Eto Vellipoyindhi Manasu : విడాకులు పంపిన భార్య.. వారం గడువు అడిగిన భర్త
on Nov 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -264 లో....రామలక్ష్మి పంపినట్లు విడాకుల నోటిస్ శ్రీలత ప్లాన్ చేసి పంపిస్తుంది. సీతాకాంత్ టిఫిన్ చేస్తుంటే కొరియర్ వస్తుంది. అందులో విడాకుల నోటిస్ చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. రామలక్ష్మి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుందని చెప్తాడు. దాంతో దొరికింది టైమ్ అనుకొని శ్రీలత వాళ్లు రామలక్ష్మిపై చెడుగా చెప్తారు. అక్కకి ఆస్తులతో అవసరం కానీ బావ గారి ప్రేమ అవసరం లేదని శ్రీవల్లి అంటుంది. అసలు అన్నయ్యని వదినా ఇలా మోసం చెయ్యడమేంటని సందీప్ అంటాడు. దాంతో సీతాకాంత్ కోపంగా రామలక్ష్మి దగ్గరికి బయలుదేర్తాడు. వెళ్తూ రామలక్ష్మితో ఉన్నా జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు.
ఇక ప్లాన్ సక్సెస్ అంటూ శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయం నందినికి చెప్పాలనుకొని నందినికి ఫోన్ చేసి చెప్తుంది శ్రీలత. దాంతో నందిని తన హ్యాపీనెస్ ని హారికతో షేర్ చేసుకుంటుంది. రామలక్ష్మి ఎంప్లాయిస్ తో మాట్లాడుతుంది. అప్పుడే సీతాకాంత్ కోపంగా లోపలికి వచ్చి నీతో మాట్లాడాలంటూ పక్కకి తీసుకొని వెళ్తాడు. నువ్వు చేస్తుందేంటి అంటూ విడాకుల నోటిస్ చూపిస్తాడు. అది చూడగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. నాకేం తెలియదని రామలక్ష్మి చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. సీతాకాంత్ వినిపించుకోడు. నిన్ను మొదట్లో అయిష్టంగా పెళ్లి చేసుకున్నాను కానీ తర్వాత నువ్వు అంటే చాలా ఇష్టం పెరిగింది. నువ్వు నా తల్లిని ఎంత బాధపెట్టినా, ఆస్తులు రాయించుకున్నా నేనేం అనలేదని సీతాకాంత్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. నువ్వు ఒక వారం టైమ్ తీసుకో అప్పుడు కూడా విడాకులు కావాలనిపిస్తే ఇస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా నందిని వింటుంది.
రామలక్ష్మి బాధపడుతుంది. శ్రీలతకి నందిని ఫోన్ చేస్తుంది.సీతాకాంత్ రామలక్ష్మి చెంప పగులగొట్టాడా? ఇక నీ రూట్ క్లియర్ అయినట్లేనా అని శ్రీలత అనగానే.. నువ్వు చెప్పింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అని నందిని అంటుంది. సీతా వారం రోజులు టైమ్ అడిగాడు. ఈ లోపు సీతానీ రామలక్ష్మి మారుస్తుందని నందిని అనగానే.. ఆ లోపు మనమే ఏదైనా చేసి వాళ్ళని దూరం చెయ్యాలి.. అది నేను చూసుకుంటానని శ్రీలత అంటుంది. మరొకవైపు రామలక్ష్మి బాధపడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read