ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoindhi Manasu: యూట్యూబ్  ట్రెండింగ్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

on Apr 30, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఇందులో సీతాకాంత్, రామలక్ష్మిల బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉండటమే. వీరిద్దరిది గతజన్మ బంధమని.. ఆ జన్మలో విడిపోయిన వారు ఈ జన్మలో కలుస్తారా లేదా అనే ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేస్తూ మొదలైంది.

సీతాకాంత్, రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి ప్రధాన పాత్రలుగా మొదలైన ఈ సీరియల్ మొదటి నుండి ఆసక్తికరంగా సాగుతూ అత్యధిక వీక్షకాధరణని సొంతం చేసుకుంటుంది. ఈ సీరియల్ మొదలైన నాటి నుండి 84 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోగా.. ఇన్ స్టాగ్రామ్ లో వీరికి సపరేట్ ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. కారణం ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి జోడికి కనెక్ట్ అవ్వడమే.. అమాయకంగా ఉండే రామలక్ష్మి.. బయటకు కోపంగా లోపల సున్నిత మనస్తత్వం గల సీతాకాంత్ ఇద్దరు కలిసి ఈ సీరియల్ ని ప్రేక్షకులకి నచ్చేలా, మెచ్చేలా చేస్తున్నారు. మాణిక్యం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు మరింతగా ఎదురుచూస్తున్నారు. కారణమేంటో తెలిస్తే అసలు సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలత.. తన కొడుకు సందీప్, కూతురు సిరిలని ఒకలా‌.. సీతాకాంత్ ని మరోలా ఎందుకు చూస్తుందో తెలుస్తుంది. అయితే మాణిక్యం పెట్టిన షరతులని పాటిస్తూనే అతనికి తెలియకుండా సీతాకాంత్, రామలక్ష్మి పెళ్ళి నాటకం ఆడుతున్నారు. అయితే రామలక్ష్మి బాయ్ ఫ్రెండ్ అభి పాత్ర పూర్తిగా నెగెటివ్ గా ఉన్నా బాగుండేది కానీ సీతాకాంత్ ముందు మంచివాడిగా నటిస్తూ మోసం చేస్తున్నాడు. అది బయటపడితే రామలక్ష్మికి సీతాకాంత్ మీద ప్రేమ కలిగే అవకాశం ఉంది.

శ్రీలత, మాణిక్యంల మధ్య ఉన్న గతమేంటో తెలిస్తే ఈ సీరియల్ ‌మరింత ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే అభి నిజస్వరూపాన్ని రామలక్ష్మి, సీతాకాంత్ లు కళ్ళారా చూస్తే ఇక వారిద్దరు ఒక్కటవుతారు. అయితే తాజాగా విడుదలైన ఈ సీరియల్ ప్రోమోలో సిరి, ధనలతో పాటు రామలక్ష్మి వస్తుంది.  అన్నయ్య నీకొక సర్ ప్రైజ్ ఉందని  సీతాకాంత్ తో సిరి అనగానే.. ఏంటని అడుగుతాడు. నీ భార్య నీకోసం నీకిష్టమైనవి వండుకొని తీసుకొచ్చిందని సిరి అంటుంది. అవునా..  నా ఉద్దేశం ఏంటమ్మా అంటే.. రామలక్ష్మికి సరిగ్గా వంటరాదు కదా అని అంటాడు. నాకు వంట చేయడం బాగొచ్చు.. నా వంట గురించి మీరు అలా వెటకారం చేయాల్సినవసరం లేదని రామలక్ష్మి అంటుంది.  అంటే ధైర్యంగా తినొచ్చంటావని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి బుంగమూతి పెట్టుకోగ సిరి, ధనలు నవ్వేస్తారు. ఇలా ఈ సీరియల్ ప్రోమో మరింత స్పెషల్ గా ఉంది. ఇక ఈ సీరియల్ ప్రోమో విడుదలైన ఆరు గంటలకే 86K వ్యూస్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం యూట్యూబ్ లోని ఈ ప్రోమో ఓసారి చూసేయ్యండి.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.