నైనిక ఎలిమినేటెడ్.. ఇదే జరగబోతుంది!
on Oct 5, 2024
బిగ్ బాస్ సీజన్- 8 లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటికే ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వగా.. నైనిక ఎలిమినేషన్ అయిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మిడ్ వీక్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ ఇలా ట్విల మీద ట్విస్ట్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈ వారం మిడ్ వీక్ లో ఆదిత్య ఓం అర్థరాత్రి పంపించేశాడు. నామినేషన్లో ఈ వారం అరుగురు ఉండగా.. ఇప్పుడు అయిదుగురు అయ్యారు. ఇక శనివారం నాటి ప్రోమోలో ఆదిత్య ఓం ఎలిమినేషన్ కాలేదనే ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. ఓటింగ్ ఆర్డర్ ప్రకారం నైనిక లీస్ట్ లో ఉంది. మొదటి స్థానంలో నిఖిల్, రెండవ స్థానంలో నబీల్, విష్ణుప్రియ నాల్గవ స్థానంలో ఉంది. ఇక చివరగా మణికంఠ, నైనిక ఉండగా.. నైనికని ఎలిమినేషన్ చేశారంటు వార్తలొస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అయితే నైనిక ఈ వారం ఏం ఆడలేదు. గత రెండు వారాలుగా నైనికకి సంబంధించిన కంటెంట్ కూడా ఏం లేదు. అందుకే ఆడియన్స్ తక్కువ ఓటింగ్ చేసారని, దానివల్ల తను ఎలిమినేషన్ అయ్యిందనే స్పష్టంగా తెలుస్తుంది.
Also Read