Brahmamudi : నువ్వు గుమాస్తా కూతురివి నీకెందుకు ఆస్తులు.. అత్తని నిలదీసిన కూతురు!
on Nov 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -565 లో.....రుద్రాణి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. నువ్వు ఆస్తులు పంచమనగానే మా అమ్మ నాన్న పంచుతారు అనుకున్నావా అని రుద్రాణి అంటుంది. ఎందుకు పంచరు నా కొడుకుకి ఆస్తిలో సమాన వాటా ఉందని ధాన్యలక్ష్మి అనగానే.. నా కొడుకుకి కూడా ఉందని రుద్రాణి అంటుంది. కానీ కావ్య ఆస్తులు పంచనివ్వదు చూడమంటూ కావ్య గురించి నెగెటివ్ గా చెప్తుంది.
ఆ తర్వాత ధాన్యలక్ష్మి హాల్లో కి వచ్చి.. ఈ వంశ వారసుడు కళ్యాణ్. వాడికి ఏం న్యాయం చేస్తున్నారు ఇంటి పెద్దగా ఏం ఆలోచించారు మావయ్య అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఇంకాస్తా టైమ్ ఇవ్వమని అడగడం తప్ప ఏం చెయ్యలేని అని సీతారామయ్య అనగానే.. సీతారామయ్యపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. దాంతో ఏంటి నీ ఇంటి నుండి తెచ్చిన ఆస్తులు ఏమన్నా మా ఆస్తులలో కలిపివా అంటూ ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఇంకొకసారి ఈ విషయం గురించి తీస్తే.. ఏం చేస్తానో నాకే తెలియదని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత రుద్రాణి మధ్యలో దూరబోతుంటే స్వప్న ఆపి తనకి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత రాజ్ ఫైల్ పై సంతకం చెయ్యలేదని శృతి చెప్పగానే.. రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి సైన్ పెట్టమంటుంది. నేను పెట్టనని రాజ్ అనగానే. ఆర్డర్ వేస్తున్నానని ఫైల్ రాజ్ దగ్గర పెట్టి కావ్య వెళ్తుంది. ఆ తర్వాత నిన్ను కాదే అనాల్సింది అంటూ రాజ్ ఫైల్ తీసుకొని సీతారామయ్య దగ్గరికి వెళ్తాడు
ఆ తర్వాత ఇదంతా మీ వళ్లే తాతయ్య.. నువ్వు కావ్యని సీఈఓ చేసావ్.. అప్పుడే కళ్యాణ్ ఆటో నడుపుతున్న విషయం తెలిసింది. అందుకే పిన్నికి కోపం వచ్చిందని రాజ్ అంటాడు. కానీ రాజ్ మాటలని సీతారామయ్య పట్టించుకోడు. తర్వాత ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి, రాహుల్ అనుకుంటుంటే అప్పుడే స్వప్న వచ్చి.. మీకెందుకు ఆస్తులు.. నువ్వు గుమస్తా కూతురివి.. తాతయ్య గారు పెంచుకున్నారు.. నీకు వాటా ఎక్కడిదని రాహుల్, రుద్రాణిలకి కోపం వచ్చేలా స్వప్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read