యష్మీ బాగోతం బయటపెట్టిన రోహిణి.. విష్ణుప్రియపై గంగవ్వ షాకింగ్ కామెంట్లు!
on Oct 9, 2024
బిగ్ బాస్ హౌస్ లో మొన్నటి నుండి సాగుతున్న నామినేషన్లు నిన్నటి ఎపిసోడ్ తో ముగిసాయి. ఇక ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. పృథ్వీ, యష్మీ, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, గంగవ్వ, మెహబూబ్ నామినేషన్ లో ఉన్నారు. అయితే వీరి నామినేషన్ లో రోహిణి, గంగవ్వ చేసిన నామినేషన్ లో హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ గా అనిపించాయి. అవేంటో ఓసారి చూసేద్దాం.
మొదటగా యష్మీని నామినేట్ చేసింది రోహిణి. తన నామినేషన్ రీజన్ చెప్తూ.. నబీల్-పృథ్వీ మెగా చీఫ్ టాస్క్ ఆడినప్పుడు ప్రేరణ సంచాలక్‌గా ఉంది.. తను సంచాలక్‌గా పర్ఫెక్ట్గా చేసింది.. కానీ నువ్వు తను సరిగా చేయలేదంటూ చెప్పావ్.. అది నాకు నచ్చలేదంటూ రోహిణి చెప్పింది. నేను తను తప్పు చేసింది అని చెప్పలేదంటూ యష్మీ అనగానే తప్పు చేసిందని చెప్పలేదు కానీ నువ్వే తప్పు చేయమని చెప్పావ్ .. సంచాలక్‌గా ఉన్నప్పుడు తను ఎందుకు హెల్ప్ చేస్తుందంటూ రోహిణి అంది. సంచాలక్‌గా తను నా ఫ్రెండ్‌కి హెల్ప్ చేయలేదనే కారణంతో నా ఫ్రస్ట్రేషన్ బయటికొచ్చేసింది.. ఒక స్పేస్ వల్ల ఓడిపోయాడని నాకు అనిపించింది.. పృథ్వీ చాలా కష్టపడ్డాడంటూ యష్మీ అంది. అంటే నబీల్ ఏమైనా కాళ్లు చాపి కూర్చున్నాడా.. ఆయన కూడా కష్టపడ్డాడు కదా అని ఇచ్చిపడేసింది రోహిణి. దాంతో హౌస్ లోని వైల్డ్ కార్డ్స్ అంతా పగలబడి నవ్వేశారు. ఇక దానిని సపోర్ట్ చేసుకుంటూ యష్మీ కవర్ చేసింది. అవును నబీల్ గేమ్ కూడా నేను చూశా.. నేను ఏడ్చిన దానికి రీజన్ అంత ఫైట్ చేసి దొరకలేదని ఏడ్చా.. అంతే అంటూ యష్మీ కవర్ చేసుకుంది. మరి నువ్వేమన్నావ్.. నువ్వు గెలవడం తనకి (ప్రేరణ) ఇష్టం లేదేమో అని పృథ్వీతో అన్నావ్ కదా అంటూ మరో ఫిట్టింగ్ పెట్టింది రోహిణి. అంటే నాకు అనిపించింది నేను చెప్తా..మైక్ ఎందుకిచ్చారు మాట్లాడటానికే.. అన్ని పాజిబిలిటీస్ నేను చెప్పా.. నాకు అనిపించింది నేను మాట్లాడాను అంటూ యష్మీ అంది. ఆ తర్వాత తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేసింది రోహిణి. మొదటి వారం చూసినప్పుడు విష్ణు బాగా ఆడుతుందనే ఫీలింగ్ కలిగింది.. కానీ ఆ రేంజ్ నుంచి తర్వాత కిందకి పడిపోయావ్.. నీ కాన్సట్రేషన్ వేరే చోట ఉంది.. నువ్వు రియల్‌గా ఉండు.. కానీ దాని అర్థం టాస్కులన్నీ ఆడి.. ప్రతి దాంట్లో ఎంజాయ్మెంట్ వెతుక్కోమంటూ రోహిణి చెప్పింది.
మొదటగా విష్ణుప్రియను నామినేట్ చేసింది గంగవ్వ. నువ్వు గేమ్ ఆడట్లేదు.. నీకు కాళ్లు చేతులు సక్కగా లేవా.. ఉన్నా మరెందుకు ఆడట్లే.. ఉత్తిగనే కూసుంటున్నావంటూ గంగవ్వ అంది. అలా లేదు అవ్వ నాకు వచ్చిన దాంట్లో నేను దూకి బాగా ఆడతా.. అయినా ఇది పర్సనాలిటీ షో కాబట్టి నా బిహేవియర్, నా ఆలోచనలు అన్నీ బయటికి చెబుతున్నా.. నా దృష్టిలో అదే నా ఆట.. ఇక రేపటి నుంచి నా అల్లరి చూస్తావంటూ విష్ణుప్రియ అంది. ఇక తన రెండో నామినేషన్ గా యష్మీని చేసింది గంగవ్వ. మీరు ఎనిమిది మంది ఉన్నారు.. మేము ఎనిమిది మందిమి ఉన్నాం.. వచ్చినప్పటి నుంచి మీరు మాతో మాట్లాడనేలేదు.. మీ రూమ్‌కి వచ్చినా మీరు కేర్ చేయలేదు.. మేము ఉత్తగానే రాలేదుగా.. అలానే మీరే పాలు తాగుతున్నారు.. మమ్మల్ని ఎండబెట్టినారు.. అందుకే మిమ్ముల్ని నామినేట్ చేస్తున్నానంటూ గంగవ్వ చెప్పింది. అయితే గంగవ్వ తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన మాటలు యష్మీకి అర్థం కాలేదు. దీంతో వేరే వాళ్లు మళ్లీ చెప్పాల్సి వచ్చింది. అంటే ఫుడ్ డిసెషన్ నా చేతుల్లో లేదు.. మా చీఫ్ ఇవ్వద్దన్నారు అందుకే ఇవ్వలే.. ఇక మిమ్మల్ని వెల్కమ్ చేయలేదంటే సారీ.. ఇకనుండి రోజూ మీతోనే మాట్లాడతా.. నాకు వచ్చిన చాక్లెట్ కూడా షేర్ చేసుకుంటానంటూ యష్మీ అంది.
Also Read