Karthika Deepam2 : వాళ్ళని క్షమించలేరా.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి!
on Oct 8, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -169 లో... శౌర్యని తీసుకొని నరసింహా వెళ్ళాలనుకుంటాడు. శౌర్యని అడ్డు పెట్టుకుని దీపని రప్పించి.. ఇల్లు సొంతం చేసుకోవాలనుకొని రిమోట్ కార్ ని నర్సింహా లోపలికి పంపిస్తాడు. అది చూసి సరదాగా శౌర్య బయటకు వస్తుంది. అప్పుడే దీప, కార్తీక్ లు వస్తారు. శౌర్యతో కార్తీక్ మాట్లాడతాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావంటూ చాక్లెట్ ఇచ్చి లోపలికి వెళ్లమని చెప్తాడు. వీడు ఎప్పుడు అడ్డుపడుతున్నాడని నరసింహా అనుకోని వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కార్తీక్ వెళ్ళిపోయాక శౌర్య లోపలికి వెళ్లి.. అమ్మ ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. మీ అమ్మ ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసని జ్యోత్స్న అంటుంది. శౌర్యని దీప లోపలికి పంపిస్తుంది. ఇక జ్యోత్స్న తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నువ్వు ఇక వెళ్లి మా బావ దగ్గర ఉండు.. స్వప్న , కాశీ లకి పెళ్లి చేసినట్టు.. గుడిలో నీకు, కార్తీక్ కి నా అత్త పెళ్లి చేస్తుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత అసలేం మాట్లాడుతున్నావ్.. నువ్వు నన్ను తీసుకొని వచ్చావ్.. సుమిత్ర గారి గురించి ఆలోచిస్తున్నాను.. లేదంటే నీ దవడ పళ్ళు రాలేవని దీప అంటుంది. అసలు నిన్ను ఒకటి అడుగుతా చెప్పు.. నీ బావ మనసులో నువ్వు ఉన్నావా.. అది తెలుసుకోమని దీప అనగానే.. అదంతా దూరం నుండి చూస్తున్న పారిజాతం షాక్ అవుతుంది.
ఆ తర్వాత దీప మాట్లాడిన మాటలకి జ్యోత్స్న కోపంగా ఉంటుంది. బావ నా దగ్గరకి రాలేదని జ్యోత్స్న అనగానే.. తను రాకుంటే ఏంటి నువ్వు వెళ్ళమని పారిజాతం అంటుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వెళ్లి కాంచన వాళ్ళని క్షమించలేరా అని అంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. అది జరగదు.. ఇక ముందు అలాంటివి మాట్లాడకంటూ చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ వెళ్ళిపోయాక.. ఎలాగైనా జ్యోత్స్న కార్తీక్ ల పెళ్లి జరగాలి.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి.. నా ప్రయత్నం నేను చేస్తానని సుమిత్రకి దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read