ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : అనుకోకుండా ముద్దు పెట్టుకున్న భార్య.‌. ఆ ప్రాజెక్ట్ ఎవరికంటే!

on Sep 25, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -210 లో.....కంపెనీ బోర్డు మెంబర్ శ్రీలత వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మొన్న మనం అనుకున్న ప్రాజెక్ట్ కి రేపే బిట్ వేస్తున్నారు. సీతాకాంత్ కీ కాకుండా వేరే వాళ్లకు బిట్ వచ్చేలా చేస్తే మనకి టెన్ పర్సంట్ కమిషన్ ఇస్తానని అన్నారని అతను చెప్తాడు. సీతాకాంత్ బిట్ వెయ్యడానికి వెళ్తే కచ్చితంగా ఆ బిట్ తనకి వస్తుందని అతను అంటాడు. తను రాకుండా నేను చూస్తాను కదా అని శ్రీలత అంటుంది. వాళ్ళ మాటలన్నీ దూరం నుండి రామలక్ష్మి వింటుంది. మీ ప్లాన్ లో మీరు ఉన్నారు.. నా ప్లాన్ లో నేను ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది.

ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. రేపు బిట్ వేయడానికి వెళ్తున్నానని సీతాకాంత్ పెద్దాయనతో అంటాడు. నీకు రెస్ట్ అవసరం.. నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని అంటాడు. మరి మీరు వెళ్ళండి తాతయ్య అని అనగానే వేరే మీటింగ్ ఉందని చెప్తాడు. బావ గారి తర్వాత మా అయన కాబట్టి మా అయన వెళ్తాడని శ్రీవల్లి అంటుంది. వద్దని రామలక్ష్మి అంటుంది. ఏంటి సందీప్ ని చేతకాని వాడు అనుకుంటున్నావా మనసులో ఏదో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావని శ్రీలత అంటుంది. ఒకవైపు రామలక్ష్మి మరొకవైపు శ్రీలత ఇద్దరు గొడవపడుతుంటే సీతాకాంత్ కోప్పడి వెళ్లిపోతుంటాడు. తినకుండా వెళ్తున్నావ్ నేను కూడా తిననని శ్రీలత అనగానే సీతాకాంత్ కూర్చుంటాడు. నీకు రామలక్ష్మి వెళ్లడం ఇష్టమైతే తననే పంపించు అని శ్రీలత అంటుంది.

మరొక వైపు శ్రీవల్లి, సందీప్ లు కోపంగా ఉంటారు. అప్పుడే శ్రీలత వస్తుంది. మీరేంటి రామలక్ష్మిని బిట్ వెయ్యడానికి వెళ్ళమని చెప్పారని అంటారు..నువ్వు వెళ్తే బిట్ ఓకే కాకపోతే సీతాకాంత్ తిడతాడు. అదే రామలక్ష్మి బిట్ వేస్తె రాకపోతే రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. అంతే కాకుండా ఆ బిట్ రామలక్ష్మి కి రాకుండా మనం చేయాలని శ్రీలత అంటుంది. మరొకవైపు సీతాకాంత్ బిట్ కి సంబంధించిన కొటేషన్ రెడీ చేస్తుంటే రామలక్ష్మి వస్తుంది. ఫ్యాన్ వేసుకులేదు అని ఫ్యాన్ వేస్తుంది. పేపర్స్ అని గాలికి ఎగిరిపోతాయ్. దాంతో ఇద్దరు పట్టుకున్నే ప్రయత్నం చేస్తుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది. నువ్వు నాకు పెట్టావ్ వడ్డీతో సహా తిరిగి ఇస్తానని సీతాకాంత్ సరదాగా మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.