ENGLISH | TELUGU  
Home  » TV News

గౌతమ్, ప్రేరణల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

on Nov 26, 2024

 

బిగ్‌బాస్ ఈవారం నామినేషన్స్‌ ప్రక్రియని నబీల్ మొదలుపెట్టాడు. హౌస్‌లో ఎవరినైతే ఫినాలేకి చూడకూడదని భావిస్తారో ఆ ఇద్దరినీ నామినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక నబీల్ ముందుగా గౌతమ్‌ని నామినేట్ చేశాడు. ఆదివారం ఎపిసోడ్‌లో తన గురించి గౌతమ్ రాసిన కంప్లెయింట్ నచ్చలేదని నబీల్ అన్నాడు. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మేము టార్గెట్ చేశామని నువ్వు అనడం కరెక్ట్ అనిపించలేదు అంటూ నబీల్ అన్నాడు. ఇక దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటూ నబీల్ మధ్యలో మాట్లాడి వాదిస్తూనే ఉన్నాడు. ఇక చివరకి గౌతమ్ మాట్లాడి వేస్ట్ అన్నట్లు వెళ్లి మీద రంగు పోయించుకున్నాడు. ఇక నెక్ట్స్ తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు నబీల్. ఒక మనిషి మీద పెట్టే కాన్సట్రేషన్ గేమ్‌పై పెడితే బావుంటుంది.. నువ్వు ఇప్పటివరకూ ఒక్క టాస్కు కూడా గెలవలేదు అంటూ నబీల్ అన్నాడు. దీనికి విష్ణు ఏదో సోది చెప్పింది. 

ఇక ప్రేరణ.. మొదటిగా విష్ణుప్రియను నామినేట్ చేసింది. సేమ్ నబీల్ చెప్పిన పాయింట్‌నే ఇంచుమించుగా ప్రేరణ రిపీట్ చేసింది. నీకు గేమ్‌ ఆడాలనే ఇంట్రెస్ట్ లేదు.. కసి లేదు అంటూ చెప్పింది. దీనికి విష్ణు ఒప్పుకోలేదు. తర్వాత తన సెకండ్ నామినేషన్ గౌతమ్‌కి వేసింది ప్రేరణ. నువ్వు కావాలని గ్రూప్ గేమ్ ఆడకపోయినా ఎక్స్‌పోజ్ చేయాలని ట్రై చేస్తున్నావ్.. మాట్లాడుతుంటే కెమెరాల వైపు చూసి చెప్తావ్. నీ దృష్టి ఎక్కువగా ఆడియన్స్‌లో మమ్మల్ని ఎలా బ్యాడ్ చేయాలనే దాని గురించే ఉంది అంటూ ప్రేరణ తన పాయింట్లు చెప్పింది. ఇక వీటిపై గౌతమ్-ప్రేరణ మధ్య చాలాసేపు గొడవ జరిగింది.

మెగా చీఫ్ రోహిణి మినహా హౌస్ మొత్తం నామినేట్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా విష్ణుప్రియకి ఐదు ఓట్లు పడ్డాయి. ఇక గౌతమ్‌కి యష్మీ వేసిన బిగ్ బాంబ్‌తో కలిపి నాలుగు ఓట్లు పడ్డాయి. నిజానికి ఈ వారం నబీల్ నామినేషన్స్‌లోకి వస్తాడని చివరి నిమిషమే తెలిసింది. ఎందుకంటే అప్పటివరకూ నబీల్‌ని ఎవరూ నామినేట్ చేయలేదు. కానీ చివరిలో రోహిణి తనకి అవకాశం వచ్చినప్పుడు నబీ‌ల్ ని నామినేట్ చేసింది. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.