ప్రియుడితో ఇనయా సుల్తానా బ్రేకప్.. నెట్టింట వైరల్ గా మారిన ఫోటోలు!
on Dec 26, 2024
బిగ్ బాస్ సీజన్-6 ద్వారా ఫేమస్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు. తన ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకున్న ఇనయా.. బయటకొచ్చాక తన లవర్ తో కలిసి గోవా ట్రిప్ లకి వెళ్లి అక్కడ హాటల్ గదుల్లో టవల్ పై ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇక వాటి గురించి నెటిజన్లు కామెంట్ చేయగా.. పెళ్లా.. అబబ్బే.. అలాంటి ఉద్దేశం మాకు ఇప్పుడైతే లేదు. అయినా మేమిద్దరం చిన్నపిల్లలం. మా గోల్స్ అచీవ్ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటేనే మాకు సంతృప్తి.. అప్పటి వరకూ మాకు ఇదే తృప్తి అని అన్నాడు గౌతమ్. మా రిలేషన్ గురించి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వీళ్లు ఎంత కాలం కలిసి ఉంటారులే అని అంటున్నారు. వాటిని నేను కేర్ చేయను. అయినా మా రొమాంటిక్ ఫొటోలు బాగున్నాయి కదా చూసి ఆనందించాలి.. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఏంటని అతను అన్నాడు.
నా లైఫ్, నా ఛాయిస్, నా ప్రాబ్లమ్స్, నా తప్పులు, నా పాఠాలు. మీరు నా గురించి మాట్లాడే ముందు మీ సొంత సమస్యలపై దృష్టిపెట్టండి. నా జీవితం గురించి చెప్పడానికి ఇది నీ కథ కాదంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా అప్పట్లో కొటేషన్లు రాసింది. ఇక ఇప్పుడేమో ఫైనల్‌గా ఇన్ స్టాగ్రామ్ లో బ్రేకప్ సింబల్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ప్రియుడితో బ్రేకప్ అయ్యిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇనయా సుల్తానా.. ఇయర్ ఎండింగ్ కావడంతో ఫారెన్ ట్రిప్‌లో ఉన్నట్టు ఉంది. అక్కడ హోటల్స్ రూమ్ నుంచి సింగిల్ గర్ల్.. సింగిల్ గర్ల్ అని చెప్తూ ఫొటోలు, వీడియోలు వదలుతుంది. దీంతో మేమ్ ముందే ఊహించాం కదా.. ఇలాంటిదేదో జరుగుతుందని. మీ రెచ్చిపోవడాలు చూసిన తర్వాత బుద్దిన్నోడు ఎవడూ కూడా మీరు కలిసి ఉంటారని మాత్రం అనుకోరు. చివరికి అదే అయ్యింది. ఇంతకి తమ్ముడు (గౌతమ్) కనిపించడం లేదు.. బ్రేకప్ చెప్పేశావా? చెప్పే ఉంటావ్‌లే అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Also Read