ఆ లిప్స్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది.. శ్రీ సత్య ఫాన్స్ హర్ట్
on Jul 4, 2024
బిగ్ బాస్ శ్రీ సత్య అంటే సోషల్ మీడియాలో ఒక క్రేజ్ ఉంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మిస్ ఆంధ్రాగా గెలిచి ఎన్నో అవకాశాలు సొంతం చేసుకుంది. ఎన్నో యాడ్స్ లో కూడా నటించింది. 'నేను శైలజ' మూవీలో రామ్ గర్ల్ఫ్రెండ్గా కనిపించింది. ఐతే శ్రీసత్య సహజంగానే అందంగా ఉంటుంది. ఐతే ఇప్పుడు ఆమె ఫాన్స్ అంతా ఆమెను తిడుతున్నారు. ఎందుకంటే ఆమె ఐబ్రోస్ కి, లిప్స్ కి సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. సర్జరీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు అసలు బాలేదని అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ పెడుతున్నారు.
ఐతే శ్రీసత్య పై పెదం కొంచెం మధ్యలోకి ఒంగినట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లాట్ గా ఉండేసరికి ఆమె ఫేస్ లో ఆ మార్పు ఈజీగా కనిపించేస్తోంది. 'మంచిగా ఉన్న వాటిని పాడు చేసుకున్నావు', 'ఆ లిప్స్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది..ఎంత అందంగా ఉండేదానివి ఎందుకు ఇలా ఫిల్లర్స్ వేయించుకున్నావ్..ముందే బాగున్నావుగా ' అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. శ్రీ సత్య 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', వంటి సీరియల్స్ లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 6 లో ఫినాలే వీక్ వరకూ వచ్చి మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యింది. దీని తర్వాత ఆమె 'బీబీ జోడీ' 'సూపర్ జోడీ' డాన్స్ షోస్ లో కూడా చేసింది. ఏదేమైనా శ్రీ సత్య మాత్రం తన ఫాన్స్ ని హర్ట్ చేసింది.
Also Read