Karthika Deepam2 : అమ్మవారి పూజ కారణంగా దీప నిందల పాలు కానుందా!
on Oct 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -171 లో.....సుమిత్ర ఏడుస్తూ బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే దీప వచ్చి.. ఏమైందని అడుగుతుంది. ఇంతకన్నా ఏం చెయ్యగలను.. ఇంట్లో జ్యోత్స్నకి మరొక పెళ్లి సంబంధం చూస్తారు. నేను వేరే పెళ్లి చేసుకోనంటూ జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోయింది. అలా వద్దని ఇంట్లో చెప్పలేను.. అలా అని జ్యోత్స్నకి చెప్పలేను.. చిన్నప్పటి నుండి బావనే నీ భర్త అని చెప్పాను.. ఇప్పుడు బట్టలు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోమని చెప్పలేను కదా అని సుమిత్ర అంటుంది.
నాకు వదినని కలవాలని ఉంది కానీ ఏం చెయ్యగలను.. ఇంట్లోకి వెళ్తానంటే.. వద్దన్నారూ కానీ వదినని ఫేస్ చెయ్యలేనని సుమిత్ర అంటుంది. మళ్ళీఈ రెండు కుటుంబాలు కలవాలని సుమిత్ర అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి నువ్వు అనుకున్నది జరుగుతుందని అనగానే.. నిజమా అంటూ సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు జ్యోత్స్న పారిజాతంలు శ్రీధర్ ని కలుస్తారు. జ్యోత్స్న, శ్రీధర్ చేసిన పనికి ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు నాకు వేరే సంబంధం చూస్తున్నారని అంటుంది. నీ పెళ్లి కార్తీక్ తో జరగాలి.. ఏం చెయ్యడానికి అయిన రెడీ అని వాళ్ళతో శ్రీధర్ చెప్తాడు.
ఆ తర్వాత కాంచన వాళ్ళ దగ్గరికి దీప వచ్చి.. నేను రేపు పూజ చేసుకుంటున్నాను.. మీరు రావాలని అంటుంది. నేను రానని కాంచన అంటుంది. చేసేది మా ఇంట్లో అని దీప అంటుంది. అయిన రాను అనేసరికి శౌర్య వచ్చి రమ్మని అంటుంది. దాంతో వస్తానని చెప్తుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వచ్చి.. రేపు పూజ చేస్తున్నాను రమ్మని చెప్తుంది. అక్కడ ఎందుకు ఇక్కడే చేద్దామని సుమిత్ర అంటుంది. అప్పుడే పారిజాతం, జ్యోత్స్నలు వచ్చి వాళ్ళ మాటలు వింటుంటారు. మా ఇంట్లో చేద్దామని దీప అంటుంది. వద్దు ఇక్కడే అని సుమిత్ర అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి.. కార్తీక్ అని ఏదో అంటుంటే దీప ఆపుతుంది. నేను అక్కడ సుమిత్ర కాంచన గారిని కలపాలనుకున్నాన్ కానీ ఇక్కడ జరుగుతుందని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read