Illu illalu pillalu : ఆమెను డబ్బులకి అమ్మాలనుకుంటున్న కళ్యాణ్.. ఆ పెళ్ళి జరిగేనా!
on Jan 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -46 లో..... మేనకోడలు పెళ్లికి వేదవతిని పిల్వలేదని పెద్దావిడ బాధపడుతుంది. భద్రవతి వచ్చి ఎందుకు భాదపడుతున్నావ్.. లేచిపోయిన వాళ్ళ ఆశీర్వాదం దరిద్రమని వేదవతిని తిడుతుంది. అదంతా నర్మద, వేదవతి లు వింటారు. వేదవతి లోపలికి వెళ్లి బాధపడుతుంది. అత్తయ్య మీరు ఎన్ని రోజులు బాధపడతారు.. మీరు మీ మేనకోడలని ఆశీర్వదించే ఛాన్స్ వస్తుందని నర్మద చెప్తుంది.
ఆ తర్వాత వేదవతి దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. తనని హగ్ చేసుకొని వేదవతి బాధపడుతుంది. మీ నాన్న చనిపోయేముందు మన కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలని అన్నాడు కానీ ఆ కోరిక తిరేలా లేదు. ఆ ఇంటికి ఈ ఇంటికి ప్రేమ పెళ్లి వారధి అనుకున్నాను కానీ ఈ ఒక్క అవకాశం కూడా లేదని పెద్దావిడ బాధపడుతుంది. ఆ తర్వాత వేదవతి తన మేనకోడలికి వెయ్యమని అక్షింతలు ఇస్తుంది. అలాగే ఒక నెక్లెస్ కూడా ఇస్తుంది. అది పట్టుకొని పెద్దావిడ వెళ్తుంటే భద్రవతి ఆపి నెక్లెస్ చూసి విసిరేస్తుంది. అది రామరాజుపై పడుతుంది. ఆ తర్వాత అక్షింతలు కూడా పడేస్తుంది. లోపలికి పదండీ అంటూ వేదవతి వాళ్ళని లోపలికి వెళ్ళమంటాడు రామరాజు. మరొకవైపు ప్రేమని అమ్మాలనుకుంటాడు కళ్యాణ్. దాంతో ఒకతని దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు కళ్యాణ్. అతను వచ్చి రేపటిలోగా ప్రేమని తీసుకొని రాకుంటే.. చంపేస్తానంటూ బెదిరిస్తాడు. దాంతో కళ్యాణ్ భయపడి ప్రేమకి ఫోన్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చెయ్యదు.
ఆ తర్వాత ప్రేమను చూసిన ధీరజ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి.. ప్రేమ నెంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రేమకి ఫోన్ చేసి ధీరజ్ మాట్లాడతాడు అప్పుడు కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఫోన్ చేయగానే.. ప్రేమ లిఫ్ట్ చేస్తుంది కానీ తన పెళ్లి విషయం చెప్పలేక కట్ చేస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ తన పెళ్లి విషయం కళ్యాణ్ కి చెప్తుంది. దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఎలాగైనా ప్రేమని తీసుకొని వచ్చి వాడికి అమ్మాలని అనుకున్నానని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read