Brahmamudi : కోర్టులో తడబడిన అనామిక.. అప్పు సాక్ష్యం కీలకం కానుందా!
on Jul 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -452 లో....అనామిక కళ్యాణ్ ని స్టేషన్ లో ఉండేలా చేసినందుకు ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు బాధపడుతుంటారు. మీడియా వాళ్ళు కళ్యాణ్ ని ప్రశ్నలతో ఇబ్బంది పెడుతారు. ఏంటి రా ప్రేమించానంటే పెళ్లి చేసాం కానీ ఇలా నిన్ను ఇబ్బంది పెడుతుందనుకోలేదని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే అనామిక వాళ్ళు వస్తారు. ఒకసారి అనామిక తో మాట్లాడుతనని రాజ్ తో కావ్య అనగానే.. అవసరం లేదు ఏదైనా కోర్టులో తేల్చుకుందామని రాజ్ అంటాడు.
ఆ తర్వాత ఇప్పటికి ఏం అవలేదు కొంచం ఆలోచించమని అనామికతో కావ్య అనగానే.. నేనేం ఆలోచించను కోర్టులో తేల్చికుందామని అనామిక పొగరుగా సమాధానం చెప్తుంది.ఆ తర్వాత కోర్ట్ లోపలికి వెళ్తారు. బోనులో అనామిక, కళ్యాణ్ లు నిల్చొని ఉంటారు. అనామికకి సపోర్ట్ చేస్తు తన తరుపు లాయర్ మాట్లాడుతుంది. అనామికకి డౌరీ హారాష్మెంట్ ఇంకా వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని నా క్లయింట్‌ని టార్చర్ పెట్టాడని అనామిక లాయర్ కళ్యాణ్ పైన ఆరోపిస్తుంది. ఎన్నో రోజులు ఈ టార్చర్ అనుభవించింది. ఇది వరకు ఈ విషయం పోలీస్ స్టేషను వరకు వెళ్ళింది. ప్రతిరోజు కట్నం కోసం హింసిస్తు నరకం చూపించాడు. ఈ దుగ్గిరాల కళ్యాణ్ అని లాయర్ జడ్జి కి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ తరుపున తన లాయర్ మాట్లాడుతాడు. కళ్యాణ్ ఇతను కవి.. సున్నితమైన మనసు కలవాడు. కళ్యాణ్ గురించి లాయర్ అనామికని అడుగుతాడు. ఎప్పుడు కవితలు రాస్తు ఖాళీగా ఉంటాడు. బిసినెస్ అనే మాట ఎత్తేవాడు కాదని అనామిక అనగానే.. అంటే నువ్వు మీకు కళ్యాణ్ ని పెళ్లి చేసుకోక ముందు అతను కవి.. బిజినెస్ గురించి పట్టించుకోడని తెలియదా అని లాయర్ అడుగుతాడు. తెలుసని అనామిక అంటుంది. ఇక కట్నం గురించి హారాష్ చేశారంటున్నారు. నీ పెళ్లి లో సేట్ కి రెండు కోట్లు మీరు ఇచ్చేది ఉంటే కళ్యాణ్ వాళ్ల అన్నయ్య రాజ్ ఇచ్చి పెళ్లి జరిగేలా చేసాడు. అంత డబ్బులున్నా ఆయన మిమ్మల్ని కట్నం కోసం వేధించాడా అని లాయర్ అనామికని అడుగుతుంటే.. తను తడబడుతుంది. అనామిక తన భర్త కళ్యాణ్ పైన అనవసరమైన ఆరోపణలు చేసిందని కళ్యాణ్ తరపు లాయర్ అంటాడు.
అనామిక లాయర్.. కళ్యాణ్, అప్పుల ఫ్రెండ్ షిప్ ని అక్రమ సంబంధమని ఆరోపిస్తుంది. దాంతో మా మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని కళ్యాణ్ అంటాడు. అలా అయితే అప్పు, కనకంలు ఎందుకు పెళ్లి ఆపాలని చూస్తారని కళ్యాణ్ ని లాయర్ అడుగతుంది. ఆ అప్పు అనే అమ్మాయిని తీసుకొని రండీ అంటూ జడ్జి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)