బోనాల జాతర... బాల్స్‌తో రష్మీ బూతులు లోడింగ్
on Jul 8, 2024
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో థీమ్ బోనాల పండగ. ఇక బోనాల పండగ స్పెషల్ అంటే చెప్పక్కర్లేదు. సెట్ మొత్తం ఒక డివోషనల్ వైబ్ వచ్చేసింది. ఇంత స్మూత్ గా వెళ్తున్న ప్రోగ్రాంలో బాబోయ్ బూతులు దొర్లేస్తే ఎలా ఉంటుంది. పడీ పడీ నవ్వుకోవాలో..నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని లోపల్లోపల నవ్వుకోవాలో అర్ధం కాదు. ఇప్పుడు అలాగే జరిగింది. రష్మీ తెలుగు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సగం కామెడీ, సగం బూతు ఉంటుంది. పాదాలకు అర్థాలు తెలియకుండా ఫ్లోలో మాట్లాడేస్తుంది రష్మీ...అర్ధం చేసుకున్నామో బూతద్దాలు అక్కర్లేకుండా బూతులు ఏరుకోవచ్చు. ఈ షోలో కూడా అలాంటి బూతులు మాట్లాడేసింది రష్మీ.
ఈ షోలో ఒక గేమ్ కాన్సెప్ట్ పెట్టారు. బాస్కెట్ లో బాల్స్ వేయాలి. ఈ గేమ్ ని నాటి నరేష్, నూకరాజు, ఆటో రాంప్రసాద్ ఆడుతున్నారు. ఐతే నూకరాజు బాల్స్ తీసేసి ఆట పట్టిస్తున్నాడు. ఆ విషయాన్ని ఇంద్రజ చూసి ఆ బాల్ ని ఆ బాస్కెట్ లోంచి షిఫ్ట్ చేసి అటెందుకు పెట్టారని అడిగింది. అది రష్మీకి వేరేలా వినబడినట్టు ఉంది. "వాడి బాల్స్ నువ్వు తియ్యడమేంటి" అని నూకరాజును కసిరింది రష్మీ. ఆ మాటకు స్టేజి మొత్తం దద్దరిల్లిపోయేలా నవ్వింది ఇంద్రజ. ఆమె నవ్వుకు నూకరాజు షాకై చూస్తుండిపోయాడు.