ENGLISH | TELUGU  
Home  » TV News

Illu illalu pillalu : కొడుకుల దగ్గర మాటతీసుకున్న తండ్రి!

on Nov 20, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -08 లో....భద్రవతి మేనకోడలు ప్రేమ తన లవర్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది. ఏంటి ప్రేమ అసలు చెయ్యి కూడా పట్టుకొనివ్వవు.. నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ప్రేమిస్తున్నాను కాని ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉందని ప్రేమ అంటుంది. అప్పుడే రామరాజు చిన్న కొడుకు ధీరజ్ (చిన్నోడు). వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర కి వస్తాడు.‌ నువ్వు వీడిని ప్రేమిస్తున్నావా.. నువ్వు నాకు శత్రువు కని నీ గురించి చెప్తున్నా.. వాడు పెద్ద వెస్ట్ గాడు అని కళ్యాణ్ గురించి ప్రేమకి చెప్తాడు ధీరజ్.

ఆ తర్వాత కళ్యాణ్, దీరజ్ లు గొడవ పడుతుంటారు. అప్పుడే దూరం నుండి ప్రేమ వాళ్ళ అన్నయ్య చూస్తాడు. దాంతో కళ్యాణ్ ని పంపిస్తుంది ప్రేమ. ప్రేమ యొక్క పెళ్లి వల్ల మా అమ్మ పరిస్థితి చూసావ్ కదా.. నీకు ఆ సిచువేన్ రావద్దంటే నువ్వు అలా చెయ్యకని ప్రేమకి ధీరజ్ చెప్పి వెళ్లిపోతుంటే.. నా చెల్లితో ఏం మాట్లాడావ్ రా అని అతన్ని అడుగగా.. నీ చెల్లినే అడుగమని ధీరజ్ అంటాడు. అతను తన చెల్లి ప్రేమ దగ్గరికి వచ్చి..వాడేం అంటున్నాడని అడుగుతాడు. కళ్యాణ్ తో తన ప్రేమ విషయం భయటపడకూడదని చాలా తెలివిగా.. ధీరజ్ నన్ను ప్రేమించమంటూ వెంటపడుతున్నాడని అంటుంది. దాంతో అతను వెళ్లి భద్రవతికి చెప్తాడు. ఇక భద్రవతి, సేనాపతి లు రామరాజు ఇంటికి గొడవకి వెళ్తారు. నీ కొడుకు నా కూతురు వెంట పడుతున్నాడని సేనాపతి అంటాడు. అవునని ప్రేమ అంటుంది. 

అప్పుడే దీరజ్ వస్తాడు. ఆ అమ్మాయి గురించి ప్రేమ గురించి మాట్లాడావా అని రామరాజు అడుగగానే.. అవునని అసలు విషయం చెప్తుంటాడు. కానీ అంతలోనే లోపలికి లాక్కొని వెళ్లి రామరాజు కొడతాడు. అసలు చెప్పేది కూడా వినడు. ఆ తర్వాత ఇక నేనొక నిర్ణయం తీసుకున్నా నాలా నా కొడుకులు ప్రేమ వివాహం చేసుకొని బాధపడకూడదు. మీరు ఎవరిని ప్రేమించనని మాట ఇవ్వండి అనగానే ధీరజ్ మాటిస్తాడు. పెద్దోడుణ నడిపోడు తమ ప్రేమించిన అమ్మాయిలని గుర్తు చేసుకుంటూ భయంగా మాటిస్తారు. తరువాయి భాగంలో నా కొడుకులు నేను అడగ్గానే మాటిచ్చారని వేదవతికి రామరాజు చెప్తాడు. ఆ తర్వాత చిన్నోడితో పెద్దోడు, నడిపోడు తమ ప్రేమ విషయం చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.