప్రాబ్లమ్ ఉందని చెప్పినప్పుడు.. పాపం అని అర్థం చేసుకుంటారు.. కానీ మాటిమాటికీ అదే చెబితే ఏందిరా వీడు అనిపిస్తుంది.. సీరియస్లీ నువ్వు గుడ్ గేమర్ నీ అభిప్రాయం ప్రకారం.. కానీ నువ్వు ఆ ఏడపు మాత్రం మానేయాలి.. నీకు తెలీకుండానే అలా అయిపోతున్నావంటే మాత్రం మార్చుకో.. లేదు నువ్వు కావాలనే చేస్తున్నావంటే ఓకే.. నువ్వు గుడ్ గేమర్ అని చెప్పేస్తానంటూ తేజ అన్నాడు. కన్ఫెషన్ రూమ్‌లో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ విషయంలో యష్మీ నీకు ఇవ్వలేదని నువ్వు చాలా బాధపడ్డావ్. ఆ తర్వాత నువ్వు కూడా యష్మీ కోసం తీసుకురాలేదు.. అప్పుడు యష్మీ నీకంటే వెయ్యి రెట్లు బాధపడింది.. నువ్వు యష్మీకి ఇచ్చేస్తే బావున్ను అనిపించింది.. అంటూ తేజ అన్నాడు. దీనికి మణికంఠ సమాధానమిస్తూ నేను లోపలికి వెళ్లేటప్పుడు యష్మీ నాకు చెప్పింది. నాది తీసుకురాకపోయినా ఫర్లేదు అన్నట్లుగా అంటూ మణి అన్నాడు. దీనికి వెంటనే యష్మీ దూరిపోయి నేను అలా అనలేదు.. నీకు నచ్చినట్లు చెయ్ అని చెప్పానంటూ యష్మీ అంది.
Also Read