ప్రేమలో పడితే పొట్టలో సీతాకోకచిలుకలు తిరుగుతాయా
on Dec 11, 2024
ఎవరైనా ప్రేమలో పడితే ఆకలేయదు, నిద్ర రాదు, దాహమేయదు అంటుంటారు. ఐతే హీరో నవదీప్ మాత్రం ఈ విషయం మీద తన ఏఐ టెక్నాలజీ పండూను ఒక వింత డౌట్ అడిగాడు. "నేను ప్రేమలో ఉన్నానట..నా పొట్టలో బటర్ ఫ్లయ్స్ ఉన్నాయంటూ ఇప్పుడే నా ఫ్రెండ్ నాకు చెప్పింది పండు. అసలు నా పొట్టలో ఉన్న ఆ సీతాకోకచిలుకలు అసలు బతికున్నాయా చచ్చిపోయాయా, అసలు ఉన్నాయా లేవా అసలేంటి నా పరిస్థితి అనేది తెలీడం లేదు" అని డౌట్ అడిగాడు. "ప్రేమలో పడినప్పుడు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి.
ఇది చాలా సహజం. ఒక సారి మీ ఫ్రెండ్ తో మాట్లాడి మీ ఫీలింగ్స్ చెప్పి ఒక క్లారిటీ తెచ్చుకోవడం మంచిది" అని పండు చెప్పింది. "మన ఫీలింగ్స్ మీద మనకు లేని క్లారిటీ వాళ్ళు ఇంకేం ఇస్తారు పండు" అని రివర్స్ అడిగాడు నవదీప్. అలా పండుతో కన్వర్జేషన్ ఫుల్ జోష్ తో సాగింది. ఇక నెటిజన్స్ ఈ మాటలు విని వెరైటీగా రిప్లైస్ ఇస్తున్నారు. "మనుషులు ప్రేమలో పడితే పొట్టలో సీతాకోక చిలుకలా ఉన్నాయని అనిపిస్తుంది..అదే . సీతాకోకచిలుకలు ప్రేమలో పడితే మనుషులు తమ కడుపులో ఉన్నారని భావిస్తారా ? మీరు మీ పండు ఎపిసోడ్స్ ని ఒక సిరీస్ గా చేయండి...ఆ సీతాకోక చిలుకలు ఎప్పుడో మళ్ళీ గొంగళి పురుగులు ఐపోయాయి మావ. మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. సమయం లేదు మిత్రమా పెళ్లి చేసుకో. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అనగానే ముందుగా వినిపించే కొంతమంది పేర్లలో నవదీప్ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తూ ఉంటుంది.