Guppedantha Manasu : దొంగల చేతుల్లోకి వెళ్ళకుండా కాలేజీని కాపాడిన మను.. పొగరు అని అనండి!
on Jun 28, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1112 లో... ఎండీ ఎవరో మీరే ఏకగ్రీవంగా ఎన్నుకొని నిర్ణయం చెప్పండి.. లేదంటే మా గవర్నమెంట్ కాలేజీని హ్యాండోవర్ చేసుకుంటుందని మినిస్టర్ అనగానే.. ఇది మా కాలేజీ.. భూషణ్ ఫ్యామిలీ నుండే ఎవరో ఒకరు ఇన్ని రోజులు బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు నేను తీసుకుంటానని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు ఎండీ గురించి కొట్టుకుంటున్నారు.. మీరు ఎండీ అవ్వడం ఇష్టం లేని వాళ్ళున్నారు.. వాళ్ళు రేపు మీకు సహకరించపోవచ్చని మినిస్టర్ అంటాడు.
అందుకని మీరే ఒక నిర్ణయం తీసుకొని.. నన్ను పిలవండి అని మినిస్టర్ అంటాడు. ఏంటి నీకు సపోర్ట్ చేస్తున్నారు.. నీ టాలెంట్ చూసి సపోర్ట్ చేస్తున్నారా లేక డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయించుకుంటున్నావా అని శైలేంద్రతో ఫణీంద్ర అనగానే.. శత్రువులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉంటారని శైలేంద్ర అంటాడు. మరొకవైపు రంగా ఇంటికి వస్తాడు. వసుధార ఎక్కడ కన్పించకపోవడంతో.. ఎక్కడికి వెళ్ళిందని పెద్దావిడని అడుగుతాడు. అప్పుడే సరోజ వస్తే తనని కూడా అడుగుతాడు. నాకు తెలియదని సరోజ చెప్పగానే.. ఎక్కడికి వెళ్ళందంటూ కంగారుపడతాడు. దాంతో బయటకు వెళ్లి వెతుకుతాడు. ఒక దగ్గర టీ తాగుతూ కన్పిస్తుంది వసుధార. వెంటనే ఆటో ఆపి వసుధారని కొట్టబోయి ఆగిపోతాడు. చెప్పి రావాలి కదా ఎంత టెన్షన్ పడ్డానో అని రంగా అంటాడు. నిజమే సర్ అని వసుధార అంటుంది. అసలే నీ కోసం రౌడీలు వెతుకుతున్నారు కదా అని రంగా అంటాడు. మీరు నా రిషి సర్ అని వసుధార అనగానే.. పొగరు అని రంగా అంటాడు. వసుధార మురిపోతు అనండి సర్ పొగరు అని.. నన్ను పొగరు అనే హక్కు మీకే ఉందని వసుధార అంటుంది. పదండి మేడమ్ వెళదామని రంగా అంటే మీరు రిషి సర్ అని ఒప్పుకునే వరకు నేను రానని వసుధార అంటుంది. దంతో బలవంతంగా వసుధార చెయ్యి పట్టుకొని రంగా తీసుకొని వెళ్తాడు.
మరొకవైపు థాంక్స్ సర్ మనం అనుకున్నట్టే మాట్లాడారని మినిస్టర్ కి మను చెప్తాడు. కాలేజీ దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళకూడదన్నావ్ కదా అందుకే అని మినిస్టర్ అంటాడు. అదంతా శైలేంద్ర వింటాడు. ఆ తర్వాత ఇదంతా మీరు ప్లాన్ చేసుకున్నారా అని మనుతో శైలేంద్ర అంటాడు. అవును మొన్న సర్ ని కలిసింది దీని గురించే అని మను అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర రౌడీకి ఫోన్ చేసి.. మనుని లేపేయాలి.. ఇది వరకు మిస్ చేసావని అనగానే ఒకసారి మిస్ అయింది.. ఇక నేను చెయ్యను సర్ అని రౌడీ అంటాడు దాంతో శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతుంటాడు. మరొకవైపు అసలు రిషి సర్ అంటావ్ .. అసలు ఎవరు ఈ రిషి సర్ అంటూ వసుధారని పెద్దావిడని అడుగుతుంది. అక్కడే రంగా.. అతని ఫ్రెండ్ సరోజ కూడా ఉంటారు. రిషి గురించి వసుధార చెప్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read