Jayam serial : బాక్సింగ్ కావాలన్న రుద్ర గోల్ ని గంగ నిలబెడుతుందా!
on Nov 5, 2025
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -103 లో.....పైడిరాజు తాగి ఇంటికి వస్తాడు. మీ అమ్మ హాస్పిటల్ కి పెట్టే ఖర్చు బదులు.. నాకు డబ్బు ఇవ్వు.. సారా దుకాణం పెట్టుకుంటానని పైడిరాజు అంటాడు. దాంతో వాళ్ళ నాన్నపై గంగ కోప్పడుతుంది. నువ్వు నా కన్నకూతురువి కాదని పైడిరాజు చెప్పబోతుంటే లక్ష్మీ ఆపుతుంది. మరొకవైపు శకుంతల ఇంట్లో నుండి బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి అని పెద్దసారు అంటాడు. రుద్రకి అమ్మాయిని చూడడానికి అని శకుంతల చెప్తుంది.
ఏంటి ఈ మార్పు అని పెద్దసారు అడుగుతాడు. ఎన్ని కోపాలున్నా అది కొన్ని రోజులే.. అది దానివరకే మాత్రమే పరిమితమని శకుంతల చెప్తుంది. మరొకవైపు గంగ వాటర్ క్యాన్ వెయ్యడానికి రాలేదని రుద్రకి శ్రీను చెప్తాడు. దాంతో గంగని వెతుక్కుంటూ రుద్ర వెళ్తాడు. ఎందుకు అకాడమీకి రాలేదని రుద్ర అడుగుతాడు. మా అమ్మా గొప్పింటి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పింది అందుకే అని గంగ చెప్తుంది. మరొక వైపు ఇషిక, శకుంతల, వీరు కలిసి పారు దగ్గర కి వెళ్తారు. అంటి మీకు నాకు కొన్ని సిమిలర్ క్వాలిటీ ఉంది.. ఇద్దరం ఒక్కప్పుడు రుద్రని ప్రాణంగా ప్రేమించాం.. ఒకే కారణం వల్ల దూరం చేశామని పారు అంటుంది. నువ్వు ఇప్పుడు రుద్రని పెళ్లి చేసుకోవాలి.. నీలాంటి గొప్పింటి అమ్మాయి కోడలుగా వస్తే గౌరవం గా ఉంటుందని శకుంతల అనగానే పారు షాక్ అయినట్లు యాక్టింగ్ చేస్తుంది. అదంతా ఇషిక, వీరు, పారు కలిసి ప్లానింగ్ చేసిందే. మరొకవైపు రుద్ర ఇచ్చిన పట్టీలు తిరిగి ఇస్తుంది. అందరు మనం ప్రేమించుకుంటున్నామని అనుకుంటున్నారంటూ గంగ చెప్తుంది. సమాజం గురించి పట్టించుకోవద్దని రుద్ర చెప్తాడు. ఇప్పుడు నా కుటుంబం ముఖ్యం అప్పు తీర్చాలని గంగ అంటుంది.
నీ అప్పు తీరి.. మీ అమ్మకి వైద్యం చేయించాలంటే ఒక్కటే మార్గం నువు బాక్సింగ్ లో పోటీపడాలి.. ఛాంపియన్ కావాలి.. నీకు ట్రైనింగ్ నేను ఇస్తానని రుద్ర హామీ ఇస్తాడు. మరొకవైపు రుద్రని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావని.. నీకు ఈ పెళ్లి చేయడం లేదని శకుంతల అనగానే ముగ్గురు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



