Karthika Deepam 2 : జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కోసం శివన్నారాయణ పిలుపు.. దీపని పట్టించుకోని అమ్మ!
on Mar 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -312 లో... శివన్నారాయణ, పారిజాతం సుమిత్ర, దశరథ్ లు నలుగురు కాంచన దగ్గరికి వస్తారు. మా నాన్న వచ్చాడని కాంచన సంతోషానికి అవదులు లేకుండా పోతాయ్.. కానీ శివన్నారాయణ మాత్రం గుమ్మం బయటే ఉండి మాట్లాడతాడు. నీ కొడుకు నాకు సవాలు విసిరాడని పాత విషయాలు బయటకు తీస్తాడు. అయినా అవన్నీ ఇప్పుడు పట్టించుకోకుండా నా మనవరాలి ఎంగేజ్ మెంట్ కి పిలవడానికి వచ్చానని శివన్నారాయణ లోపలికి వస్తాడు.
కూర్చో నాన్న అని కాంచన అనగానే నీ మర్యాదల కోసం ఏం రాలేదని శివన్నారాయణ అంటాడు. అంటే ఈ పేదింట్లో కూర్చుంటే నీ విలువ తగ్గుతుందనా అని కాంచన అనగానే.. అంటే ఆస్తుల్లో నీ వాటా ఇవ్వలేదని ఇండైరెక్ట్ గా అంటున్నావా అని పారిజాతం అంటుంది. ఇప్పుడు ఆస్తుల గురించి ఎవరు అడిగారు.. తల్లి, కొడుకులకి ఆస్తుల గురించి ఉండదని అనసూయ అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కి రమ్మని శివన్నారాయణ పిలుస్తాడు. సుమిత్ర, దశరథ్ లని పిలవమని చెప్తాడు. దాంతో సుమిత్ర కాంచనికి బొట్టు పెట్టి ఎంగేజ్ మెంట్ కి పిలుస్తుంది.
ఇంకా పిలవాల్సిన వాళ్ళు ఎవరు లేరా అని సుమిత్రని అడుగుతాడు కార్తీక్. ఒక్కప్పుడు ఉండే వాళ్ళు ఇప్పుడు లేరని దీపని ఉద్దేశించి మాట్లాడుతుంది సుమిత్ర. తప్పకుండా ఎంగేజ్ మెంట్ కి రమ్మని కాంచన, కార్తీక్ ఇద్దరికి చెప్పి వెళ్తుంది సుమిత్ర. వదిన ఏంటి దీప అంటే పట్టనట్టు వెళ్తుంది.. ఏం జరిగిందని కాంచన అడుగుతుంది. శౌర్యపై ఎటాక్ జరిగినప్పుడు జరిగింది అత్త దీప ని కొట్టిన విషయం అమ్మకి తెలియదు కదా అని కార్తీక్ అనుకుని డైవర్ట్ చేస్తాడు. మనకి రెస్టారెంట్ లో పని ఉందంటూ దీపని తీసుకొని వెళ్తాడు కార్తీక్. మరొకవైపు జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కి వెళ్ళాలని శ్రీధర్ అనుకుంటాడు. నేను మాత్రం రానని కావేరి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
