Home

»

Tv News

Illu illalu pillalu : ఆస్తి వాటాపై సాగర్ కుట్ర.. ధీరజ్ బిజినెస్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

Apr 30, 2026

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -458 లో... వల్లి ప్రెగ్నెంట్ అని రామరాజు పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఇంటికి పెద్ద కూతురు కామాక్షి మొదటగా ఆశీర్వదిస్తే మంచిది అని రామరాజు అంటాడు కానీ కట్నం ఇవ్వలేదని కామాక్షి మెట్లపై కూర్చొని ఏడుస్తుంది. దాంతో రామరాజు తన మెడలో చైన్ తీసి కామాక్షికి ఇస్తాడు. దాంతో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. వల్లికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత సాగర్ ని తన మావయ్య శ్రీనివాసరావు పక్కకి తీసుకొని వెళ్లి అమ్మాయి నగలు ఇంకా తీసుకొని రాలేదా అని అడుగుతాడు. అంత డబ్బులు ఇప్పుడు లేవు అని సాగర్ అంటాడు. ఆస్తిలో నీ వాటా అడుగు.. అంతకు మించి వేరే మార్గం లేదని శ్రీనివాసరావు అంటాడు. అప్పుడే నర్మద వచ్చి అందరు అక్కడుంటే మీరు ఇక్కడ ఉన్నారని అడుగుతుంది. ఏం లేదని సాగర్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత వల్లిని అందరు ఆశీర్వదిస్తారు.

అమ్మాయిని కనమని రామరాజు అబ్బాయిని కనమని వేదవతి అంటారు. ఇద్దరు ఎందుకు గొడవపడతారు.. కవలలని కంటుందని వేదవతి వాళ్ళ అమ్మ శారదాంబ అంటుంది. లేని కడుపుకి ఇంత చేస్తున్నారు.. నేను నిజం చెప్తానని భాగ్యంతో ఆనందరావు అంటాడు. భాగ్యం నిజం చెప్పకుండా అతన్ని ఆపుతుంది. రేయ్ ధీరజ్ నువ్వు ట్రావెల్స్ పెట్టడానికి లోన్ కోసం షూరిటి గా ఉండమని కామాక్షి భర్తని అడగొచ్చు కదా.. ఆ అన్నయ్య తప్పకుండా హెల్ప్ చేస్తాడని ప్రేమ అంటుంది. వద్దు అని ధీరజ్ అంటాడు. అయిన ప్రేమ వెళ్లి అడుగుతుంది దానిదేం ఉంది సంతకం పెడతాను కానీ కామాక్షిని ఇటువైపు రాకుండా చూసుకోండి అని అతను అంటాడు.

 ఆ మాటలన్ని భాగ్యం వింటుంది. ఆ తర్వాత పార్టీలో అందరు కలిసి డాన్స్ చేస్తారు. మరొకవైపు మందు కావాలని తిరుపతి దగ్గరికి ఆనందరావు వెళ్తాడు. ఆనందరావు ఫుల్ గా డ్రింక్ చేస్తాడు. ఆ తర్వాత ధీరజ్ తన బావని తీసుకొని గదిలోకి వెళ్తాడు. డాక్యుమెంట్స్ అన్ని అతనికి ఇచ్చి సంతకం పెట్టమంటాడు. మరొకవైపు వల్లి డ్యాన్స్ చేస్తుంటే నువ్వు ఇప్పుడు వట్టి మనిషివి కాదని రామరాజు, వేదవతి తనపై కోప్పడతారు. అప్పుడే ఆనందరావు ఫుల్ డ్రింక్ చేసి నిజం చెప్పాలని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com