Divya Support to Demon Pavan: దివ్వ ఓటు డీమాన్ పవన్‌కి .. అన్నయ్య భరణి పోటు
on Dec 11, 2025

బిగ్ బాస్ ఇప్పటికే పదమూడు వారాలు పూర్తయింది. దివ్య నిఖిత మూడో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి లాజిక్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అది గేమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ భరణితో అన్నయ్య అనే బాండింగ్ తోనే గడిచిపోయింది. ఇక భరణి గారి కుటుంబం గురించి తెలిసిందే కదా.. ఒకవైపు చెల్లి.. ఒకవైపు కూతురు. కూతురు అయిన తనూజతో భరణి క్లోజ్ గా ఉంటే దివ్య అసలు ఒప్పుకోదు.
భరణిని కమాండ్ చేసేది.. ఆ విషయం భరణి తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళతో వీళ్లతో చెప్తుండేవాడు. భరణికి బాలేకపోతే దగ్గరుండి మరి బాగోగులు చూసుకునేది. ఫ్యామిలీ వీక్ లో భరణి కూతురు వచ్చి.. మీరు డాడీపై కమాండింగ్ తగ్గించండి అని చెప్పింది. తనూజతో భరణి కూతురు క్లోజ్ గా పాజిటివ్ గా మాట్లాడతుంది కానీ దివ్యతో అంతగా మాట్లాడదు. దివ్య ఎలిమినేట్ అయినప్పుడు భరణి చాలా ఎమోషనల్ అవుతాడు. నాకు ఈ హౌస్ ద్వారా మంచి అన్నయ్య దొరికాడు అని దివ్య స్టేజ్ పైన చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో కూడా భరణి గారి కూతురు నాతో మాట్లాడలేదు.. నేను హర్ట్ అయ్యానని దివ్య చెప్పింది.

అయితే దివ్య బయటకు వచ్చి రెండు వారాలు పూర్తయింది. అయితే హౌస్ లో భరణితో పాటు హౌస్ మేట్స్ ఆట చూసినట్లుంది. తన గురించి ఎవరు ఏం మాట్లాడారో అన్నీ మనసులో పెట్టుకుంది. అందుకే హౌస్ నుండి బయటకు వచ్చాక భరణికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ తాజాగా డీమాన్ కి ఓటు వేసినట్లు స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హౌస్ లో ఉన్నప్పుడు భరణిని అన్నయ్య లాగా ఫీల్ అయినా చెప్పిన దివ్య తనకి సపోర్ట్ గా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడంతో అందరికి అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యకి కాకుండా ఫ్రెండ్ కి సపోర్ట్ చెయ్యడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే హౌస్ లో ఉన్నవారిలో జెన్యున్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది డీమాన్ పవన్ అనేది అందరికి తెలిసిందే. హౌస్ లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



