
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో అందరినీ ఎంటర్టైన్ చేసింది. పరివార్ అవార్డు సక్సెస్ పార్టీ పేరుతో ఈ ఎపిసోడ్ వచ్చింది. ఇక బాలుకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది శ్రీముఖి. వోటింగ్ క్యాటిగరీలో పాపులర్ హీరో అవార్డు గెలుచున్నాడు బాలు.
అలా వోట్ చేసినా కొంతమంది పరివారం షోకి వచ్చారు. "నాకేం జెలెస్ అనిపించట్లేదు వాళ్ళ వోటింగ్ వల్లనే ఆయన పాపులర్ హీరో అయ్యాడు " అని చెప్పింది శ్రీముఖి. "హలో బాలు అన్న మీ స్మైల్ చాలా బాగుంటుంది " అని ఒక లేడీ ఫ్యాన్ చెప్పింది. ఇంకో ఫ్యాన్ ఐతే "శ్రీముఖి అక్కతో మీ జోడి సూపర్ గ ఉంటుంది." ఆ మాటకు హరి "అమ్మగారు ఇక 2026 లో మీ పెళ్లి. మీ ఇద్దరో పెళ్లి బట్టల్లో అలా నడుచుకుంటూ ఉదయపూర్లో అమ్మో " అన్నాడు తరువాత దీపికా లేచి "తెలుగు ఇండస్ట్రీ ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఎప్పుడెప్పుడా అని అడిగారు. ఇక ఇప్పటి నుంచి బాలు - శ్రీముఖి పెళ్లి ఎప్పుడెప్పుడు అని అడుగుతారు " అంది. తరువాత మరో ఫ్యాన్ "బాలు అన్న మీరు నేసిన చీర శ్రీముఖి అక్క కట్టుకుని మీరు పంచె కట్టుకుని వస్తే చూడాలని మా ఫాన్స్ అందరి కోరిక" అంది.
"త్వరలోనే బాలు నేసిన చీరను నేను వేసుకుంటాను " అని చెప్పింది శ్రీముఖి. ఇంకో ఫ్యాన్ ఐతే "మా అమ్మ మీకు చాల పెద్ద ఫ్యాన్ . శ్రీముఖి - బాలు కలిసుండేలా గుండె నిండా గుడిగంటలు పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నా. " అంది. "అమ్మా వాళ్ళేదో సరదాగా అన్నారు. సీరియల్ చేసుకుంటూ కూర్చుంటారా ఏంటి " అని హరి ఫైర్ అయ్యాడు. "అక్క ఎం చేసినా బాగుంటుంది. బాలు - శ్రీముఖి ఒక్క చోట ఉంటే అది నెక్స్ట్ లెవెల్ షో " అంది. ఇక శ్రీముఖి వెంటనే "ఇప్పుడు పరివారంతో నేనొక్కదాన్నే యాంకర్ కదా త్వరలో నాకు బాలు కో - హోస్ట్ గా ఉంటే ఎలా ఉంటుంది " అని అడిగింది. "అది బాలుని అవ్వాలి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి యాంకర్ కపుల్ గా మీరు కూడా వెళ్తే బాగుంటుంది" అంది ఇంకో లేడీ ఫ్యాన్. ఇలా లేడీ ఫాన్స్ అంత కలిసి బాలుని - శ్రీముఖిని హగ్ చేసుకున్నారు. తర్వాత బాలు వాళ్లకు టీ షర్ట్స్ ఇచ్చాడు. బాలు - శ్రీముఖి కలిసి దాని మీద వాళ సిగ్నేచర్ చేశారు.




.webp)
.webp)
