Home

»

Tv News

Illu illalu pillalu : నర్మదతో ప్రేమ ఎమోషనల్ డిస్కషన్..ధీరజ్ పశ్చాత్తాపం, భద్రవతి కుట్ర!

Aug 2, 2026 10:07AM

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -539 లో.. ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్లి.. సారీ చెప్పి తిరిగి తీసుకొని వస్తుంటే భద్రవతి అడ్డుపడి తనని లోపలికి లాక్కొని వెళ్లినట్లు ధీరజ్ కల కంటాడు. ఒక్కసారిగా నిద్ర లో ఉల్లిక్కపడి లేచి ప్రేమ వెళ్ళిపోయిందంటూ బయటకు వస్తుంటే నర్మద ఎదురు పడుతుంది. ఏంటి ధీరజ్ ఏమైందని నర్మద అడుగుతుంది.

ప్రేమని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు వదిన అని ధీరజ్ అంటుంటే ఇప్పుడు కాదు నిన్న  తీసుకొని వెళ్లారని నర్మద అంటుందిమ.  తొందరపడ్డావ్ ధీరజ్ కోపంలో ఏం మాట్లాడావో అర్థం కాలేదు.. నువ్వే ప్రాణం అనుకున్న తనని మోసం చేసావ్.. అవమానించావని నర్మద అంటుంది. మరొకవైపు భద్రవతి వాళ్ళు భోజనం చేస్తుంటే ప్రేమ డల్ గా ఉంటుంది. తనకి ధీరజ్ అంటే కోపం పెరిగేలా భద్రవతి రెచ్చగొడుతుంది. ఆ తర్వాత ప్రేమకి నర్మద ఫోన్ చేసి బయటకు రమ్మని పిలుస్తుంది. ప్రేమ బయటకు వచ్చి నర్మదని హగ్ చేసుకుంటుంది.

ధీరజ్ ఏదో ఆవేశంలో అలా చేసాడని నర్మద నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రేమ వినదు. నువ్వు నాకు అక్కగా ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు కానీ ఆ టాపిక్ తియ్యకని చెప్పి ప్రేమ కోపంగా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత రామరాజుకి వేదవతి కాఫీ తీసుకొని వస్తుంది. అమూల్యని రామరాజు కాఫీ తీసుకొని చెప్పి తను తీసుకొని వచ్చిన కాఫీ తాగుతాడు. ఆ తర్వాత టిఫిన్ చెయ్యడానికి అన్ని డైనింగ్ టేబుల్ పై వేదవతి సిద్ధం చేస్తుంది. అందరు వస్తారు రామరాజు రాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com