రోజమ్మ నాకు అన్నం పెట్టింది..ఆమెను అనడానికి నోరెలా వస్తుందో ?
on Oct 21, 2024
కెసిఆర్ కేశవ చంద్ర రామావత్ మూవీ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ కి రాకింగ్ రాకేష్ వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. అలాగే రోజా గురించి కూడా ఎన్నో కామెంట్స్ చేసాడు. జబర్దస్త్ ఆర్పి ఈమధ్య కాలంలో చూస్తే గనక రోజా మీద ఎంతలా ఫైర్ అవుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు రాకేష్ కూడా ఆమె గురించి మాట్లాడాడు. "ఎన్నికల సమయంలో రోజా గారికి సపోర్ట్ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ మూవీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా" అని అడిగిన ప్రశ్నకు రాకింగ్ రాకేష్ ఇలా చెప్పాడు.."పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకండీ. నేనేమి పెద్ద హీరోని కాదు.
అందరి దగ్గరకు వెళ్లి నా సినిమా చూడమని అడుగుతాను అంతే. నా మూవీకి ఏ పార్టీకి సంబంధం లేదు. ఇక రోజా గారు అంటే..నాకు కూతురు పుట్టినప్పుడు ముందు రోజా గారే వచ్చి చూసారు. నా ఇంటికి వచ్చేటప్పుడు గడప బయటే రాజకీయాలు వదిలేసి వచ్చి ఇంటికొచ్చి నార్మల్ గా మాట్లాడతారు. గడప దాటి ఇంట్లోకి రాగానే మా అమ్మ..రోజమ్మ. ఆమె జడ్జ్..నాకు అన్నం పెట్టింది. డబ్బులు అడిగితే ఇచ్చింది. కొంతమందిని అధికారికంగా అడిగి డబ్బులు తీసుకునే చనువు ఉన్నవారిలో రోజమ్మ ఒకరు. అడగకుండా కూడా డబ్బు తీసుకోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజమ్మ..ఇంత చేసాక కూడా ఆమెను అనడం ఎంతవరకు కరెక్ట్...ఎవరెవరో ఏదో అంటారు..లబ్ది పొందినా కూడా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం..." అన్నాడు రాకేష్.
Also Read