Illu illalu pillalu : ప్రేమ పెళ్ళి చేసుకోవద్దని కొడుకుల దగ్గర మాట తీసుకున్న తండ్రి!
on Nov 19, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -07 లో....రామరాజు పెద్ద కొడుకు చందు గుడికి వచ్చి.. తన లవర్ సుభద్రకి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు గుడిలో కలిసి మాట్లాడుకుంటారు. రామరాజు వస్తాడేమోనని చందు భయపడతాడు. మన పెళ్లి విషయం గురించి ఇంట్లో మాట్లాడావా అంటూ సుభద్ర అడుగుతుంది. దాంతో చందు భయపడుతాడు. ఆ తర్వాత వేదవతి వంట చేస్తున్న వాసనా వచ్చి.. వాళ్ళ అమ్మ చిన్న పిల్లని కూర తీసుకొని రా అని పంపిస్తుంది దాంతో వేదవతి తన తల్లికి కర్రీ వేసి పంపిస్తుంది.
ఆ తర్వాత వేదవతి చూసుకోకుండా తన అన్న సేనాపతి పై వాటర్ పోస్తుంది. అది చూసి సేనాపతి భార్య రేవతి వచ్చి మా అయన పై కావాలనే వాటర్ పోసావ్ అంటుంది. అదంతా పైనుండి భద్రవతి చూస్తూ వదిలేయండి. మెల్లగా ఈ కుటుంబంలోకి రావాలని చేస్తున్నా ప్రయత్నం అది.. కూరలు పంపివ్వడం.. ఇలా నీళ్లు పోయడమని వేదవతి బాధపడేలా మాట్లాడుతుంది భద్రావతి. వేదవతి వాళ్ల అమ్మ బాధపడుతుంటే తన మనవరాలు వచ్చి మాట్లాడుతుంది.
మరొకవైపు వేదవతి ఏడుస్తుంటే వాళ్లే కారణమంటూ చిన్నోడు ఇంటి వైపు చూస్తూ.. మా అమ్మ ఏం చేసిందని తనని బాధపెడుతున్నారని అంటాడుమ ఏం చేసిందా అంటూ సేనాపతి కూతురు చిన్నోడి పై నీళ్లు పోసి ఇది చేసిందంటూ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటుంటే.. పెద్దావిడ చూసి మీకు గొడవ కన్పిస్తుంది. నాకు మీ ప్రేమ కన్పిస్తుంది. మీ పెళ్లితో అయిన ఈ రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటాయని అనుకుంటుంది. తరువాయి భాగంలో ప్రేమ వివాహం చేసుకోవద్దంటూ రామరాజు తన ముగ్గురి కొడుకుల దగ్గర మాట తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read