Illu illalu pillalu : రామరాజుకి సాగర్ తన ప్రేమ విషయం చెప్తాడా? లేదా?
on Nov 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -13 లో..... నర్మద తనకి పెళ్లిచూపులు అన్న విషయం సాగర్ కి చెప్తుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు నాన్న కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సమాధానం చెప్పాలని నర్మద అంటుంది. కొంచెం టైమ్ కావాలి నర్మద ఇంటికి లేట్ గా వెళ్ళు అని సలహా ఇవ్వగా.. దానికి నర్మద సరే అంటుంది.
మరొకవైపు కూరగాయలు అమ్మే అతను రామరాజు, భద్రవతిల ఇంటి ఎదురుగా వస్తాడు. ఒకవైపు వేదవతి, మరొకవైపు భద్రవతి ఉంటారు. వదిన, అమ్మ కూరగాయలు కొంటూ ఉంటారు. అది చూసిన వేదవతి వచ్చి.. మా వదిన కొంటున్న కూరగాయలు అటువైపు ఉన్నాయి.. బండి ఇటు తిప్పాలని తెలియదా అని భద్రవతి అనగానే..అతను బండి తిప్పుతాడు. నేను తీసుకునే కూరగాయలు అటు వైపు ఉన్నాయంటూ వేదవతి అంటుంది. ఇక ఇద్దరు కలిసి అతనితో గొడవపడి కూరగాయలు మొత్తం చెల్లాచెదురు చేస్తారు. మరొకవైపు నర్మద అంత లేట్ గా వచ్చిన సరే పెళ్లి చూపులకి వచ్చిన వాళ్లు ఉంటారు. వాళ్ళని చూసి నర్మద షాక్ అవుతుంది. నర్మదని చూసి అమ్మాయి నచ్చిందని త్వరలోనే ముహూర్తం పెట్టుకుందామని వాళ్ళు చెప్తారు.
మరొకవైపు ధీరజ్ తన మామ వెళ్తుంటే.. ప్రేమ తన లవర్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది. అది ధీరజ్ తన మామకి చూపిస్తాడు. అతను వెళ్లగానే కళ్యాణ్ ని ప్రేమ పంపిస్తుంది. నీకు ఇంట్లో ఇలా చేస్తే గొడవలు జరుగుతున్నాయని తెలుసు కదా అయిన వాడు తాగుబోతోడు .. ఇంకొక సారి కన్పిస్తే అన్నయ్యతో చెప్తానని అతను అంటాడు. ధీరజ్ ని ప్రేమ చూసి బాబాయ్ కి కళ్యాణ్ గురించి తప్పుగా చెప్పింది వీడే నా అనుకుంటుంది. ఆ తర్వాత నర్మద జరిగింది మొత్తం సాగర్ కి చెప్తుంది. దాంతో సాగర్ బాధపడుతుంటాడు. అప్పుడే ధీరజ్ వస్తాడు. నర్మదకి పెళ్లి అంట అని చెప్పగానే.. నీ ప్రేమ విషయం ఇప్పటికైనా నాన్నకి చెప్పమని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటారు. సాగర్ తన ప్రేమ విషయం రామరాజుకి చెప్తాడా లేదా తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read