Bigg Boss 9 Telugu: భరణి కోసం బిగ్ ఫైట్...హీటెడ్ ఆర్గుమెంట్స్!
on Nov 4, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అవ్వగా తొమ్మిదవ వారం నామినేషన్ ప్రక్రియ సాగింది. ఇందులో క్లోజ్ ఉన్న కంటెస్టెంట్స్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక బిగ్ బాస్ మామ నామినేషన్ రూల్స్ డిఫరెంట్ గా పెట్టాడు. కంటెస్టెంట్స్ అందరిని గార్డెన్ ఏరియాకి పిలిచాడు బిగ్ బాస్.
మీ ముందు కొన్ని బొమ్మలున్నాయి వాటి మీద ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్నాయి.. బజర్ మోగిన వెంటనే బొమ్మల్లోని వేరే వాళ్ల ఫొటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్‌లోకి ముందుగా పరిగెత్తాలి.. అందరికంటే ఆలస్యంగా ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫొటో ఉంటే వారిద్దరూ నామినేషన్ జోన్ లోకి వస్తారు.. చివరికి వారిద్దరిలో ఒకరు నేరుగా ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అవుతారని. దివ్య మొదటి రౌండ్‌కి సంచాలకులని బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక ఫస్ట్ రౌండ్ లో సంజన లాస్ట్ ఉండటంతో తను రీతూని నామినేట్ చేస్తుంది. సెకెండ్ రౌండ్ లో సుమన్ శెట్టి లీస్ట్ రావడం అతని చేతిలో తనూజ బొమ్మ ఉండటంతో తప్పక తనని నామినేట్ చేయాల్సి వస్తుంది కానీ అతను సెల్ఫ్ నామినేట్ అవుతానని అంటాడు. ఇక దివ్య సుమన్ శెట్టిని నామినేట్ చేస్తుంది. భరణి, తనూజ ఇద్దరికి నామినేషన్ సాగుతోంది .
ఇక అందరి నామినేషన్ తర్వాత ఇంటి కెప్టెన్‌గా ఉన్న దివ్యకి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. మీరు తగిన కారణాలు చెప్పి మీరు ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో తనూజని దివ్య నామినేట్ చేసింది. ఒక మనిషికి నీకంటే నేను ఎక్కువ ప్రయారిటీ అనే అభిప్రాయం నీకు ఉందనిపిస్తుంది.. నేను వచ్చి ఇద్దరి మధ్య బాండ్‌ని బ్రేక్ చేశానన్నట్లుగా బయటికి వెళ్లిందని భరణి గురించి చెప్పింది దివ్య. నేను ఆయన్ని నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావ్.. అంతకంటే ఇందులో ఏం లేదంటూ తనూజ అంది. ఈ మాటకి దివ్య రెచ్చిపోయింది. అసలు నువ్వు ఏం గేమ్స్ ఆడావ్.. ప్రతి గేమ్‌లోనూ సపోర్ట్ లేకుండా ఆడలేకపోయావ్.. నువ్వు ఒక పర్ సెప్షన్ లో ఉంటావంటూ తనూజపై ఫైర్ అయింది. భరణి, దివ్య ఇద్దరు కలిసి ఆడుతున్నట్టుగా తనూజ తన నామినేషన్ పాయింట్లు చెప్పింది. దీనిపై దివ్య ఫైర్ అవుతూ తనూజ టాస్కుల తర్వాత ఏడ్చి సింపథీ కోసం ట్రై చేస్తావ్..తను ఆట ఆడకుండా చేసే వాటి గురించి చెప్పింది. దీంతో నీ గేమ్ నువ్వు ఆడుకో.. పక్కవాళ్ల గేమ్ ఆడకు అంటూ తనూజ అంది. నా గేమ్ నేను ఆడుతున్నాను.. నీకు కళ్లు కనిపించట్లేదేమోనని దివ్యపై ఫైర్ అయింది తనూజ. అవునవును అందరిని సపోర్ట్ అడుక్కుంటూ ఉంటావ్.. ఇలా చేతులు కట్టుకొని ఇదే కదా నీ ఆట.. అయినా ఏడుపు గురించి నువ్వే చెప్పాలి.. ప్రతీ గేమ్ తర్వాత ఏడుస్తూనే ఉంటావంటూ తనూజపై దివ్య రెచ్చిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



