TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Karthika Deepam2: డోనర్ కి ఇరవై అయిదు లక్షలు ఇచ్చిన జ్యోత్స్న.. సూరజ్ బ్రతుకుతాడా!

Nov 25, 2026 8:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-838లో.. సూరజ్‌కి రక్తం కావాలి అనడంతో ఓ డోనర్ వస్తాడు. నాది చాలా రేర్ గ్రూప్ రక్తం, కావాలి అంటే 25 లక్షలు కావాలని అతను అంటాడు. జ్యోత్స్న ఒక్కసారిగా గతంలో కార్తీక్‌తో దీపను కాపాడటానికి ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టడం గుర్తు చేసుకుని ఎంత తప్పు చేశానోనని బాధ పడుతుంది. ఇక డబ్బు ఇవ్వకపోతే రక్తం ఇవ్వనని డోనర్ అనడంతో.. వెంటనే జ్యోత్స్న తన అకౌంట్‌లో మాలిని వేసిన రెండు కోట్లు గుర్తు చేసుకుని డబ్బు ఇస్తానని చెక్ రాసి 25 లక్షలు ఇస్తుంది. దాంతో డోనర్ రక్తం ఇస్తాడు. ఆపరేషన్ మొదలు పెట్టాలని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న సంతకం పెడుతుంది.

మరోవైపు మాలిని మనిషి హాస్పిటల్‌కి వస్తాడు. జ్యోత్స్న పక్కనే కార్తీక్ ఉన్నాడు.. మరి జ్యోత్స్నను కాపాడింది ఎవరని అనుకుంటాడు. జ్యోత్స్నను కాపాడిన వ్యక్తి చచ్చిపోయాడన్నారు, అది ఎవరో చూడాలనుకుంటాడు. ఇంట్లోనే ఉంటూ మాలిని తన ఫోన్, దక్షిణామూర్తి ఫోన్ పక్కన పెట్టుకుని జ్యోత్స్నను నా మనిషి చంపేయగానే అనుమానంతో మీరు నాకు ఫోన్ చేస్తారని నాకు తెలుసు, అందుకే రెండు ఫోన్లు నా దగ్గర పెట్టుకున్నానని అనుకుంటుంది. ఇది మాలిని అత్త పనేమోనని అనిపిస్తుందని కార్తీక్ తో దీప అంటుంది. అత్త ఊరు వెళ్లే ముందు తన బాడీ గార్డ్‌తో మాట్లాడిందని చెప్తుంది. మాలిని అత్త అయి ఉండదు.. తను అయితే ఈ పాటికి వచ్చేస్తుంది కదా అని కార్తీక్ అంటాడు. సూరజ్‌కి ఏమైనా అయితే అని దీప అంటే ఏం అవ్వకూడదు, ఏమైనా అయితే ఆ మనిషి బతకదని ఏడుస్తున్న జ్యోత్స్నను చూపిస్తాడు.

సూరజ్‌కి ఆపరేషన్ అవుతూ ఉంటుంది. బాడీ గార్డ్ ఈ విషయం ఎలా అయినా మేడంకి చెప్పాలి.. నన్ను చంపేసినా పర్లేదు అని అనుకుంటాడు. మరోవైపు డాక్టర్ వచ్చి బులెట్ తీసేశాం.. కొంచెం మీద తగులుంటే గుండెకి తగిలేది.. 12 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం.. పేషెంట్ కళ్లు తెరిస్తే బతికేసినట్లే లేదంటే అతని మీద ఆశలు పెట్టుకోకండి అని డాక్టర్ అంటారు. ఆ మాట విని జ్యోత్స్న ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. తర్వాత డోనర్ కార్తీక్ వాళ్లని కలిసి వెళ్తుంటే నీకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తావని కార్తీక్ అడిగితే అప్పుడు చూస్తాలే అని అంటాడు. ఇలాంటి మనుషులు ఉంటారని కార్తీక్ అంటే నేను గతంలో అలాగే చేశా కదా బావ అని జ్యోత్స్న చెప్తుంది. అన్నీ కాలం మార్చేస్తుంది. మాలిని అత్త నీ అకౌంట్‌లో డబ్బు వేస్తే ఎంత బాధ పడ్డావో ఈ రోజు సూరజ్ కోసం డబ్బు వాడటానికి అంత సంతోషించావ్ కదా అని కార్తీక్ అంటాడు.

బాడీ గార్డ్ దక్షిణామూర్తి ఫోన్‌కి ఫోన్ చేసి సూరజ్‌కి బులెట్ తగిలింది.. చావు బతుకుల మధ్య ఉన్నాడని అడ్రస్ చెప్పి రమ్మని అంటాడు. మాలిని షాక్ అయి దక్షిణామూర్తికి విషయం చెప్పి హాస్పిటల్‌కి వెళ్తుంది. నా కొడుకుని ఏం చేశావో చెప్పవే అని జ్యోత్స్నను మాలిని అడిగితే కార్తీక్ ఫ్రెండ్ పోలీస్ జ్యోత్స్ననే చేసిందని మీరు ఎలా చెప్తున్నారని అడుగుతాడు. ఒక్క గానొక్క కొడుకు.. చావు బతుకుల మధ్య ఉన్నాడని మాలిని అంటుంది. జ్యోత్స్న లేకపోతే అసలు నీ కొడుకు ఉన్న చోటే చచ్చిపోయే వాడని కార్తీక్ అంటాడు. నా కొడుకు ఉన్న చోట నువ్వు ఎందుకు ఉన్నావ్.. నువ్వే ఏదో ప్లాన్ చేశావని జ్యోత్స్న మీద మాలిని నింద వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img