ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి ప్లాన్ ని కొడుకు కనిపెట్టేనా.. భార్యకి గాయాలు!

on Nov 15, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -254 లొ......రామలక్ష్మి సందీప్ ప్లాన్ ని కానీపెట్టి వస్తున్న వెహికల్ ని తప్పిస్తుంది ఆ క్రమంలో అప్పుడే కార్ చెట్టుకి తాకుతుంది. అప్పుడే రామలక్ష్మికి గాయం అవుతుంది సీతాకాంత్ రామలక్ష్మిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఏమైందంటూ సందీప్, శ్రీలత, శ్రీవల్లి లు అడుగుతారు కానీ ఎవరికి  కాలేదని డిస్సపాయింట్ అవుతారు.


ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి డాక్టర్ వస్తుంది. తనని ఆ సిచువేషన్ లో చూసి సీతాకాంత్ బాధపడతాడు. శ్రీవల్లి, శ్రీలత సందీప్ లు పక్కకు వెళ్లి ప్లాన్ ఫెయిల్ అయిందని మళ్ళీ వేరొక ప్లాన్ చెప్తుంది. శ్రీవల్లి వాటర్ తీసుకొని రాగానే.. శ్రీలత అందులో విషం కలుపుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ తన ఫ్రెండ్ మురళికి ఫోన్ చేసి ఎవరో కనుకున్నావా అని అడుగుతాడు. కనుక్కుంటా కానీ ముందు నువు నీ భార్యని తీసుకొని కొన్ని రోజులు ఎక్కడికైన వెళ్ళు అంటాడు. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. మరొక వైపు శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు ఆ వాటర్ తీసుకొని సీతాకాంత్ దగ్గరికి వెళ్లి.. నువ్వు టెన్షన్ పడుతున్నావ్.. వాటర్ తీసుకో అని సందీప్ ఇవ్వగానే రామలక్ష్మి మళ్ళీ ఇదేదో ప్లాన్ అనుకొని వాటర్ గ్లాస్ కింద పడేస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మిమ్మల్ని చంపాలని ట్రై చేస్తున్నారు. మీరు ఏది తినాలన్నా, తాగాలన్నా నేను చూడాలని రామలక్ష్మి అంటుంటే.. ఎందుకిలా చేస్తున్నావంటూ సీతాకాంత్ చిరాకు పడుతడు.

ఏంటి నీ భర్తని కాపాడుకోవాలనుకుంటున్నావా అని శ్రీలత మళ్ళీ రామలక్ష్మి బాధపడే విధంగా మాట్లాడుతుంది దాంతో రామలక్ష్మి మళ్ళీ కంగారుగా కిందకి వెళ్తుంది. ఏంటి వదిన కిందకి వచ్చావ్ అని సిరి అంటుంది. అప్పుడే సీతాకాంత్ కూడ వచ్చి అదే అంటాడు. ఇదిగో ఫ్లైట్ టికెట్స్ అని పెద్దాయన ఇవ్వగానే.. మంచి పని.. సీతా, రామలక్ష్మి కూడా ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుందని శ్రీలత అంటుంది. పదా రామలక్ష్మి అని సీతాకాంత్ అనగానే వద్దని రామలక్ష్మి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.